ఆదివారం, నవంబర్ 30, 2014

ఏనాడైనా అనుకున్నానా...

అందమైన మెలోడీస్ కి కేరాఫ్ అడ్రస్ ఎస్.ఎ.రాజ్కుమార్. తన స్వరసారధ్యంలో సిరివెన్నెల గారు రచించిన ఒక అందమైన పాటను ఈరోజు తలచుకుందాం. ముగ్ధ సౌందర్యానికి భాష్యం చెప్పే సౌందర్య, హ్యాండ్సమ్ హీరో నాగార్జునలపై చిత్రీకరించడం ఈపాట అందాన్ని మరింత పెంచింది. హరిహరన్ చిత్రల గాత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఎదురు లేని మనిషి (2001)  సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం...

శనివారం, నవంబర్ 29, 2014

మగరాయ పంతామేలరా...

మాయామశ్చీంద్ర చిత్రంలో సుశీల గారు గానం చేసిన ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందామా. ఇందులో వాణీశ్రీ గారు చాలా బాగుంటారు. సాహిత్యం ఎవరు రాశారో తెలియదు కానీ ఆకట్టుకుంటుంది. నాకు నచ్చిన ఈపాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు. Magaraya Panthaamelaraa by venusrikanth-darla చిత్రం : మాయామశ్చీంద్ర (1975)  సంగీతం : సత్యం  సాహిత్యం : ?? గానం : పి.సుశీల  మగరాయ పంతామేలరా.....

శుక్రవారం, నవంబర్ 28, 2014

ఇది ఆమని సాగే...

జేగంటలు సినిమాలోని ఒక హుషారైన పాట ఈరోజు తలచుకుందాం... రచన వేటూరి సుందరరామ్మూర్తి గారు, సంగీతం కె.వి.మహదేవన్. ఇది కూడా ఒకప్పుడు నేను రేడియోలో రెగ్యులర్ గా విన్నపాట. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జేగంటలు (1981) సంగీతం : కె.వి. మహదేవన్ సాహిత్యం : వేటూరి గానం: బాలు, సుశీల ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం మనోవేగమున మరోలోకమున పరుగులు తీసే మనోరథం  ఇది ఆమని...

గురువారం, నవంబర్ 27, 2014

ఎవరీ అమ్మాయని అడిగా...

ఇళయరాజా గారి అబ్బాయ్ యువన్ శంకర్ రాజా కంపోజిషన్ లో వచ్చిన ఒక అద్భుతమైన పాట ఇది. వెన్నెలకంటి గారి లిరిక్స్ కూడా డబ్బింగ్ పాట అయినా చాలా చక్కగా ఉంటాయి. హరిచరణ్ గానం గురించి చెప్పనే అక్కర్లేదు. చిత్రీకరణ సైతం నాకు చాలా ఇష్టం. నాకు నచ్చిన ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : నేనే అంబాని (2010) సంగీతం : యువన్ శంకర్ రాజా సాహిత్యం : వెన్నెలకంటి గానం : హరిచరణ్ ఎవరీ...

బుధవారం, నవంబర్ 26, 2014

పాడలేను పల్లవైనా...

సింధుభైరవి చిత్రంలోని మరో చక్కని పాటను ఈరోజు తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం: సింధుభైరవి (1985) రచన: రాజశ్రీ సంగీతం: ఇళయరాజా గానం: చిత్ర పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను  పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా తోచిన...

మంగళవారం, నవంబర్ 25, 2014

తెల్లచీరకు తకధిమి...

లతామంగేష్కర్ గారు తెలుగులో పాడిన తొలిపాటట ఇది. తెలుగు నెలల పేర్లతో వేటురి గారు సరదాగా రాసిన లిరిక్స్ బాగుంటాయి. ఇళయరాజా గారి సంగీతం గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. సవరణ : ఈటీవీ వారి సౌందర్యలహరి ప్రోగ్రామ్ లో రాఘవేంద్రరావు గారు చెప్పిన మాట ఆధారంగా ఇదే లతగారి మొదటి పాట అని నేననుకున్నాను కానీ నిజానికి, 1955 లో వచ్చిన 'సంతానం' అనే సినిమాకోసం అనిసెట్టి-పినిశెట్టి రాసిన...

సోమవారం, నవంబర్ 24, 2014

వెన్నెలా.. వెన్నెలా.. మెల్లగా రావే..

ప్రేమదేశం సినిమాలోని ఒక అందమైన పాటతో ఈ వారాన్ని ప్రారంభిద్దామా.. కమ్మనైన జోలపాట ఇంతకన్నా బాగా ఎవరూ చేయలేరేమో అనిపించేలా కంపోజ్ చేశారు రెహ్మాన్. భువనచంద్ర గారి లిరిక్స్ కూడా సన్నివేశానికి తగినట్లుంటాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ప్రేమదేశం (1996) సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్  సాహిత్యం : భువనచంద్ర  గానం : మనో, ఉన్నికృష్ణన్, డామ్నిక్ వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..పూవుల...

ఆదివారం, నవంబర్ 23, 2014

ఓ ఓహో చారుశీల...

గుణసుందరి కథ చిత్రం లోని ఈ పాట భలే ఉంటుంది. శివరాం గారు పాడిన విధానం మధ్యలో ఓహోఓఓ అనో లల్లల్ల అనో తీసే రాగాలు వినడానికి సరదాగా భలే ఉంటాయి. మీరూ ఈ పాట చూసీ వినీ ఈ సినిమాని మరోసారి తలచుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : గుణసుందరికథ(1949) సంగీతం : ఓగిరాల రామచంద్రరావు సాహిత్యం : పింగళి గానం : వి.శివరాం ఓ..ఓహో.. చారుశీలా..  లేజవరాలా.. సొగసుభళా..  ఓ రూపబాలా.. చిందెను  వలపు...

శనివారం, నవంబర్ 22, 2014

ఇలా ఎంత సేపు...

సిరివెన్నెల గారి పాటలలో నాకు చాలా నచ్చే పాట ఇది. ముఖ్యంగా రెండో చరణం చాలా అద్భుతంగా రాశారనిపిస్తుంది. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శశిరేఖాపరిణయం (2008)సంగీతం : మణిశర్మ, విద్యాసాగర్సాహిత్యం : సిరివెన్నెలగానం : రాహుల్ నంబియార్ఇలా .. ఎంత సేపు నిన్ను చూసినాసరే .. చాలు అనదు కంటి కామనాఎదో .. గుండెలోన కొంటె భావనాఅలా .. ఉండిపోక పైకి తేలునాకనులను ముంచిన కాంతివోకలలను...

శుక్రవారం, నవంబర్ 21, 2014

చెన్నై చంద్రమా...

చక్రి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి (2003) సంగీతం : చక్రి సాహిత్యం : కందికొండ గానం : చక్రి ఆ.. ఆ.. ఆ.. ఆ.. చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరే తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా..మనసే చేజారే చెన్నై చంద్రమా..మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరే తెగించి...

గురువారం, నవంబర్ 20, 2014

దేవీ మౌనమా...

ప్రేమాభిషేకం సినిమాలో అలిగిన ప్రేయసిని ప్రసన్నం చేసుకునేందుకు హీరోగారు పడే పాట్లేమిటో పాడే పాటలేమిటో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం :  ప్రేమాభిషేకం (1981)సంగీతం : చక్రవర్తిసాహిత్యం : దాసరిగానం : బాలు, సుశీలదేవి మౌనమా.. శ్రీదేవి మౌనమాదేవి మౌనమా.. శ్రీదేవి మౌనమానీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పై.. హా...దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమాదేవి మౌనమా.. శ్రీదేవి మౌనమామౌన...

బుధవారం, నవంబర్ 19, 2014

కుందనపు బొమ్మ...

రహ్మాన్ సంగీత సారధ్యంలో వచ్చిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఏ మాయ చేశావే (2010) సంగీతం : రెహమాన్ సాహిత్యం : కళ్యాణి మీనన్, అనంత్ శ్రీరామ్ గానం : బెన్నీ దయాళ్, కళ్యాణి మీనన్ ఆహా...అహ హ....బొమ్మ నిను చూస్తూనే రెప్ప వేయడం మరిచా...హేఅయినా హే...ఏవో....హే..కలలు ఆగవే తెలుసా..హే తెలుసా నా చూపు నీ బానిస..నీలో..నాలో..లోలోనును వెచ్చనైనది మొదలయిందమ్మాఓ...ఓ..కుందనపు...

మంగళవారం, నవంబర్ 18, 2014

జిలిబిలి పలుకుల...

ఇళయరాజా, వేటూరి, వంశీ గార్ల కలయికలో పాటల గురించి వర్ణించడానికి మాటలు సరిపోవేమో కదా... అలాంటి కలయికలో వచ్చిన ఒక అద్భుతమైన పాట ఈ "జిలిబిలి పలుకుల" పాట. నాకు చాలా ఇష్టమైన ఈపాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం :  సితార (1983) సంగీతం :  ఇళయరాజా సాహిత్యం :  వేటూరి గానం :  బాలు, జానకి  జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా కిలకిల...

సోమవారం, నవంబర్ 17, 2014

మహా ప్రాణదీపం...

నేడు ఈఏడాదికి చివరి కార్తీక సోమవారం కదా మరి ఈ సందర్బంగా పరమశివుని తలచుకుంటూ శ్రీ మంజునాథ సినిమా కోసం శంకరమహదేవన్ గారు గానం చేసిన ఈ అద్భుతమైన పాటను గుర్తు చేసుకుందామా. శంకర్ మహదేవన్, అర్జున్ ఇద్దరూ కలిసి ఈ పాటను శిఖరాగ్రానికి చేర్చారు, విన్న ఎవరికైనా భక్తి భావంతో ఒళ్ళు పులకిస్తుందనడంలో ఏ సందేహం లేదు. మీరూ చూసీ వినీ తరించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీ మంజునాథ సంగీతం : హంసలేఖ సాహిత్యం...

ఆదివారం, నవంబర్ 16, 2014

సహానా శ్వాసే వీచెనో...

శివాజి సినిమాకోసం ఏ.ఆర్.రహ్మాన్ స్వరపరచిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం... ఈ పాట సంగీతం మంచి మెలోడియస్ గా ఉండి ఆకట్టుకుంటుంది. గ్లాస్ హౌస్ లో ఈ పాటను శంకర్ చిత్రీకరించిన విధానం ఒక అద్భుతాన్ని చూస్తున్న అనుభూతినిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శివాజీ(2007)సంగీతం : ఎ.ఆర్.రెహమాన్సాహిత్యం : సుద్దాల అశోక్‌తేజగానం : ఉదిత్ నారాయణ్, చిన్మయిసహానా శ్వాసే వీచెనోసహారా పూవై పూచెనో సహానా శ్వాసే...

శనివారం, నవంబర్ 15, 2014

రసమంజరీ...

సింధుభైరవి సినిమాకోసం ఇళయరాజా గారి స్వరకల్పనలో ఏసుదాస్ గారు పాడిన ఈ చక్కని పాట ఈరోజు మీకోసం. ఏసుదాస్ గారూ ఇళయరాజా గారి కలయికలో వచ్చిన పాట గురించి నేను వ్యాఖ్యానించగలిగినంతటి వాడనా మీరే విని ఎంత బాగుందో తెలుసుకోండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : సింధుభైరవి (1985) సంగీతం : ఇళయరాజా రచన : రాజశ్రీ గానం : కె.జె.ఏసుదాస్ రసమంజరీ.. సొగసైన కలికి సుఖకేళి పడతి స్వరమధువు ప్రియ వధువు కులుకుల కొలికి...

శుక్రవారం, నవంబర్ 14, 2014

పిల్లలూ దేవుడూ చల్లనివారే...

పిల్లలకూ, పెద్దలకూ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్బంగా లేతమనసులు చిత్రంలోని పాటను తలచుకుందామా.. ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ఈ పాట నాకు చాలా ఇష్టం, పాటంతా క్లాస్ రూమ్ లో పాడుతున్న ఒక్క చిన్న పాపపైనే చిత్రీకరించినా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : లేత మనసులు (1966)సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్సాహిత్యం : ఆరుద్రగానం :  సుశీల...

గురువారం, నవంబర్ 13, 2014

చిన్ని చిన్ని కోయిలల్లే...

మౌనరాగం సినిమాలోని ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందామా. ఇందులో జానకి గారి స్వరం నాకు చాలా ఇష్టం ముఖ్యంగా చరణాలలో... ఇళయరాజా గారి సంగీతం గురించి చెప్పేదేముంది అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. సినిమా : మౌనరాగం(1986) సంగీతం : ఇళయరాజా రచన : రాజశ్రీ గానం : జానకి  లాలలాల లాలలాల లాలలాల లాలలాల లలలాల లలలాల లలలాల లలలాల లలలాల లలలాల లాలా లాలాలాలా..  చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.