గురువారం, జులై 18, 2013

కుకుకూ.. కోకిల రావే..

ఇళయరాజా వంశీ కలిస్తే జరిగే మ్యూజిక్ మాజిక్ మనకందరికి తెలిసినదే కదా మరి వారికి ధీటుగా వేటూరి గారి కలం కూడా కలిస్తే ఇదిగో ఇలా కలకాలం నిలిచిపోయే క్లాసిక్స్ తయారై మన మనసులని తనువులని కూడా ఓలలాడిస్తాయి. ఈ పాట చిత్రీకరణ పరంగా కూడా చాలా ఇష్టం నాకు.  

భానుప్రియ సింపుల్ ఎక్స్ప్రెషన్స్, డాన్సర్స్ చేతులు మాత్రమే కనిపించేలా డాన్సులు, పక్షులు, ఆ కోటా అన్నీ... చిన్నతనంలో చూసినపుడు అనుభవించిన టెన్షన్ కూడా ఇంకా గుర్తే :-) సితార అన్నగారు కార్లో వచ్చేస్తుంటారు, హీరో హీరోయిన్లు ఇద్దరూ సీక్రెట్ గా కబుర్లు చెప్పుకోవాల్సినవాళ్ళు ఇల్లంతా తిరుగుతూ పాడుకుంటుంటారు వీళ్ళు ఎక్కడ దొరికిపోతారో సమయానికి గమనిస్తారో లేదో అని గోళ్ళు కొరికేసుకుంటూ సీట్ చివర కూర్చుని చూసిన క్షణాలు ఎప్పుడు పాట వింటున్నా అలా కళ్ళముందు కదులుతాయి :) 

ఈ చక్కని పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినండి. వీడియో కూడా చూడాలనుకుంటే క్రింద ఎంబెడ్ చేసిన వీడియో చూడవచ్చు. 



చిత్రం : సితార
సాహిత్యం : వేటూరి
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు, జానకి

కుకుకూ.. కుకుకూ..
కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే
కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. కుకు..
రాణి వాసము నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో
కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. ఏ..

రంగుల లోకం పిలిచే వేళ.. రాగం నీలో పలికే వేళ..
విరులా తెరలే తెరచి రావే.. బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో
స్వరమై రావే విరిపొదల ఎదలకు

కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. ఏ..

పిప్పీ పిప్పీ పిప్పీ పిప్పీ పిప్పీ.. డుండుం టట డుండుం టట..       
పిప్పీపి పీపీ పీపీపిపీ.. డుండుం టట డుండుం టట..
పీపీపి పీపీపి పిప్పీపి.. డుండుం టట డుండుం టట..
పిప్పీపి పీపీ పీపీపిపీ.. పీపీపి పీపీపి పిప్పీపి
పిప్పీపి పీపి పిప్పీపి.. పీపీపి పీపీపి పిప్పీపి
పీపీపి.. పీపీపి.. పీపీపి.. పీపీపీ..ఓ..హ్.హ్.హ్...

సూర్యుడు నిన్నే చూడాలంట.. చంద్రుడు నీతో ఆడాలంట..
బురుజూ బిరుదూ విడిచి రావే.. గడప తలుపూ దాటి రావే..
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
లయగా రావే ప్రియ హృదయ జతులతో

కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. కుకు..
కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. కుకు..
రాణి వాసము నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో
కుకుకూ.. కుకు..
కుకుకూ.. కుకు.. కోకిల రావే.. ఏ..

2 comments:

భానుప్రియ కళ్ళు ఈ సినిమా లో చాలా బాగుంటాయి,
పాటల కు ఆ కళ్ళు మరింత అందం తెచ్చాయి :)
మీ ఈ పోస్ట్ వల్ల మరో సారి సితార ని రివిజన్ చేశా :))
థాంక్ యు వేణు గారు :)

హహహ థాంక్స్ ఫోటాన్ :-) ఎస్ భానుప్రియ కళ్ళు చాలా expressive కూడా సినిమాలో సగం నటన కళ్ళతోనే చేసేస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.