
హరికథా ప్రక్రియపై నాకున్న మక్కువ మీ అందరికీ తెలిసినదేగా ముఖ్యంగా సినిమాల్లో వచ్చే హరికథలంటే నాకు మరీ ఇష్టం. సూత్రధారులు సినిమాలోని ఈ రుక్మిణీ కళ్యాణ హరికథ కూడా బాగుంటుంది. సాథారణంగా కథకులుగా మగవాళ్ళనే చూస్తుంటాం అయితే ఈ సినిమాలో రొటీన్ కి భిన్నంగా కె.విశ్వనాధ్ గారు కె.ఆర్.విజయ గారితో హరికథ చెప్పించారు. ఆవిడ ఆహార్యానికి తగినట్లుగా సుశీల గారు నేపధ్యగానం చేశారు, కనులు మూసుకుని కథ వింటూంటే సన్నివేశాలు (సినిమాలోవి కాదు రుక్మిణీ కళ్యాణంలోని సన్నివేశాలు)...