సోమవారం, నవంబర్ 03, 2014

ఓం.. నమశ్శివాయ..

ఈరోజు కార్తీక సోమవారం, క్షీరాబ్ది ఏకాదశి కూడా.. మరి ఈ పర్వదినాన కాసేపు పరమశివుడ్ని తలచుకుందామా. ఇందులో వేటూరి గారి సాహిత్యం నాకు చాలా ఇష్టం ఆ సర్వేశ్వరుని గురించి ఎంతచక్కగా రాశారో అనిపిస్తుంది. అలాగే ఇందులో జానకి గారి గాత్రానికి గాయని శైలజ నర్తించడం ఒక విశేషం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : సాగరసంగమం (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి 
గానం : జానకి 
 
ఓం.. ఓం.. ఓం..
ఓం.. నమశ్శివాయ.. ఓం.. నమశ్శివాయ...
చంద్ర కళాధర సహృదయ...
చంద్ర కళాధర సహృదయ...
సాంద్రకళా పూర్ణోదయ.. లయ నిలయా...
ఓం...
ఓం... నమశ్శివాయ.. 
ఓం... నమశ్శివాయ...
పంచభూతములు ముఖ పంచకమై...
ఆఋ ఋతువులూ ఆహార్యములై...
పంచభూతములు ముఖ పంచకమై...
ఆఋ ఋతువులూ ఆహార్యములై...
ప్రకృతీ పార్వతి నీతో నడచిన
ఏడు అడుగులే స్వరసప్తకమై
స గ మ ద ని స గ గ మ ద ని స గ మ
గగగ ససస ని గ మ గ స ని ద మ గ స 
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై -
నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా... ఆ...
నీ మౌనమే.. దశోపనిషత్తులై ఇల వెలయా...

ఓం...ఓం..
ఓం... నమశ్శివాయ...


త్రికాలములు నీ నేత్రత్రయమై..
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమై..
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు..
నీ సంకల్పానికి ఋక్విజవరులై...
అద్వైతమే నీ ఆది యోగమై -
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస నీ గానమే
జత్ర గాత్రముల శృతి కలయా...

ఓం.. ఓం..
ఓం... నమశ్శివాయ..
చంద్ర కళాధర సహృదయా...
సాంద్రకళా పూర్ణోదయా.. 
లయ నిలయా...


2 comments:

ఈ క్షీరాబ్ది ఏకాదశి మీ ఇంట పాల వెలుగులు నింపాలి వేణూగారూ..

థాంక్స్ శాంతి గారు.. విష్ యూ ద సేం..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail