శనివారం, ఆగస్టు 08, 2015

డీరిడిరిడిరి డీరిడీ..

గూఢాచారి నూటపదారు చిత్రం నుండి ఒక సరదా అయిన కృష్ణ గారి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గుఢాచారి 116 (1966)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

ఓహో వాలు చూపుల వన్నెలాడి
నిన్ను చూస్తేనే చాలు ఒక్కసారి

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ

చెంప మీదా చిటికేస్తే సొంపులన్నీ శోధిస్తే
ఊహలెన్నో ఊరిస్తే కోరి వస్తే 
హహహహ ఉహూ..

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ

అందమైన దానివీ ఆశ పెట్టే దానివీ
పాడు సిగ్గూ దేనికీ వలచి వస్తే 
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ

చిలిపి చూపుల కన్నులూ 
మొలక నవ్వుల పెదవులూ
పలకరించే వన్నెలూ.. పులకరిస్తే 
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ

నిన్న సంగతి మరచిపో 
నేటి సుఖమే తలచుకో
రేపు ఉండేదెక్కడో ఇపుడు మాత్రం 
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ


2 comments:

ఈ పాటలకి సారూప్యత, పోలికలను కలిగిన
హిందీ, తమిళ, కన్నడ పాటలు కూడా ఉన్నవి.
వానిని కూడా సూచిస్తే గానప్రియులకు మేలు ఔతుంది.
మీ కృషికి జోహార్లు [కుసుమాంబ1955]

ఘంటసాల గారి గొంతు హుషారైన జలపాతం లా మనని కుదిపేస్తుందీ పాటలో..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail