
సంసారం ఒక చదరంగం సినిమాలోని ఈ పాట నాకు బాగా నచ్చిన పాటలలో ఒకటి, చక్రవర్తి గారు ఆహ్లాదకరమైన సంగీతాన్నిస్తే సుశీలమ్మ తన స్వరంతో ప్రాణంపోశారు. పాట ప్రారంభంలో వచ్చే ఆలాపన ఎక్కడో విన్నట్లు అనిపించినా(ఎక్కడో చెప్పగలరా?) అసలు ఆ ఆలాపనతోనే మనని కట్టిపడేస్తారు. పాట సాహిత్యం ఎవరో కరెక్ట్ గా తెలియదు కానీ అంతర్జాలంలో కొన్నిచోట్ల వేటూరి గారని ఉంది ముఖ్యంగా రెండవ చరణం విన్నాక వేటూరి గారే రాశారనే నమ్మకం బలపడిపోతుంది. పాట రెండవచరణంలో ఝల్లున వీణలు పొంగినవి అన్నతర్వాత...