ఆదివారం, డిసెంబర్ 12, 2010

చిటపట చినుకులు - ఐతే

వారంలో ఒక్కసారైనా తప్పనిసరిగా నేను వినే పాటలలో సిరివెన్నెల గారు రాసిన ఈపాట ఖచ్చితంగా ఉంటుంది. సినిమా విడుదలైన తర్వాత మాత్రమే పరిచయమైన ఈ పాట విన్నవెంటనే నన్ను ఆకట్టుకుంది. ఆశవహ దృక్పధం గురించి కనే కలల గురించి వర్ణిస్తూ సాగే శాస్త్రిగారి సాహిత్యం సినిమా ఫీల్ కు తగినట్లుగా ఆంగ్లపదాలతోకూడా అందంగా ఆటలాడుకున్నట్లుగా సాగుతుంది, కీరవాణి వైవిధ్యమైన కంఠస్వరం ఈపాటకు చక్కగా నప్పింది. పాట చిత్రీకరణ కూడా వైవిధ్యంగా చాలా బాగుంటుంది. 

అప్పట్లో ఈ లోబడ్జెట్ సినిమా బెంగుళూరులో చాలారోజులవరకూ రిలీజ్ అవ్వలేదు, ఏదోపనిమీద హైదరాబాద్ వెళ్ళినపుడు అక్కడ చూశాను. ఆ తర్వాత పాటకూడా చాలారోజులు దొరకలేదు ఇప్పటంత విరివిగా అంతర్జాల వాడకం కూడా లేకపోవడంతో అక్కడా చుక్కెదురే. కొంతకాలానికి ఈ సినిమాలోని ఈపాట ఇంకొన్ని మ్యూజిక్ బిట్స్, అమృతం సీరియల్ టైటిల్ సాంగ్, లిటిల్ సోల్జర్స్ పాటలు అన్నీ కలిపి ఒక సిడి గా రిలీజ్ చేశారు. అదే సమయానికి నా నేస్తం హైదరాబాద్ నుండి బెంగుళూరు వస్తుంటే తనతో తెప్పించుకున్నా ఈ సిడి. ఈ పాటవిన్న ప్రతిసారీ ఈ ఙ్ఞాపకాలు కూడా ఒక రీల్ లా మనసులో తిరుగుతుంటాయ్.


చిత్రం : ఐతే (2004)
సంగీతం : కళ్యాణిమాలిక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం : కీరవాణి

చిటపట చినుకులు అర చేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతొ తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదె umbrella ఎపుడూ ఓ వానా నువ్వొస్తానంటే

నిధులకు తలుపులు తెరవగా మనకొక ఆలీ బాబా ఉంటే
అడిగిన తరుణమె పరుగులు తీసే అల్లావుద్దీన్ జీనీ ఉంటే
చూపదా మరి ఆ మాయా దీపం మన fate ఏ flight అయ్యే runway
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...

నడిరాత్రే వస్తావెం స్వప్నమా?
పగలంతా ఎం చేస్తావ్ మిత్రమా.....?
ఊరికినే ఊరిస్తే న్యాయామా ?
సరదాగా నిజమైతే నష్టమా?
మోనాలిసా మొహం మీదే నిలుస్తావా? ఓ చిరునవ్వా.. ఇలా రావా?
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...

వేకువనే మురిపించె ఆశలు
వెనువెంటనే అంతా నిట్టూర్పులూ
లోకం లో లేవా ఏ రంగులు ?
నలుపొకటే చూపాల కన్నులూ?
ఇలాగేనా ప్రతీ రోజు ? ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా?
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చిటపట చినుకులు అర చేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతొ తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే

5 comments:

వానపాటల్లో వెరైటీగా ఉండే పాట ఇది. నాకు నచ్చుతుంది.అలాగే ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే సినిమాలో కూడా అమిత స్లోగా నడిచే వానపాట "ఏమైందీ ఈ వేళ" కూడా వెరైటీగా ఉంటుంది.దాని గురించి కూడా రాయండి వేణూ!

nice song..don't remember tyhe lines but the song behind the titles(in the end.. i remember) of this film is also a good one.

సుజాత గారు నెనర్లు, నాకు ఇష్టమైన పాటల్లో అదికూడా ఒకటి, తప్పకుండా దాని సాహిత్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను త్వరలో.

తృష్ణ గారు నెనర్లు. ఈ సినిమాలో ఈ ఒక్కపాటమాత్రమే ఉందండి. ఎండ్ టైటిల్స్ లో వచ్చేది దీని పల్లవి, మొదటి టైటిల్స్ లో వచ్చేది కేవలం ఈ పాట సంగీతం సాహిత్యంలేకుండా.

నడిరాత్రే వస్తావెం స్వప్నమా?
పగలంతా ఎం చేస్తావ్ మిత్రమా.....?
ఊరికినే ఊరిస్తే న్యాయామా ?
సరదాగా నిజమైతే నష్టమా?
మోనాలిసా మొహం మీదే నిలుస్తావా? ఓ చిరునవ్వా.. ఇలా రావా?

నాకు ఈ లైన్లు ఎంత ఇష్టమో....అప్పట్లొ ఈ పాట కోసమే సినిమా ఆరుసార్లు చూశా..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail