గురువారం, డిసెంబర్ 30, 2010

క్షత్రియ పుత్రుడు (1992) - సన్నజాజి & మురిసే

దేవర్ మగన్ అనే తమిళ చిత్రానికి అనువాద చిత్రమైన క్షత్రియపుత్రుడు తెలుగులో హిట్ కాలేదు కానీ  పూర్తి తమిళ వాతావరణం ఇబ్బంది పెట్టనటువంటి వారికి ఈ సినిమా పర్లేదు ఒకసారి చూడచ్చు అనిపిస్తుంది. నాకు శివాజీ గణేషన్, కమల్, రేవతి, నాజర్, గౌతమిల నటన చూడటానికైనా ఒకసారి చూసి తీరవలసిందే అనిపించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ రెండు పాటలు నాకు చాలా ఇష్టం. “సన్నజాజి పడక” పాటలో జానకి బాలు ఇద్దరూ కలిసి ఆటలాడుకున్నట్లుగా పాడారు. పాట మొదట్లో జానకి గారు నోటితో వేసే మ్యూజిక్.. ఎందుకే.. అన్న చోట తను రాగంతీసినపద్దతితో ఆకట్టుకుంటే.. బాలుగారు కూడా నేనేం తక్కువతిన్నానా అంటూ అవకాశమొచ్చినపుడల్లా అల్లరి చేసేరు. ఇక “మురిసే పండగపూట” లో మాధవపెద్ది రమేష్ గారి...

ఆదివారం, డిసెంబర్ 26, 2010

సిరిమల్లె నీవే - పంతులమ్మ(1977)

కొన్ని పాటలకు పాతబడడమంటే ఏమిటో తెలియదేమో అనిపిస్తుంది. పంతులమ్మ సినిమాలో రాజన్ నాగెంద్రగారు స్వరపరిచిన ఈ పాట వినండి. ఎన్ని సార్లు విన్నా ఆ తాజాదనం ఎక్కడికీ పోదు.. ఎప్పటికప్పుడు మనల్ని పలకరిస్తూనే ఉంటుంది, ఊహల్లో విహరింప జేస్తుంది... వేటురి గారు సాహిత్యమందించిన ఈ పాట బాలుగారి స్వరంలో అందంగా రూపుదిద్దుకుంది. తొలిపూత నవ్వె అన్న దగ్గర వినీ వినిపించకుండా తను సన్నగా నవ్విన నవ్వు భలే ఉంటుంది... సంధ్యా సమయం లో మంద్రమైన స్వరంలో ఈ పాట వింటూ అలా ఊహల్లో జారుకోవడం నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఈ పాట వీడియో మీ కోసం... యూట్యూబ్ చూడలేని వారు చిమట లో ఇక్కడ పాట మాత్రం వినవచ్చు. చిత్రం : పంతులమ్మ(1977) గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం...

బుధవారం, డిసెంబర్ 22, 2010

చుట్టూపక్కల చూడరా - రుద్రవీణ

కొన్ని సినిమాలు వాటిలో కొన్ని పాటలు మనసుల్లో చెరగని ముద్ర వేసి గుండెలోతుల్లో నాటుకు పోతాయి. అలాంటి ఒక పాటే రుద్రవీణ సినిమాలోని ఈ “చుట్టూపక్కల చూడరా చిన్నవాడా” అన్నపాట. ఈ పాట ముందు వచ్చే  సన్నివేశం సైతం చాలా ఆకట్టుకుంటుంది. “దేవుడు నీకిచ్చిన రెండుచేతుల్లో ఒకటి నీకోసమూ రెండోది పక్కవాడి చేయూత కోసం.” అంటూ ఆ ముసలి వ్యక్తి చెప్పిన మాటలు అతని హావభావాల సహితంగా నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. సీతారామ శాస్త్రిగారు రాసిన ఈ పాట సమస్తం యువతను సూటిగా ప్రశ్నిస్తున్నట్లుగా.. కర్తవ్యబోధ చేస్తున్నట్లుగా ఉంటుంది. చిత్రం: రుద్రవీణ సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం చుట్టూపక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో...

సోమవారం, డిసెంబర్ 13, 2010

బెజ బెజ బెజవాడ - బెజవాడరౌడీలు పాట

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా “బెజవాడరౌడీలు” సినిమా కోసం రికార్డ్ చేసిన పాట తన ట్విట్టర్ నుండి సేకరించినది... మీకోసం సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను వింటూ చదువుకోండి. ఆ గోలలో అక్కడక్కడ పదాలు అర్ధంకాలేదు అవి బ్లాంక్స్ ఇచ్చాను మీకేమైనా అర్ధమైతే కామెంట్ ద్వారా చెప్పండి. http://www.mediafire.com/?lsbhce2qarhtpef       చిత్రం: బెజవాడరౌడీలు రచన : సిరాశ్రీ సంగీతం : అమర్ మోహ్లి గానం : జొ జొ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజవాడా..గజ గజ గజ గజ గజలాడా.. కమ్మనైన నవ్వునవ్వి కత్తిపెడితే కాపుకాసి గొంతుకోసి కాలరాయరా.. దద్దరిల్లి గుండెలన్నీ అదరంగా... ముందరున్న వాడిదమ్ము చెదరంగా.. సంఘనీతి పాపభీతి వలదేవీ .. కత్తికన్న...

ఆదివారం, డిసెంబర్ 12, 2010

చిటపట చినుకులు - ఐతే

వారంలో ఒక్కసారైనా తప్పనిసరిగా నేను వినే పాటలలో సిరివెన్నెల గారు రాసిన ఈపాట ఖచ్చితంగా ఉంటుంది. సినిమా విడుదలైన తర్వాత మాత్రమే పరిచయమైన ఈ పాట విన్నవెంటనే నన్ను ఆకట్టుకుంది. ఆశవహ దృక్పధం గురించి కనే కలల గురించి వర్ణిస్తూ సాగే శాస్త్రిగారి సాహిత్యం సినిమా ఫీల్ కు తగినట్లుగా ఆంగ్లపదాలతోకూడా అందంగా ఆటలాడుకున్నట్లుగా సాగుతుంది, కీరవాణి వైవిధ్యమైన కంఠస్వరం ఈపాటకు చక్కగా నప్పింది. పాట చిత్రీకరణ కూడా వైవిధ్యంగా చాలా బాగుంటుంది.  అప్పట్లో ఈ లోబడ్జెట్ సినిమా బెంగుళూరులో చాలారోజులవరకూ రిలీజ్ అవ్వలేదు, ఏదోపనిమీద హైదరాబాద్ వెళ్ళినపుడు అక్కడ చూశాను. ఆ తర్వాత పాటకూడా చాలారోజులు దొరకలేదు ఇప్పటంత విరివిగా అంతర్జాల వాడకం కూడా లేకపోవడంతో అక్కడా చుక్కెదురే....

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.