బుధవారం, జులై 24, 2013

అత్తారింటికి దారేది – Lyrics All songs.

అటాచ్ చేసిన వీడియోలో ఆడియో సాంగ్స్ ఒక వరుసలో ఉన్నాయ్ అదే వరుసలో పాటల సాహిత్యం(లిరిక్స్) ఈ క్రింద ఇస్తున్నాను. యూట్యూబ్ యాక్సెస్ లేని వారు ఈ పాటల ఆడియో మాత్రం వినాలనుకుంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. ఈ సినిమా పాటలపై నా అభిప్రాయాన్ని నా మెయిన్ బ్లాగ్ లో ఇక్కడ చదవచ్చు.  ~*~*~*~*~*~*~*~ ఆరడుగుల బుల్లెట్టు ~*~*~*~*~*~*~*~ చిత్రం : అత్తారింటికి దారేది సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : శ్రీమణి గానం : విజయప్రకాష్, సాకీ బై MLR కార్తికేయన్. గగనపు...

గురువారం, జులై 18, 2013

కుకుకూ.. కోకిల రావే..

ఇళయరాజా వంశీ కలిస్తే జరిగే మ్యూజిక్ మాజిక్ మనకందరికి తెలిసినదే కదా మరి వారికి ధీటుగా వేటూరి గారి కలం కూడా కలిస్తే ఇదిగో ఇలా కలకాలం నిలిచిపోయే క్లాసిక్స్ తయారై మన మనసులని తనువులని కూడా ఓలలాడిస్తాయి. ఈ పాట చిత్రీకరణ పరంగా కూడా చాలా ఇష్టం నాకు.   భానుప్రియ సింపుల్ ఎక్స్ప్రెషన్స్, డాన్సర్స్ చేతులు మాత్రమే కనిపించేలా డాన్సులు, పక్షులు, ఆ కోటా అన్నీ... చిన్నతనంలో చూసినపుడు అనుభవించిన టెన్షన్ కూడా ఇంకా గుర్తే :-) సితార అన్నగారు కార్లో వచ్చేస్తుంటారు,...

బుధవారం, జులై 03, 2013

రాధా మానస రాగ సుగంధా

కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడం మూలంగా ఎంతో చక్కగా స్వరపరచిన గీతాలు సైతం మరుగున పడిపోతాయ్. అలా దెబ్బతిన్నపాటే "ఆ ఒక్కడు" సినిమాలోని ఈ చక్కటి గీతం. వేదవ్యాస్ గారు రాయగా నారాయణ్ గారు గానం చేసారు. ఈ గీతానికి మణిశర్మ స్వరాన్నందించారో లేక వేరే ఎవరైనా అందించారా అన్న అనుమానం నాకైతే ఉంది. అంటే అంత మధురమైన స్వరాన్ని అందించారు. పాట వింటూ మరో లోకాలలోకి పయనిస్తామనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. సినిమా పాటలలో వచ్చే భక్తిగీతాలలో అలరించే అతికొద్ది పాటలలో ఇదీ ఒకటి....

మంగళవారం, జులై 02, 2013

నీ జతగా నేనుండాలీ..

ఎవడు సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన ఈ మెలొడీ బాగుంది మీరు విన్నారా? ముఖ్యంగా మొదటి చరణంలో కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లూ చూస్తూ ఉన్నా రాలేదే అని దెబ్బలాడే ప్రేయసితో కల్లోకి రావాలంటే నువు నిద్రపోవాలిగదా అని రెప్పలబైటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోకపోగా తిడతావే అని చెప్పే సమాధానం చాలాచక్కగా ఉంది :) చరణం చివరిలైన్లు స్వరపరచడంలో దేవీశ్రీప్రసాద్ ఎందుకో తడబడ్డాడనిపించినా మొత్తం పాట వినడానికి బాగుంది శ్రేయఘోషల్ కార్తీక్ ల స్వరాలు ఈ చక్కని డ్యూయట్ కి నిండుదనాన్ని చేర్చాయ్. ఆడియో లింక్స్ నాకు ఎక్కడా దొరకలేదు మీకు తెలిస్తే కామెంట్స్ లో పంచుకోండి. షార్ట్ ప్రొమో ఇక్కడ క్లిక్ చేసి చూడచ్చు. పూర్తి పాట ఇక్కడ కింద ఇచ్చిన వీడియోలో...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.