బుధవారం, నవంబర్ 12, 2014

అందాల ఓ చిలకా...

లేత మనసులు సినిమా కోసం పిబిశ్రీనివాస్ గారు పాడిన ఈ పాట చాలా బాగుంటుంది. ఒక చరణం హీరో అడిగే ప్రశ్నలా మరో చరణం దానికి హీరోయిన్ ఇచ్చే సమాధానంలా సాగే లిరిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : లేత మనసులు (1966)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : దాశరథి
గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను

 
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
కురుల మోముపై వాలెనేలనో
విరులు కురులలో నవ్వెనెందుకో
అడుగుతడబడే చిలకకేలనో
పెదవి వణికెను చెలియకెందుకో

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
కురులు మోముపై మరులు గొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగుతడబడే సిగ్గు బరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో

అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను

 
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి 
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధుర మార్గము మనసు చూపులే
నీవు పాడగా నేను ఆడగా
యుగము క్షణముగా గడచిపోవుగా

 
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా


4 comments:

తెలుగు సినీ గీతాలలో ఒక చక్కటి సుమధుర గీతం ...
ఎన్నిసార్లు విన్నా చక్కెర తగ్గని ఇరువురి గాత్రం ...
thanks for the revival ...

"ఎన్నిసార్లు విన్నా చక్కెర తగ్గని ఇరువురి గాత్రం ..."
ఆహా ఎంత చక్కగా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ nmraobandi గారు.

ఎవ్వర్ గ్రీన్ లవ్ లెటర్..

హహహ కరెక్ట్ శాంతి గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail