బుధవారం, ఏప్రిల్ 24, 2013

Circle of Life - Lion King

మొదటిసారి ఎపుడూ అద్భుతమే, ఆ అనుభూతిని జీవితాంతం మరిచిపోలేమన్నదీ సత్యం. అప్పటివరకూ కార్టూన్ ఫిల్మ్ అంటే టీవీల్లో శనివారం సాయంత్రాలు అరగంటపాటు వచ్చే జెయింట్ రోబోట్ ఇంకా ఆదివారం ఉదయం వచ్చే జంగిల్ బుక్, డక్ టేల్స్ లాంటివి టివి ఫిల్మ్స్ మాత్రమే అని తెలిసిన నాకు ఒకేసారి పెద్ద స్క్రీన్ పై గంటన్నరపాటు కార్టూన్ సినిమా చూడడం అంటే ఆ విషయమే నమ్మశక్యంగా అనిపించలేదు. సరే ఎలా ఉంటుందో చూద్దాం అని మొదటిసారి లయన్ కింగ్ సినిమాకి వెళ్ళాను.. సినిమా ప్రారంభమే...

బుధవారం, ఏప్రిల్ 17, 2013

తొలిచూపూ చెలి రాసినా - రాజ్కుమార్ (1983)

కొన్ని కొన్ని సినిమాలలో ఒక పాట విపరీతంగా హిట్ అయినపుడు దాని ప్రభవెలుగులో ఆ సినిమాలోని మిగిలిన ఒకటి రెండు పాటలు బాగున్నా కూడా అవి అంతగా పాపులర్ అవ్వవు. రాజ్ కుమార్ సినిమాలోని ఈ “తొలిచూపూ చెలి రాసినా శుభలేఖా” అన్నపాట అదే కోవకి చెందుతుంది అనిపిస్తుంటుంది. ఇళయరాజా స్వరపరచిన ఈ సినిమాలోని “జానకి కలగనలేదు రాముని సతి కాగలనని” పాట చాలా ఫేమస్ అవడంతో ఈ మంచిపాట కాస్త మరుగున పడిందనే చెప్పాలి లేదంటే ఇది మరింత హిట్ అయి ఉండేది. ఇదే సినిమాలొని ఆత్రేయ రచన “తేనెకన్నా...

శుక్రవారం, ఏప్రిల్ 12, 2013

సందేహించకుమమ్మా

కొన్ని పాటలు వినడం తప్ప మనమేమీ వ్యాఖ్యానించలేము. ఇది అలాంటి పాటే ఆడియో ఇక్కడ వినండి. చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల రచన: సముద్రాల (జూనియర్) గానం: ఘంటసాల సందేహించకుమమ్మా రఘురాము ప్రేమనూ.. సీతమ్మా.. సందేహించకుమమ్మా రఘురాము ప్రేమనూ.. సీతమ్మా.. సందేహించకుమమ్మా ఒకే బాణము ఒకటే మాట.. ఒక్క భామకే రాముని ప్రేమ.. ఒకే బాణము ఒకటే మాట.. ఒక్క భామకే రాముని ప్రేమ మిన్నే విరిగిపడినా... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా ఆ ఆ ఆ... సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా.. సందేహించకుమమ్మా... రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు... రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.