శుక్రవారం, అక్టోబర్ 26, 2012

పాలగుమ్మి విశ్వనాథం గారికి నివాళి.

అమ్మదొంగా నిన్ను చూడకుంటే, మా ఊరు ఒక్కసారి పోయిరావాలి లాంటి అద్భుతమైన లలిత గీతాలను రచించి స్వరపరచి గానం చేసిన లలిత సంగీత స్వర చక్రవర్తి పాలగుమ్మి విశ్వనాథంగారు తన తొంభైమూడవఏట నిన్న గురురువారం (అక్టోబర్ 25) రాత్రి కన్నుమూశారు. వారితో ఒకే ఒక్కసారి ఫోన్ లో మాట్లాడినా ఎవరో అపరిచిత అభిమాని అని అనుకోకుండా ఆత్మీయంగా ఆయన పలకరించిన తీరును మరువలేను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుస్తకం.నెట్ లో వారికి నివాళి : http://pustakam.net/?p=12761ఆ...

బుధవారం, అక్టోబర్ 24, 2012

నేస్తమా నేస్తమా..

కొత్తపాటల్లో లిరికల్ వాల్యూస్ వెతుక్కోడం చాలా కష్టమౌతున్న ఈ రోజుల్లో వచ్చిన ఈ పాటలో ముఖ్యంగా పల్లవి భాస్కరభట్ల పాటలా కాక కవితలా రాశారనిపించింది. దానికి చక్కని దేవీశ్రీప్రసాద్ సంగీతం, అందమైన శ్రీకృష్ణ & హరిణిల స్వరం తోడై ఈ మధ్య నేను తరచుగా వినే పాటలలో ఈపాటను ముందుంచేలా చేశాయి. మీరూ వినండి. పూర్తి పాట ఆడియో రాగాలో ఇక్కడ వినవచ్చు. చిత్రం : డమరుకం (2012) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ రచన : భాస్కరభట్ల రవికుమార్ గానం : శ్రీకృష్ణ , హరిణి Normal 0 false false false EN-IN X-NONE TE ...

బుధవారం, అక్టోబర్ 10, 2012

దులపర బుల్లోడో..

ఖంగుమని మోగే భానుమతమ్మ గారి కంచుకంఠంలో ఏపాటైనాసరే ఓ ప్రత్యేకతని సంతరించుకుంటుంది. ఇక అదే ఇలా ఆకతాయికుర్రాళ్ళకి బుద్దిచెప్పే పాటంటే ఇహ ఆలోచించనే అక్కరలేదు ఆవిడ గొంతులో “దులపర బుల్లోడో..” అని వినగానే అలాంటి ఆకతాయిల గుండెల్లో రైళ్ళు పరిగెట్టాల్సిందే :-) తెలుగు సినిమా బ్రాండెడ్ దెయ్యం సాంగ్ “నిను వీడను నేనే” పాట ఉన్న అంతస్థులు సినిమాలోనిదే ఈ పాట కూడా. భానుమతి గారి అభినయం ఆవిడకి వంతపాడే రేలంగి, రమణారెడ్డిలతో కలిసి చూడడానికి కూడా మాంచి సరదాగా ఉంటూంది ఈ పాట. యూట్యూబ్ పనిచేయనివాళ్ళు ఆడియో చిమటా మ్యూజిక్ లో ఇక్కడ వినవచ్చు.    చిత్రం : అంతస్థులు సంగీతం : కె.వి.మహదేవన్ రచన : కొసరాజు గానం : భానుమతి దులపర బుల్లోడో.. హోయ్ హోయ్... దులపర...

బుధవారం, అక్టోబర్ 03, 2012

శ్యామసుందరా ప్రేమమందిరా

ఆదినారాయణరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన భక్తతుకారం సినిమాలోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్సే, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. ఇందులోని ఈ "శ్యామసుందరా ప్రేమమందిరా" పాటంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. తత్వాలతో కూడి పల్లెపదం/జానపదంలా అనిపించే ఈపాట ఎప్పుడు విన్నా నాకు తెలియకుండానే గొంతు కలిపేస్తాను.   దాశరధి గారి సాహిత్యంలో "అణువణువు నీ ఆలయమేరా నీవే లేని చోటులేదురా", "అహము విడిచితే ఆనందమురా", "సాధన చేయుమురానరుడా సాధ్యముకానిది...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.