బుధవారం, జులై 03, 2013

రాధా మానస రాగ సుగంధా

కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడం మూలంగా ఎంతో చక్కగా స్వరపరచిన గీతాలు సైతం మరుగున పడిపోతాయ్. అలా దెబ్బతిన్నపాటే "ఆ ఒక్కడు" సినిమాలోని ఈ చక్కటి గీతం. వేదవ్యాస్ గారు రాయగా నారాయణ్ గారు గానం చేసారు. ఈ గీతానికి మణిశర్మ స్వరాన్నందించారో లేక వేరే ఎవరైనా అందించారా అన్న అనుమానం నాకైతే ఉంది. అంటే అంత మధురమైన స్వరాన్ని అందించారు. పాట వింటూ మరో లోకాలలోకి పయనిస్తామనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. సినిమా పాటలలో వచ్చే భక్తిగీతాలలో అలరించే అతికొద్ది పాటలలో ఇదీ ఒకటి. పూర్తి పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ క్లిక్ చేసి వినవచ్చు పాట సినిమాలో సగమే ఉన్నట్లుంది ఆ వీడియో ఈ క్రింద ఇస్తున్నాను చూడండి.

చిత్రం : ఆ ఒక్కడు
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేదవ్యాస రంగ భట్టాచార్య
గానం : డాక్టర్ నారాయణ్.

రాధా మానస రాగ సుగంధా కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా
శ్రీ బృందావన మోహన మురళీ రవళి రసకందా
రారా గోకుల నంద ముకుందా రారా కరివరదా

రాధా మానస రాగ సుగంధా కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా


మంచిని పెంచే మధుమయ హృదయా
వంచన తుంచే వరగుణ వలయా
మమతను పంచే సమతా నిలయా
భక్తిని ఎంచే బహుజన విజయా
మాయా ప్రభవా మాధవ దేవా
మహిమా విభవా మధుభావా
శ్రీ కృష్ణా మా తృష్ణా నీ పైనా

రాధా మానస రాగ సుగంధా కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా


ధర్మము తరిగీ నలిగిన వేళ
చరలో చేరిన ఓ యదు వీరా
కళగా సాగే కరుణాధారా
పరమై వెలిగే వర మందారా
పదములు చూపే పరమోద్ధారా
భారము నీదే భాగ్యకరా
శ్రీ కృష్ణా మా తృష్ణా నీ పైనా

రాధా మానస రాగ సుగంధా కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా
శ్రీ బృందావన మోహన మురళీ రవళి రసకందా
రారా గోకుల నంద ముకుంద రారా కరివరదా

రాధా మానస రాగ సుగంధా కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా
 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail