మంగళవారం, డిసెంబర్ 31, 2013

పిలిచిన మురళికి వలచిన మువ్వకి

హాస్యరస ప్రధానమైన చిత్రాలకు స్థిరపడకముందు జంధ్యాల గారు చేసిన చక్కని కథాచిత్రం ఆనందభైరవి ఆయన సంగీతాభిరుచికి నిదర్శనం చూపే పాటలు ఈ సినిమా సొంతం. రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఈ సినిమాలో ఎన్నో మంచిపాటలు ఉన్నాయి అందులే ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. మీరూ చూసి వినీ ఆనందించండి ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం: ఆనంద భైరవి (1984) సంగీతం: రమేష్ నాయుడు గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు, జానకి పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో...

సోమవారం, డిసెంబర్ 30, 2013

నువ్వు వస్తావనీ బృందావని

చక్రవర్తి గారి ఆణిముత్యాలలో మల్లెపువ్వు ఒక మరుపురాని ఆల్బం, ఇందులో ఎన్నో మంచి పాటలున్నాయి వాటిలో ఈ పాట ఒకటి. సాహిత్యం ఆరుద్ర గారా వేటూరి గారా అనే ఓ చిరు సందేహం ఉంది తెలిసినవారెవరైనా కామెంట్స్ లో చెప్పగలరు. ఈ మధురగీతం మీకోసం.. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : మల్లెపువ్వు (1978)సంగీతం : చక్రవర్తిగానం : వాణీ జయరాంరచన : ఆరుద్ర/వేటూరినువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. కృష్ణయ్యా..నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.....

ఆదివారం, డిసెంబర్ 29, 2013

వంశీకృష్ణా.. యదు వంశీకృష్ణా..

వంశవృక్ష అనే కన్నడ నవల ఆధారంగా బాపూగారి దర్శకత్వంలో వచ్చిన "వంశవృక్షం" సినిమాలోని ఈ "వంశీ కృష్ణా యదు వంశీ కృష్ణా" పాట చాలా బాగుంటుంది. సినారేగారు తేలికైన పదాలతో చాలా అందంగా రాస్తారు ముఖ్యంగా రెండో చరణంలో ప్రాణులంతా వేణువులై నీరాగాలే పలుకుతున్నారని అన్నీ నీలీలలే అని అన్నా ఆటగా రణమును నడిపిన కృష్ణ అనీ పాటగా బ్రతుకు గడిపిన కృష్ణా అని అన్నా కృష్ణతత్వాన్ని ఎంత సింపుల్ గా చెప్పారని అనిపిస్తుంది. ఈ పాట ఆడియో రాగాలో ఇక్కడ వినవచ్చు లేదా కింది ప్లగిన్...

శనివారం, డిసెంబర్ 28, 2013

మధుర మురళి హృదయ రవళి

మొన్న వేవేలా గోపెమ్మలా పాట గురించి మాట్లాడుకుంటూ కమల్ పై సరదాగా చిత్రీకరించిన కొన్ని మధురమైన పాటల గురించి చెప్పుకున్నాం కదా ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది, ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈపాట కూడా కృష్ణుడి మీదే కావడం. సినిమా కామెడీ సినిమా కావడంతో ఈ పాటకూడా పూర్తిగా కామెడీ ఓరియెంటెడ్ గా చిత్రీకరించినా పాటమాత్రం చాలా మధురంగా ఉంటుంది నాకు బాగా ఇష్టమైనపాట. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.  చిత్రం : ఒక రాధ...

శుక్రవారం, డిసెంబర్ 27, 2013

మా పల్లె వాడలకు కృష్ణమూర్తీ..

శివరంజని సినిమాలోని పాటలు ఎంత ఫేమస్సో చెప్పక్కర్లేదు కదా అందులో బోలెడు పాటలు సూపర్ హిట్ వాటి మరుగున కాస్త తక్కువ పేరు తెచ్చుకున్న పాట ఈ "మాపల్లె వాడలకు" పాట. ఇది రాసినది ఎవరో నాకు తెలియదు రమేష్ నాయుడి గారి సంగీతం మాత్రం అలా గుర్తుండిపోతుంది. ఈ పాట చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రం వినాలంటే చిమటాలో ఇక్కడ వినవచ్చు.  చిత్రం : శివరంజని(1978) సంగీతం : రమేష్ నాయుడు  సాహిత్యం :  గానం : బాలు, సుశీల మా పల్లె వాడలకు కృష్ణమూర్తీనువ్వు...

గురువారం, డిసెంబర్ 26, 2013

యమునా ఎందుకె నువ్వు

ఇళయరాజ సంగీతం సమకూర్చిన మరువలేని ఆల్బమ్స్ లో నిరీక్షణ కూడా ఒకటి. ఇందులోని "ఆకాశం ఏనాటిదో", "చుక్కల్లే తోచావే", "తియ్యన్ని దానిమ్మ" పాటలతో పాటు కన్నయ్యమీద ఉన్న ఈపాట కూడా నాకు బోలెడంత ఇష్టం. యమునా నదికి నల్లని రంగు కిట్టయ్యతో కూడడం వలన అబ్బిందట ఎంత చక్కని భావనో కదా.. మనసుకవి ఆత్రేయ గారిది చాలా బాగా రాశారు సాహిత్యానికి తగిన సంగీతం కూడా మనల్ని అలరిస్తుంది. చిత్రీకరణ సైతం బాగుంటుంది ఈ పాట తెలుగు వీడియో ఎక్కడా దొరకలేదు కనుక తెలుగు ఆడియో ఇక్కడ వింటూ...

బుధవారం, డిసెంబర్ 25, 2013

మల్లెల వేళ అల్లరి వేళ

చక్రవర్తి గారి సంగీతంలో వచ్చిన ఒక మంచి మెలోడీ ఈ మల్లెలవేళ అల్లరివేళ పాట. సినిమా గురించి పెద్దగా తెలియదు కానీ అప్పట్లో ఈపాటకూడా రేడియోలోనే విన్న గుర్తు. పల్లవి పాడే ముందు ఊహుహు అంటూ మొదలుపెట్టడం భలే ఉంటుంది. ఈ పాటమీరూ చూసి విని ఆనందించండి ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు.  చిత్రం: జూదగాడు (1979)సంగీతం: చక్రవర్తిసాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: జి. ఆనంద్, సుశీలమల్లెల వేళ.. అల్లరి వేళ..మల్లెల వేళ అల్లరి వేళమదిలో మన్మధ లీలనీవు నేనైన...

మంగళవారం, డిసెంబర్ 24, 2013

వేవేల గోపెమ్మలా మువ్వాగోపాలుడే..

ఈ పాట చూసినపుడు విశ్వనాథ్ గారిపై నాకు అపుడపుడు కోపం వస్తుంటుంది అంటే చాలాసార్లు నవ్వుకున్నా అపుడపుడు మాత్రం కోపమనమాట. తెలుగు సినిమా పాటల చిత్రీకరణపై సెటైరిక్ గా ఒక పాట తీద్దామని అనుకున్నారు బానే ఉంది కానీ దానికి ఒక మీడియోకర్ పాటను ఎంచుకుని సైతం ఇలా చిత్రీకరించి ఉండవచ్చు కదా ఇంత మంచిపాట రాయించుకుని ఇంత చక్కని బాణికట్టించుకుని ఈ పాటని అలా పాడుచేయాలని ఎలా అనిపించిందో ఈయనకి అని తిట్టుకుంటూంటానమాట :-) అందుకే ఎక్కువసార్లు ఈ పాట చూడకుండా ఆడియో మాత్రం...

సోమవారం, డిసెంబర్ 23, 2013

నేనె రాధనోయీ.. గోపాలా..

భానుమతి గారి పాటలలో మరో ఆణిముత్యం ఈ నేనె రాధనోయీ.. ఈ పాట గురించి మాట్లాడలేము జస్ట్ విని ఆస్వాదించగలం అంతే మీరూ చూసీ విని తరించేయండి. ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : అంతా మన మంచికే (1972)సంగీతం : సత్యంసాహిత్యం : దాశరథిగానం: భానుమతిమ్మ్...ఆ...ఆ...నేనె రాధనోయీ గోపాలానేనె రాధనోయీ గోపాలానేనె రాధనోయీ.. అందమైన ఈ బృందావనిలో నేనె రాధనోయీ.. అందమైన ఈ బృందావనిలో నేనె రాధనోయీ.. గోపాలా.. నేనె రాధనోయి..విరిసిన పున్నమి వెన్నెలలోచల్లని...

ఆదివారం, డిసెంబర్ 22, 2013

అన్నయ్యా.. కుక్క కావాలి..

తేజ మొదటి సినిమా “చిత్రం” లోని ఈ సరదా అయిన పాట నాకు చాలా ఇష్టం, క్యాసెట్ రిలీజ్ అయిన కొత్తలో పదే పదే వినేవాడ్ని. కులశేఖర్ రాసిన సాహిత్యం భలే సరదాగా ఉంటుంది. కుక్కకావాలని ఏడ్చే ఓ పిల్లవాడికి రామాయణ భారత బాలనాగమ్మ కథలను చెప్తూ వాడి దృష్టి మరల్చాలనే ప్రయత్నంతో సాగే ఈ పాట పిల్లలనీ పెద్దలనీ కూడా ఆకట్టుకుంటుంది. మధ్యమధ్యలో ఉత్తేజ్ తెలంగాణా యాసలో పాడడం కూడా చాలా సరదాగా ఉంటుంది. ఈపాట మీకోసం ఇక్కడ ఇస్తున్నాను విని ఎంజాయ్ చేయండి. ఈటివి తెలుగు ఇండియా యూట్యూబ్...

ఆలారే ఆలారే

సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా తేనెమనసులు అనగానే ఎక్కువమంది 1965 లో విడుదలైన సినిమానే గుర్తు తెచ్చుకుంటారు కానీ అదే పేరుతో 1987 లో జయప్రద, సుహాసిని లతో కూడా ఒక సినిమా చేశారు అందులోదే ఈ “ఆలారే ఆలారే” పాట. సుహాసినిది సెకండ్ హీరోయిన్ గా ఆరాధన ప్లస్ త్యాగం కలిసిన డీసెంట్ రోల్ అయితే జయప్రద మెయిన్ హీరోయిన్ గా చేసింది.  ఇందులోదే “మమ్మీ మమ్మీ” అనేపాట కూడా అప్పట్లో టీ బంకుల్లోనూ అక్కడా ఇక్కడ తరచుగా వినపడే పాట ఆసక్తి ఉంటే ఇక్కడ చూసీ విని ఎంజాయ్...

శనివారం, డిసెంబర్ 21, 2013

ఏ చోట ఉన్నా..నీ వెంట లేనా

కొన్ని కొన్ని పాటలు జీవితకాలం వెంటాడుతుంటాయి. ఎలాంటి మూడ్ లో విన్నా ఎపుడు విన్నా ఆ పాట మూడ్ లోకి అలా లాక్కెళ్ళిపోగల పాటలుంటాయి. అలాంటి పాటే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా “ నువ్వే నువ్వే” లోని ఈ పాట. కోటి స్వరకల్పనలో సిరివెన్నెల గారి సాహిత్యం చిత్రగారి గళంలో మనల్ని వెంటాడుతుంది. ఈ పాట మీకోసం... ఆడియోమాత్రం వినాలంటే ఇక్కడ వినండి.  చిత్రం : నువ్వే నువ్వే సాహిత్యం: సిరివెన్నెల సంగీతం: కోటి గానం: చిత్ర ఏ చోట ఉన్నా..నీ...

ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో

మధురమైన పాటలలో సైతం సంధర్బానుసారంగా చిత్రీకరణతో కామెడీ పండించిన ఘనత ఈసినిమాలో సింగీతంగారికీ ఆ తర్వాత "వేవేల గోపెమ్మలా" పాటలో విశ్వనాధ్ గారికీ మాత్రమే దక్కుతుందేమో, చిత్రమేమంటే ఈ రెండు సినిమాల్లోనూ హీరో కమల్ గారే కావడం. "సొమ్మొకడిదీ సోకొకడిది" సినిమాలోని ఈ పాట వినడానికి ఎంత మధురంగా ఉంటుందో చిత్రీకరణ కూడా అంతే సరదాగా ఉంటుంది. ఆ చక్కని పాటని చూసి విని ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినండి.    చిత్రం :   ...

శుక్రవారం, డిసెంబర్ 20, 2013

యమునా తీరాన రాధ మదిలోనా

నేను పుట్టకముందు రిలీజైన ఈ సినిమా పుట్టు పూర్వోత్తరాల గురించి నాకు అస్సలు తెలియదు కానీ ఈ పాట కూడా నేను రేడియోకి అతుక్కుపోవడానికి గల ముఖ్య కారణాలలో ఒకటి.. వివిధభారతిలో తరచుగా వినిపించే ఈ పాట ఈరోజు వింటూన్నాకూడా ఆరుబయట నులకమంచం పై పడుకుని రేడియోని గుండెలమీద పెట్టుకుని స్పీకర్ లో మొహం పెట్టేసి మరీ వింటున్న అనుభూతే కలిగింది నాకు. ఇక ఇందులో ఎమ్మెస్వీ సంగీతమా రాజశ్రీ సాహిత్యమా బాలూ సుశీలల స్వరమా ఏది బాగుందో చెప్పడం ఆ బ్రహ్మదేవుడే దిగివచ్చినా చెప్పడం...

గురువారం, డిసెంబర్ 19, 2013

సా విరహే తవదీనా రాధా.

శ్రీ సూర్యనారాయణా మేలుకో అంటూ సాక్షాత్తు సూర్యభగవానుడ్నే గద్దించి నిదుర లేప గల సత్తా ఉన్న భానుమతమ్మ తొలినాళ్ళలో మధురంగా ఆలపించిన ఈ పాట వినని తెలుగు వాళ్ళు ఉంటారని నేను అనుకోను, బహుశా ఈ తరం యువతకి చేరి ఉండకపోవచ్చేమో తెలియదు. జయదేవుని అష్టపదినుండి కొన్ని పంక్తులను తీసుకుని రసాలూరు సాలూరి వారి స్వరసారధ్యంలో కూర్చిన ఈ అందమైన పాట మీకోసం.. ఆడియో మాత్రం వినాలంటే చిమటాలో ఇక్కడ వినవచ్చు.  ఈ పాటలో ఉపయోగించిన లైన్స్ కి అర్ధం ఇదట : ఈ అష్టపదిలో కృష్ణుడు...

బుధవారం, డిసెంబర్ 18, 2013

అదిగదిగో యమునాతీరం

ఈ పాట మీలో ఎందరికి తెలిసి ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా చాలా ఇష్టమైన పాట, ఇదికూడా రేడియోలోనే పరిచయం నాకు. వస్తున్నపుడు ఎందుకో తెలీదు అలా ఆగిపోయి వినేవాడ్ని చేస్తున్న పనులు అన్నీ ఆపేసి శ్రద్దగా ఈ పాట వినేసి మళ్ళీ పనులు చేసుకోవడం అనమాట. ఈ సినిమా గురించికానీ వీడియో గురించి కానీ నాకు తెలీదు యూట్యూబ్ లో వెతికినా కనిపించలేదు కానీ పాట మాత్రం ఎంతో ఇష్టం, బాలు జానకి గార్లు సరదాగా ఆటలాగా పాడిన పాటలలో ఇదీ ఒకటి. ఈ అందమైన పాటని ఇక్కడ వినండి ప్లగిన్...

మంగళవారం, డిసెంబర్ 17, 2013

చందన చర్చిత నీలకళేబర

ధనుర్మాసం ఆరంభమైందట కదా మరి కృష్ణప్రేమికులంతా ఆరాధనకు సిద్దపడి ఉంటారుగా.. అందుకే ఈవేళ నేనుకూడా మా కృష్ణయ్యపాటనే తీసుకు వచ్చాను. ఈ జయదేవుని అష్టపదిని ఇప్పటివరకూ నాలుగు సార్లు సినిమాలలో వాడారని వినికిడి. మొదటిసారి 1936 లో సతీ తులసి అనే చిత్రంలో ఉపయోగించిన పాట దొరకలేదు కానీ మిగిలిన వర్షన్స్ చిత్తగించండి. తెనాలి రామకృష్ణ చిత్రం కోసం 1956 లో సుశీలమ్మ పాడిన ఈపాటే నాకు అన్ని వర్షన్స్ లోకెల్లా బాగానచ్చింది. ఎమ్మెస్ విశ్వనాథన్ గారి స్వరసారధ్యంలో వచ్చిన...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.