సత్యం గారి సంగీత సారధ్యంలో వచ్చిన ఓ మధుర గీతం ఈరోజు తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : ఏ.ఎం.రాజా , పి.సుశీల
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ
ఏ నోము ఫలమో..ఏ దేవి వరమో..
నీ దాననైనానులే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..
ఈ రేయి నీకోసమే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
పానుపు మురిసింది మన జంట చూసి
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి
వలచిన ప్రియునీ..కలసిన వేళ..
వలచిన ప్రియునీ..కలసిన వేళ..
తనువంత పులకింతలే..ఏ..ఏ..ఏ..ఏ
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
దివిలో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు..
దివిలో నెలరాజు దిగివచ్చినాడు..
భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు..
నీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నీ తోటి చెలిమి..నిజమైన కలిమి
నిలవాలి..కలకాలమూ..ఊ..ఊ..ఊ.
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు
నీలోనే చూశానులే...
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు..
ఈ రేయి నీకోసమే...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
1 comments:
తెలీని సన్నని విషాదం దాగి వుంటుందీ పాట పల్లవిలో..బహుశా ఆ రాగం వల్లనేమో మరి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.