ఆదివారం, మార్చి 02, 2014

నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..

అనూప్ రూబెన్స్ సంగీతంలో కొన్ని పాటలు భలే ఉంటాయి అదీ శ్రేయ పాడిందంటే ఇక మాట్లాడడానికి ఏముంటుంది పాట వింటూ మైమరచి పోవడం తప్ప :-) శ్రీమణి సాహిత్యం కూడా బాగుంటుంది. మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.




చిత్రం : సుకుమారుడు (2013)
సంగీతం : అనూప్ రూబెన్స్
రచన : శ్రీమణి
గానం : శ్రేయ ఘోషల్

అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..
నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..
ఓహోహో..పొంగే నదిలా నన్నే మార్చావే..
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
హే..ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో..
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ
నీవల్లే నీవల్లేరా సుకుమారా.. ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళు లేదిలా
అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..
ఓఓఓ..అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..

సరదాకైనా ఏ ఆడపిల్లైనా.. నిను చూస్తుంటే ఉండగలనా
నిన్నే దాచేసి లేవు పొమ్మంటా.. నీకే నిన్నే ఇవ్వనంటా
అరె.. నిన్నే తాకిందని గాలితోటి రోజూ గొడవేనంట
నిన్ను నువ్వైనా నాలాగ ప్రేమించలేవంట
అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేరే..
హా..నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

ఓ.. ఏలేలో..ఏలేలో..ఓఓ..

ఓఓఓ..రహదారుల్లో పూలు పూయిస్తా.. నా దారంటూ వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా.. నాపై కన్నే వేస్తానంటే
అరె ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడిచచ్చే నేనంటే నాకిష్టం

ఓ..నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
ఓహోహొ..పొంగే నదిలా నన్నే మార్చావే..
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
ఏ..ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో..
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ
నీవల్లే నీవల్లేరా సుకుమారా.. ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళు లేదిలా
ఓ.. ఏలేలో..ఏలేలో..ఓఓ..

శనివారం, మార్చి 01, 2014

ఊఁ అన్నా.. ఆఁ అన్నా..

మొన్న విజయభాస్కర్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు తలచుకుంటుంటే ఈ పాట గుర్తొచ్చింది. వేటూరి, ఏసుదాసు గారు తోడవటంతో ఈ పాట కొత్త అందాన్ని సంతరించుకుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. కింద పోస్టర్ చూసి కూడా వీడియో చూసే ధైర్యమున్న వాళ్ళు ఎంబెడ్ చేసిన వీడియో చూసి ఎంజాయ్ చేయవచ్చు :-)



చిత్రం : దారి తప్పిన మనిషి (1981)
సంగీతం : విజయభాస్కర్
సాహిత్యం : వేటూరి
గానం : ఏసుదాస్, సుశీల

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

ఉన్న తలపు వలపైనప్పుడు ..కన్నె మనసు ఏమంటుంది
చిలిపి చిలిపి కులుకుల కన్నుల నిలిపి తోడు రమ్మంటుంది
కోరికలన్నీ కోయిలలైతే.. కొత్త ఋతువు ఏమంటుంది
వయసంతా వసంతమై వలపు వీణ ఝుమ్మంటుంది
పిలుపో.. తొలి వలపో.. మరుపో.. మైమరుపో

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

ఉన్న కనులు రెండే అయినా.. కన్నకలలకు అంతే లేదు
కన్న కలలు ఎన్నైనా.. ఉన్న నిజము మారిపోదు
కోరిన వారు కొంగు ముడేస్తే.. కలలు పండి నిజమౌతాయి
కల అయినా.. నిజమైనా.. కలదు కదా కథ తరువాయి
కలయో.. ఇది నిజమో.. కథయో.. వైష్ణవమాయో

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

నిదురించిన తూరుపులో నీవేలే పొద్దుపొడుపు
నిను కోరిన నా తలపులలో నీకేలే ముద్దుల ముడుపు
అన్నా.. నేవిన్నా.. ఔనన్నా.. కాదన్నా
అవునంటే నీతో ఉన్నా... కాదన్నా నీలో ఉన్నా

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దోచి రాగాలెందుకు

ఆహాహాహహా...  ఆహాహాహహా

శుక్రవారం, ఫిబ్రవరి 28, 2014

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి...

ఆసక్తికరమైన కథా కథనాలతో తొంబైలో వచ్చిన ఒక మంచి సినిమా ఆత్మబంధం. కలకాలంతోడుంటాడని ప్రాణంగా ప్రేమించి పెళ్ళిచేసుకున్న తన భర్త ఒక యాక్సిడెంట్ లో తనని వీడివెళ్ళిపోయాడనే దిగులుతో ఉన్న ఆమెకి అతను ఆత్మరూపంలో తనచుట్టూనే ఉండి కాపాడుకుంటున్నాడని తెలిసిన క్షణంలో నమ్మలేని ఆ నిజాన్ని ఒట్టి ఊహకాదని ఒట్టేసి చెప్పవా అంటూ భర్తనే అడిగే సంధర్బంలోని ఈ పాట చాలా అందంగా ఉంటుంది. మీరూ ఆస్వాదించండి. యూట్యూబ్ పనిచేయని వారు ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఆత్మబంధం (1990)  
సంగీతం  : కీరవాణి 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర 

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి

ఒకేసారి కలలన్నీ వెలేసాయి కన్నుల్నీ
అమావాశ్య కొలువై మోయమంటూ రేయినీ
సుదూరాల తారల్ని సుధా శాంతి కాంతుల్నీ
వలలు వేసి తెచ్చా కంటి కొనలో నింపనీ
చెదరని చెలిమి కి సాక్ష్యమా
హృదయము తెలుపగ సాధ్యమా
మాయని మమతల దీపమా 
ఉదయపు తళుకులు చూపుమా
నా జాబిలి నీవేనని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి

ల ల ల ల ల లా
ల ల ల ల ల లా
ల ల ల ల ల లా
ల ల ల ల ల లా

తుదే లేని కధ కాని గతం కాని స్వప్నాన్ని
ఇదే కౌగిలింతై కాలమంతా ఉండనీ
నువ్వే వున్న కన్నులతో మరే వంక చూడననీ
రెప్ప వెనక నిన్నే ఎల్లకాలం దాచనీ
యుగములు కలిగిన కాలమా 
ఈ ఒక గడియను వదులుమా
చరితలు కలిగిన లోకమా 
ఈ జత జోలికి రాకుమా
స్వప్నం చిగురించిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి 
ఇంకొక్కసారి
ఇంకొక్కసారి

గురువారం, ఫిబ్రవరి 27, 2014

కానరార కైలాస నివాస/గంగావతరణం

కైలాసానికేగి ఈశ్వరదర్శనాన్ని కోరుతూ రావణ బ్రహ్మ పాడిన ఈ పాట చాలా ప్రసన్నంగా బాగుంటుంది. ఇంతగా వేడుకున్ననూ శివుడు ప్రత్యక్షం కాకపోగా కావలి ఉన్న నంది హేళనగా నవ్వేసరికి కోపమోచ్చిన రావణాసురుడు కైలాసగిరినే పెకలించి తీసుకువెళ్ళే ప్రయత్నంలో పాడే శివతాండవ స్తోత్రం వీడియో ఇక్కడ చూడవచ్చు. రావణబ్రహ్మగా ఎన్టీఆర్ మొదట ఎంత ప్రసన్నంగా కనిపిస్తారో తరువాత అంత రౌద్రాన్నీ అవలీలగా పోషించారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. 
మిత్రులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
 


చిత్రం : సీతారామకళ్యాణం (1961)
సంగీతం : గాలి పెంచల నర్సింహారావు
సాహిత్యం : సముద్రాల సీనియుర్
గానం : ఘంటసాల

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరాహర
కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార

భక్తజాల పరిపాల దయాళ
భక్తజాల పరిపాల దయాళ
హిమశైలసుతా ప్రేమలోలా

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార

నిన్నుజూడ మది కోరితిరా... ఆ...
నిన్నుజూడ మది కోరితిరా
నీ సన్నిధానమున చేరితిరా
నిన్నుజూడ మది కోరితిరా
నీ సన్నిధానమున చేరితిరా

కన్నడ సేయక కన్నులు చల్లగ
మన్నన సేయరా గిరిజా రమణా

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార

సర్ప భూషితాంగ కందర్పదర్పభంగా
సర్ప భూషితాంగ కందర్పదర్పభంగా
భవపాశనాశ పార్వతీ మనోహర
హే మహేశ వ్యోమకేశ త్రిపురహర

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార 

~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌

బగీరధుని తపస్సుకు మెచ్చిన గంగ తాను దివినుండి భువికి దిగిరావడానికి సిద్దమే కానీ తననుభరించే నాథుడెవరు అని అడిగితే, ఆ భగీరధుడు గంగ ఉరవడిని కట్టడి చేయగలవాడు సాక్షత్తూ ఆ పరమశివుడేనని ఎంచి ఈశ్వరుని ఎలా వేడుకున్నాడో ఆ గంగావతరణమెలా జరిగిందో ఈ శివరాత్రి పర్వదినాన మరో సారి వీక్షించండి. ఈ క్లిప్ బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సీతాకళ్యాణం సినిమాలోనిది, సినిమాటోగ్రఫీ రవికాంత్ నగాయచ్.


చిత్రం : సీతా కల్యాణం (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : పి. బి. శ్రీనివాస్, బాలు, రామకృష్ణ, సుశీల

ఇనవంశ జలజాత దినకరుడు
సత్యనిరతుడు ధర్మవ్రతుడు భగీరథుడు
తన ముత్తాతల తరింప చేయగా...
గగన గంగనే జగతికి దించగా...
తపమొనరించెను ఆనాడు..
అదియే నదియై నడిచెను ఈనాడు...ఊ..ఊ..

మెచ్చితిని తపమో భగిరథా...
నిశ్చలనిరంతర మనోరథా...
ఇచ్చెదను వరము దిగి వచ్చెదను ధరకు..
మరి నను భరించే నాథుడెవ్వడు...
నను భరించే నాథుడెవ్వడు...

ప్రభో శూలపాణే విభో విశ్వనాథా..
మహాదేవ శంభో మహేశా త్రినేత్రా...
శివా కాంతశాంతస్మరారే పురారే...
పదన్యోవరేణ్యోనమాణ్యోనగన్యః

గళమున గరళము ధరించినావే...
తలపై గంగను భరించలేవా..
భవా....శివా...శివా...

కదిలింది కదిలింది గంగ...
కదిలి ఉప్పొంగింది గంగ ...
పరమ రాజసభావ పరిచుంబితనితాంగ
కదిలింది కదిలింది గంగ ...
కదిలి ఉప్పొంగింది గంగ ...

ఆకాశమే అదరగా... ఐరావతం బెదరగా
నందనవనం ప్రిదులగా... బృందారకులు చెదరగా

సాగింది సాగింది గంగ.. సాగి చెలరేగింది గంగ...
ఊగింది ఊగింది గంగ.. ఉద్వేగాభినేకాంతరంగ..
హరుని శిరమున పోటులెత్తగా.. బ్రహ్మాండభాండము బీటలెత్తగా...

ఉల్లల గంగా మహోర్ణికా వీచికా...
కల్లోల ధాటి ఒక కంట వీక్షించి..
సురగంగ గర్వంబు విరువంగ నెంచి ...
సంకీర్ణ చెటు ఝటాఝటలనుప్పొంగించి...
దుర్గంబుగా మలచినాడు...
గంగనద్భుతముగా బంధించినాడు ...

వెడయను అడవిని వడివడి అడుగిడి జాడ ఎరుంగనిదై ..
తడబడి నడచుచు గడగడ వడకుచు సుడివడిపోయినదై ...
ఒకపరి ఇటుచని ఒకపరి అటుచని మొఖమే చెల్లనిదై...
అగుపించని ఆ గగన గంగకై.. ఆక్రందించే భగీరథుడు...
ఆ మొర విని సురభిని చెర విడిపించెను కరుణాభరణుడు పురహరుడు...

ఉరికింది ఉరికింది గంగా..ఉన్మొత్త మానసవిహంగా..
మున్ముందుగా భగీరథుడు నడువంగా...
తన మేన సరికొత్త తరగలుప్పొంగ..
ఉరికింది ఉరికింది గంగా...

జలజలా పారుతూ... గలగల సాగుతూ..
చెంగుమని దూకుతూ... చెలరేగి ఆడుతూ...
తుళ్ళుతూ.. తూలుతూ... నిక్కుతూ.. నీల్గుచూ...
ముంచి వేసెను జహ్నుముని ఆశ్రమమునూ...
కనలి ఆ ముని మ్రింగే గంగాధరమునూ...

తరలింది తరలింది గంగా... సాగరుల పాపములు కడుగంగా..
సద్గతులనూ వారికొసగంగా... అల భగీరథునిచే ఇల పైన నిలుపంగా
తాను భాగీరథిగా... పుణ్యమొసగే నదిగా... తరలింది తరలింది గంగా...
గంగావతరణం

బుధవారం, ఫిబ్రవరి 26, 2014

అందెను నేడే అందని జాబిల్లి

తోడు అనేది అందని జాబిలిగా ఎంచి ఎదురు చూస్తున్న ఆమె దిగులును పటాపంచలు చేస్తూ తను కోరిన చెలుడు తన చెంతకు చేరాడట. ఆ ఆనందంలో ఇన్నేళ్ళకు వసంతములు విరిశాయిట, మల్లెలూ నవ్వాయిట ఇంకా ఆతని స్పర్శ తనలో గిలిగింతల పులకింతలు రేపాయిట. తనతోడు తనకి దొరికిందని ఇకపై కన్నీటి ముత్యాలు రాలవు, తోటలో పూవులూ వాడవు అంటూ నమ్మకంగా ఈమె చెప్తున్న ప్రేమ కబురు దాశరధి గారి మాటలలో విందామా. సాలూరు వారి సరళమైన సంగీతం ఈ పాటని కలకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది. చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.





చిత్రం : ఆత్మగౌరవం(1965)
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు 
సాహిత్యం : దాశరధి
గానం : సుశీల

 మ్.హుహుహు..ఓహోహొహోహోహో..
ఓహొహొహో ఆఅహాహాహహా
ఓహొహొహో ఆఅహాహాహహా


అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి


ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే 

అందెను నేడే అందని జాబిల్లి

నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
గిలిగింతల నా మేను పులకించెలే
నెలరాజే నాతో సరసములాడెనులే 

అందెను నేడే అందని జాబిల్లి
 
ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నా మది విహరించెలే
వినువీధిని నా మది విహరించెలే
వలరాజే నాలో వలపులు చిలికెనులే

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
నా అందాలన్ని ఆతని వెన్నెలలే

మంగళవారం, ఫిబ్రవరి 25, 2014

సంగీతం మధుర సంగీతం..

ఈ సినిమా గురించి మంచి మాటలు చాలా సార్లు విన్నాను కానీ పూర్తిగా చూసే ఆవకాశం ఎపుడూ దొరకలేదు. "కృష్ణవేణి తెలుగింటి విరిబోణి" పాటతో పాటు ఈ సినిమాలో నాకు ఇష్టమైన మరో పాట "ఈ సంగీతం మధుర సంగీతం" పాట, ఈ సంగీత దర్శకుడు విజయభాస్కర్ గారు చేసినవే తక్కువ సినిమాలో లేక హిట్ అయినవి కొన్నో తెలియవు కానీ సంగీత దర్శకునిగా చాలా అరుదుగా వినిపించే పేరు కానీ ఉన్నవాటిలో మంచి పాటలు ఉన్నాయి. ఈ చక్కని పాటను మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే చిమటాలో ఇక్కడ వినండి లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి.



చిత్రం : కృష్ణవేణి (1974) 
సంగీతం : విజయభాస్కర్
సాహిత్యం : ఆరుద్ర 
గానం : పి.సుశీల 

సంగీతం మధుర సంగీతం
సంగీతం మధుర సంగీతం
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం


ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం 
లలలా లలలా లలలలా... లలలా లలలా లలలలా
ఆహహహా.. ఆహహహా.. మ్.హుహుహుహూ..
ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం
మదిలో మమతలే మంజుల రవళిగ మ్రోగును మోహనరాగం
సంగీతం మధుర సంగీతం
బాలపాపల ఆటల పాటలె అమ్మకు కమ్మని గీతం
ఆకాశవీధుల సాగే గువ్వలు తెచ్చే ప్రేమ సందేశం

సంగీతం మధుర సంగీతం
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం


ఎన్నోనోముల పంటలుపండి ముచ్చట గొలుపు సంతానం
లలలా లలలా లలలలా.. లలలా లలలా లలలలా
ఆహహహా.. ఆహహహా.. మ్.హుహుహుహూ..
ఎన్నోనోముల పంటలుపండి ముచ్చట గొలుపు సంతానం
ఆశాఫలముల రాశులు ఎదలో చేసెను రాగ సంచారం
సంగీతం మధుర సంగీతం
శోభన జీవన దీపావళిలో పెరిగెను పావనతేజం
తనివే తీరా తనయుల చేర తల్లికి తరగని భాగ్యం

సంగీతం మధుర సంగీతం
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం

సోమవారం, ఫిబ్రవరి 24, 2014

తుమ్మెదా ఓ తుమ్మెదా

నాకు నచ్చిన మరో మాంచి కన్నయ్య పాట, ఊహూ కన్నయ్య పాట అనే కాదులెండి మాంచి రొమాంటిక్ పాట కూడా అనుకోవచ్చేమో డాన్సులు కాస్త పక్కన పెట్టేస్తే సిరివెన్నెల గారి సాహిత్యం మహదేవన్ గారి సంగీతాలను చాలా బాగా ఎంజాయ్ చేయచ్చు. ఇక పాటలో అచ్చతెలుగు పరికిణీలలో గౌతమి, భానుప్రియల గురించి చెప్పనే అక్కర్లేదనుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : శ్రీనివాస కల్యాణం(1987) 
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల సీతరామ శాస్త్రి 
గానం : బాలు, సుశీల 

తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 
 మగడు లేని వేళ తుమ్మెదా.. వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

 
ఎదురు పడితె కదలనీక దడికడతాడే
పొద చాటుకి పద పదమని సొద పెడతాడే 

 ఎదురు పడితె కదలనీక దడికడతాడే
పొద చాటుకి పద పదమని సొద పెడతాడే
 
ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా
ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా

చుట్టు పక్కలేమాత్రం చూడని ఆత్రం 
పట్టు విడుపు లేనిదమ్మ కృష్ణుని పంతం

మగడు లేని వేళ తుమ్మెదా.. వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 

తుమ్మెదా తుమ్మెదా

తానమాడు వేళ తాను దిగబడతాడే
మాను మాటు చేసి చుడ ఎగబడతాడే 

 తానమాడు వేళ తాను దిగబడతాడే
మాను మాటు చేసి చుడ ఎగబడతాడే 

చెప్పుకుంటె సిగ్గు చేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు 
 చెప్పుకుంటె సిగ్గు చేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు  
ఆదమరిచి ఉన్నామా కోకలు మాయం 
ఆనక ఎమనుకున్నా రాదే సాయం

మగడు లేని వేళ తుమ్మెదా.. వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

 
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

ఆదివారం, ఫిబ్రవరి 23, 2014

కలనైనా క్షణమైనా...

ఈ పాటలో బాలు గొంతు ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం. తను ఎన్టీఆర్ ఏఏన్నార్ లాంటి పెద్ద హీరోలకి కాకుండా చంద్రమోహన్ లాంటి వారికి పాడేటప్పుడు స్వచ్చంగా స్వేచ్చగా పాడతారనిపిస్తుంటుంది నాకు బహుశా అందుకేనేమో ఈ పాటలలో మరింత బాగుంటుంది. ఇక సినారే గారి పదాల ఎంపిక సింపుల్ అండ్ స్వీట్ అనిపించే పాటలలో ఇదీ ఒకటి... మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాధాకళ్యాణం (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల


ఊహూహూ..ఆఆఆఅ..లలలలలాఅ..ఆఅఅ 

ఊఊహుహూ...ఆఆఆఆఆఆ
కలనైనా క్షణమైనా మాయనిదే
మన ప్రేమా.. మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా.. మన ప్రేమా
 
కలనైనా క్షణమైనా...ఆఆఅ.ఆఆఅ.. 

 నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ

ఊపిరిలో.. ఊపిరిలా.. ఒదిగేదే.. మన ప్రేమా

కలనైనా క్షణమైనా..ఆఆఅ..ఆఆఆ..

నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
కౌగిలిలో.. ఊహూ.. కౌగిలిలా.. ఊఊ... 
కరిగేదే.. మన ప్రేమా

కలనైనా క్షణమైనా మాయనిదే
మన ప్రేమా మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా మన ప్రేమా
 
 
కలనైనా క్షణమైనా...ఆఆఅ.ఆఆఅ.. 
 

శనివారం, ఫిబ్రవరి 22, 2014

దిక్కులు చూడకు రామయ్యా

రేడియోలో విన్న పాటలలో ఇది కూడా ఒకటి. పాటలంటే బాలు గారి గొంతో ఘంటసాల గారి గొంతో తప్ప మిగిలిన గొంతులు ఏవీ పెద్దగా వినపడని ఆ రోజుల్లో మరో కొత్త గొంతు ఏది వినపడినా కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపించి చెవులు రిక్కించి వినేటైమ్ లో ఈ జి.ఆనంద్ గారి పాటలు కూడా ప్రత్యేకంగా అనిపించేవి. మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : కల్పన (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి 
గానం : సుశీల, జి.ఆనంద్

ఓఓ.ఓ..ఓ.ఓఓ..
దిక్కులు చూడకు రామయ్యా.. 
పక్కనే ఉన్నది సీతమ్మా
దిక్కులు చూడకు రామయ్యా.. 

పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా..

సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. 

ముందుకు రావే ముద్దుల గుమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మా... 

ముందుకు రావే ముద్దుల గుమ్మ...ముద్దులగుమ్మా

ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ...
ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ...
కదలికలన్నీ కథలుగ అల్లి 

కవితలే రాసుకుంటావో..రామయ్యా..
పొన్నలు పూచిన నవ్వు... 

సిరివెన్నెల దోచి నాకివ్వు.
పొన్నలు పూచిన నవ్వు... 

సిరివెన్నెల దోచి నాకివ్వు.
ఆ వెన్నెలలో... నీ కన్నులలో... 

ఆ వెన్నెలలో..నీ కన్నులలో..
సన్నజాజులే రువ్వు.. కను సన్నజాజులే రువ్వు.. 

సన్నజాజులే రువ్వు..కను సన్నజాజులే రువ్వు.. 
సీతమ్మా..సీతమ్మా 

దిక్కులు చూడకు రామయ్య
పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా..
సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. 

ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దులగుమ్మా

కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో..
కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో..
కలలిక మాని కలయికలో..

నా కనులలో చూసుకుంటావో.. రామయ్యా
వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు..
వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు..
ఆ వెల్లువలో... నా పల్లవిలో.. 

ఆ వెల్లువలో.. నా పల్లవిలో..
రాగమే పలికించు.. అనురాగమై పులకించు..

రాగమే పలికించు.. అనురాగమై పులకించు..
సీతమ్మా..సీతమ్మా.. 
 
దిక్కులు చూడకు రామయ్య
పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా..
సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. 

ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దులగుమ్మా..
 

శుక్రవారం, ఫిబ్రవరి 21, 2014

తొలిచూపు ఒక పరిచయం

టీవీలు రాకముందు నేను రేడియోలో విన్న మరిచిపోలేని పాటలలో ఇదీ ఒకటి. సాలూరు వారు, రాజన్-నాగేంద్ర, రమేష్ నాయుడు గార్ల పాటలు రేడియోలో వింటూ పెరగడం నాకు కలిగిన అదృష్టాలలో ఒకటి. ఈ పాటలలోని సంగీత సాహిత్యాల గొప్పదనం ఒక ఎత్తైతే ఈ పాటలు విన్నపుడల్లా నా మనసు ఆనాటి మధుర జ్ఞాపకాలలోకి పరుగులు తీయడం ఈ పాటలు నేనింతగా ఇష్టపడడానికి మరో కారణం. ఈ చక్కని పాట మీరూ విని చూసీ ఆస్వాదించండి..  ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : అద్దాలమేడ(1981)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : దాసరి నారాయణరావు.
గానం : బాలు, సుశీల

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం..అనురాగపు తొలి రంగం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం..అనురాగపు తొలి రంగం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం

ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
వెలిసింది దేవాలయం..అదే ప్రేమాలయం
ఒక రాగం పిలిచిన చోట..అనురాగం పలికిన చోటా
వెలిసింది రాగాలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం

ఆ ఆ ఆ ఆహ్హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లలలలా లలలా లాలా..ఆ ఆ ఆ
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విరిసిన చోట
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విరిసిన చోట
వెలిసింది హృదయాలయం..అదే ప్రేమాలయం
ఆకాశం వంగిన చోట..భూదేవిని తాకిన చోట
వెలిసింది ఒక ఆలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ల్లాలల్లా లాలాలలా..మ్మ్ మ్మ్ హు..లాలలా లలలాల
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విరిసిన చోట

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.