శుక్రవారం, జులై 15, 2016

ఆది అనాదియు నీవే దేవా...

ఈ రోజు తొలేకాదశి సందర్భంగా ఆ శ్రీమన్నారయణుని తలచుకుంటూ భక్తప్రహ్లాద చిత్రం కోసం బాలమురళీకృష్ణ గారు గానం చేసిన ఈ పాట పాడుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : భక్తప్రహ్లాద (1967)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ

ఆది అనాదియు నీవే దేవా
నింగియు నేలయు నీవే కావా
ఆది అనాదియు నీవే దేవా

అంతట నీవే ఉండెదవు
అంతట నీవే ఉండెదవు
శాంతివై కాంతివై నిండెదవు
ఆది అనాదియు నీవే దేవా

నారద సన్నుత నారాయణా
నారద సన్నుత నారాయణా
నరుడవో సురుడవో శివుడవో
లేక శ్రీసతి పతివో
నారద సన్నుత నారాయణా

దానవ శోషణ మానవ పోషణ
శ్రీచరణా భవహరణ ॥
దానవ శోషణ మానవ పోషణ
శ్రీచరణా భవహరణ ॥
కనకచేల భయ శమన శీల
నిజ సుజనపాల హరి సనాతనా
క్షీర జలధిశయనా అరుణ కమలనయనా
గాన మోహనా! నారాయణా!



4 comments:

That's a nice song - reminds me of good ol' childhood days.

థాంక్స్ అజ్ఞాత గారు..

తొలియేకాదశి శుభాకాంక్షలండీ..

థాంక్స్ శాంతి గారు.. మీకు కూడా...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.