ఆదివారం, జూన్ 14, 2015

ఓ బుచ్చిబాబు...

నాటకాలరాయుడు చిత్రం కోసం నాగభూషణం గారు గానం చేసిన ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. పాట ట్యూన్ సరదాగా సాగినా ఇందులో బోలెడన్ని జీవిత సత్యాలను గుప్పించేశారు ఆత్రేయగారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : నాటకాలరాయుడు (1969) 
సంగీతం : జి.కె.వెంకటేష్ 
సాహిత్యం : ఆత్రేయ 
గానం : నాగభూషణం 

ఇదే జీవితమురా ఇదే దాని కతరా 
తంటాల బ్రహ్మయ్యా తకరార్లు ఇవిరా 

ఓ... బుచ్చిబాబు... 
ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు 
తలరాత ఒకే తికమక మకతిక 
ముఖ ముఖానికి రకరకాలుగా 
తికమక మకతిక తికమక 

ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు
తలరాత ఒకే తికమక మకతిక 
ముఖ ముఖానికి రకరకాలుగా 
తికమక మకతిక తికమక 
ఓ బుచ్చిబాబు..

బడా యాక్టరు అవుతానంటూ 
బడాయి కొట్టి వచ్చావు 
భలే భలేరా.. భలే భలేరా 
కొళాయి దగ్గర అంట్లే తోమేవు
చివరకు అంట్లే తోమేవు 
ఓ అబ్బాయి ఏ పనికైనా ఫిట్టూ 
నువ్వు ఫిట్టూ ఇది కరకట్టు 
ఇవి తోమి పెట్టు 
తోము తోము తోము తకథోం..

ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు
తలరాత ఒకే తికమక మకతిక 
ముఖ ముఖానికి రకరకాలుగా 
తికమక మకతిక తికమక 
ఓ బుచ్చిబాబు

ప్రపంచమే ఒక నాటకరంగం 
కదిలిస్తే చదరంగం 
నవాబు వేషం వేసేవాడు 
జవాను పని చేస్తాడు 
చివరకు గరీబుగా ఛస్తాడు 
ఓ అబ్బాయి కళాజీవితం 
లక్కు ఒక ట్రిక్కు 
ఒకరికి లక్కు ఒకరికి ట్రిక్కు 
లక్కు ట్రిక్కు లక్కూ 

ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు
తలరాత ఒకే తికమక మకతిక 
ముఖ ముఖానికి రకరకాలుగా 
తికమక మకతిక తికమక 
ఓ బుచ్చిబాబు

ఒకడి ఆకలికి అంబలి నీళ్ళు 
ఒకడికి పాలు పళ్లు 
భలే భలేరా.. భలే భలేరా 
దగాల దేవుడ బాగా పంచావు 
కోతికి బాబనిపించావు
ఓ బ్రహ్మయ్యో నీ లీలలే 
గడబిడ యడ పెడ 
నీ గడాబిడా మాకెడాపెడా 
గడబిడ ఎడపెడ గడబిడ 

ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చి బాబు
తలరాత ఒకే తికమక మకతిక 
ముఖ ముఖానికి రకరకాలుగా 
తికమక మకతిక తికమక 
ఓ బుచ్చిబాబు....


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail