బుధవారం, డిసెంబర్ 11, 2013

మెరిసే మేఘమాలికా


బాలుగారి గళంలో లేత కొబ్బరి నీళ్లలాంటి కమ్మదనం పలుకుతున్న సమయంలో వచ్చిన ఈ మధుర గీతం ఎన్నిరోజుల తర్వాత విన్నా ఆకట్టుకుంటుంది అలాగే ఎన్నాళ్ళు గడిచినా శాశ్వతంగా మదిలో నిలిచిపోతుంది. సినారె గారి సాహిత్యం పెండ్యాల గారి స్వరం ఒకదానికొకటి చక్కగా అమిరాయి. సరళమైన పదాలలో అందమైన భావాలని పలికించే సినారే గారి సాహిత్యం చాలా బాగుంటుంది. ఈ అందమైన పాట ఇక్కడ వినండి.  

చిత్రం : దీక్ష (1974)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సినారె
గానం : బాలు

మెరిసే మేఘ మాలికా..
ఉరుములు చాలు చాలిక
చెలితో మాటలాడనీ..
వలపే పాట పాడనీ..
వలపే పాట పాడనీ

మెరిసే మేఘ మాలికా..
ఉరుములు చాలు చాలిక

కమలాలే నా రమణీ నయనాలై విరిసే
అద్దాలే నా చెలియ చెక్కిళ్ళై మెరిసే
ఆ నయనాల కమలాలలోనా..
నా జిలుగు కలలు చూసుకోనీ
ఆ అద్దాల చెక్కిళ్ళలోనా..
నా ముద్దులే దాచుకోనీ

మెరిసే మేఘ మాలికా..
ఉరుములు చాలు చాలిక

మధుమాసం చెలి మోవిని దరహాసం చేసే
తెలి జాబిలి చెలి మోమున కళలారబోసే
ఆ దరహాస కిరణాలలోనా..
నను కలకాలం కరిగిపోనీ
ఆ కళల పండువెన్నెలలోనా..
నా వలపులన్ని వెలిగిపోనీ.

మెరిసే మేఘ మాలికా..

మంగళవారం, డిసెంబర్ 10, 2013

ఆ చింత నీకేలరా.. స్వామీ నీ చెంత నేనుండగా..

అతను తేరగా వచ్చే మామగారి ఆస్థితో ఆడంబరాలను అనుభవించాలని ఆలోచనతో పెళ్ళిచేసుకుని తప్పని పరిస్థితులలో దానికి దూరమై తోడల్లుడు ఆ ఆస్థిని హారతికర్పూరం చేసేస్తున్నాడని అలాఅయితే తనవాటా ఏమీ మిగలదని దిగులు పడుతుంటాడు. ఆమె శ్రమైక జీవన సౌందర్యాన్ని నమ్ముకుని తండ్రి తాలూకు లక్షల ఆస్థిని వదులుకుని ప్రేమించి పెళ్ళిచేసుకున్న భర్త స్వశక్తితో సంపాదించిన దానితోనే తృప్తిగా బ్రతుకుదామని ఆలోచన ఉన్న అమ్మాయి భర్తకూడా అలాంటి ఉన్నతమైన ఆలోచనలే ఉన్నవాడని నమ్మిన మనిషి.

అలాంటి ఆమె తన భర్తతో ఆల్పమైన ఆడంబరాలకన్నా మేలైన సుఖసంతోషాలు మనసొంతమని చెప్తూ ఆస్థిపై దిగులు వీడమని బుజ్జగిస్తూ సాగే సంధర్బంలో వచ్చేపాట. పోతన గారి “మందార మకరంద” పద్యాన్ని అందంగా ఉపయోగించుకుని చక్కని సాహిత్యంతో వేటూరి, విశ్వనాథ్, కె.వి.మహదేవన్ లు కలిసి సృష్టించిన ఈ చక్కని పాట శుభోదయం సినిమా లోనిది. ఆ సినిమాలోని “కంచికి పోతావా కృష్ణమ్మా”, “గంధము పూయరుగా” పాటల మరుగున కాస్త తక్కువ పేరు తెచ్చుకున్నా ఈ పాట సాహిత్యం, చిత్రీకరణ, సంగీతం అన్నీ వేటికవే అన్నట్లు ఉంటాయి.

నాకు చాలా చాలా ఇష్టమైన పాట, చూడడం మరీ మరీ ఇష్టం. మొదటి చరణంలో సరసాలు సగ పాలు, నీ తోడు, పెరుగుమీగడ అంటూ వేటూరి వారు అలరిస్తే రెండో చరణంలో వెన్నెలమ్మ వన్నెలమ్మ ఏవంకలేని నెలవంక లాంటిమాటలతో గారడి చేస్తారు. ఈ అందమైన పాట చూడాలంటే ఎంబెడ్ చేసిన పూర్తి సినిమా వీడియోలో ఒకగంటా పదహారు నిముషాల వద్దకు ఫార్వార్డ్ చేసి కానీ లేదా ఈ లింక్ పై క్లిక్ చేసి కానీ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలని అనుకున్నవారు ఇక్కడ వినవచ్చు.


చిత్రం : శుభోదయం
సాహిత్యం : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : సుశీల

మందార మకరంద మాధుర్యమునదేలు
మధుపంబు పోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనునే తరంగిణులకూ...

ప్చ్.. అదిగాదు వాడక్కడ చేరి మొత్తం..

ఆ .. ఆ చింత నీకేలరా
ఆ చింత నీకేలరా
ఆ చింత నీకేలరా
స్వామీ నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా

సొంతమైన ఈ సొగసులేలక ..
పంతమేల పూబంతి వేడగ
సొంతమైన ఈ సొగసులేలక ..
పంతమేల పూబంతి వేడగ
ఆ చింత నీకేలరాఆఆ...

సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ
సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్ని
కరిగించి కౌగిళ్ళ తినిపించగా

ఆ .. ఆ చింత నీకేలరా
నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా

ఆవంక ఆ వెన్నెలమ్మ..
ఈ వంక ఈ వన్నెలమ్మా
ఆవంక ఆ వెన్నెలమ్మా..
ఈ వంక ఈ వన్నెలమ్మా
ఏ వంక లేని నెలవంక నేనమ్మ..
నీకింక అలకెందుకమ్మా !

చ్చ్.. చ్చ్.. చ్చ్.... అయ్యో !
లలిత రసాల పల్లవకారియైచొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరమరుగునే
సాంద్ర నిహారములకు..
వినుత గుణశీల మాటలు వేయునేలాఆఆ...

..ఆ చింత నీకేలరా
స్వామీ నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా

సోమవారం, డిసెంబర్ 09, 2013

అందమైన నా ఊహల మేడకు

రాజశేఖర్ కెరీర్ కు మేలిమలుపునిచ్చిన సినిమాల్లో ఒకటైన "ఆహుతి" సినిమాలోని ఈపాటను పాడుకోని కుర్రకారు బహుశా అప్పట్లో ఉండి ఉండదేమో. సత్యం గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చక్కని మెలొడీ... ఇప్పటికీ అలరిస్తుంది వింటూంటే నాస్టాల్జిక్ గా అనిపిస్తుంది. ప్రేయసిని తలచుకుంటూ తన అందాన్ని మెచ్చుకుంటూ తను పక్కన ఉంటే ఏం సాధించగలడో ఓ ప్రేమికుడు చక్కని తెలుగులో చెప్తూన్నట్లుగా సాగే ఈ పాట మల్లెమాల గారు అబ్బాయిలకి ఇచ్చిన మంచి గిఫ్ట్. ఈ అందమైన పాట మీకోసం.. ఆడియోను చిమటమ్యూజిక్ లో ఇక్కడ వినవచ్చు. 



చిత్రం : ఆహుతి (1988)
సంగీతం : సత్యం
సాహిత్యం : యం. యస్. రెడ్డి(మల్లెమాల)
గానం : బాలు

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం
ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం

మల్లెపూల కన్నా మంచు పొరల కన్నా
నా చెలి ముసి ముసి నవ్వులు అందం...
ఆ... నెమలి హొయలకన్నా...
సెలయేటి లయల కన్నా...
నా చెలి జిలిబిలి నడకలు అందం
అపురూపం ఆ నవ లావణ్యం...
అపురూపం ఆ నవ లావణ్యం
అది నా మదిలో చెదరని స్వప్నం...

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం

పైడిబొమ్మ లాంటి ఆమె పక్కనుంటె
పగలే వెన్నెల నే కురిపిస్తా...
ఆ... నీడ లాగ నాతో...
ఏడడుగులు సాగితే...
ఇలలో స్వర్గం నే సృష్టిస్తా...
రస రమ్యం ఆ రాగ విలాసం...ఆ..ఆ..
రస రమ్యం ఆ రాగ విలాసం
వసి వాడదు అది ఆజన్మాంతం

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం
ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం

ఆదివారం, డిసెంబర్ 08, 2013

పొంగి పొరలే అందాలెన్నో పొంగి పొరలే..

రాజా సంగీతంలో మాములు దర్శకులు ఎన్నుకునే పాటలే చాలా రోజులు గుర్తుండిపోయేలా ఉంటాయి ఇక అవతల ఉన్నది బారతీరాజా గారి లాంటి వ్యక్తి అయితే ఇక చెప్పేదేముంది... వినడానికి ఎంత హాయిగా ఉంటుందో ఈ పాట చిత్రీకరణ కూడా అంతే అందంగా సింపుల్ గా ఉంటుంది. సినారే గారి సాహిత్యంలో తెలుగుదనం ఉట్టిపడితే... బాలు గారు జానకి గారు ఒక డ్యూటీలా కాక పాటలో లీనమై సరాగాలాడుకుంటూ పాడిన ఈ అందమైన పాట మీకోసం. ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు. 



చిత్రం: కొత్త జీవితాలు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సినారె
గానం: బాలు, జానకి

పొంగి పొరలే ...అందాలెన్నో పొంగి పొరలే...

కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే...
కన్నెమదిలో అందాలెన్నో పొంగి పొరలే...
కోనల్లోనా.. లోయల్లోనా నేల పైన నింగి కదలే...
వన్నెకాడు నన్ను కలిసే...

పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా
పూలే రమ్మనగా... పరువాలే ఝుమ్మనగా
పవనాలే జిల్లనగా...హృదయాలే ఝల్లనగా
పొంగి పొరలే అందాలెన్నో ..పొంగి పొరలే
కోనల్లోనా... లోయల్లోనా...నేల పైన నింగి కదలే
వన్నెకాడు నిన్ను కలిసే....

కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా
కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా
మ్రోగిందీ.. రాగం..మ్రోగిందీ.. రాగం..
ఆడిందీ తాళం...అది నీ కోసం...హా.హా.హా

కన్నెమదిలో అందాలెన్నో..పొంగి పొరలే..
కోనల్లోనా లోయల్లోనా నేల పైన నింగి కదిలే...
వన్నెకాడు నన్ను కలిసే

పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా
పాటలు నేర్చే భామా...తొలిపాఠంలే మన ప్రేమా
కన్నుల్లో... మౌనం ...కన్నుల్లో... మౌనం...
నవ్వుల్లో గానం..అది నా కోసం...హా.హా.హా..

పొంగి పొరలే అందాలెన్నో..పొంగి పొరలే
కోనల్లోనా.. లోయల్లోనా..నేల పైన నింగి కదలే
వన్నెకాడు నిన్ను కలిసే...

శనివారం, డిసెంబర్ 07, 2013

కొత్త బంగారు లోకం..

వర్మ స్టైల్లో మణిరత్నం తీసిన సినిమా “దొంగ దొంగ” అనిపిస్తుంటుంది నాకు. అప్పట్లో ఈ సినిమాకి వర్మ కూడా పని చేశారన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. సి.బి.ఐ ఆఫీసర్ గా బాలు గారి నటన చాలా పెక్యూలియర్ గా ఉంటుంది. సినిమా చూసివచ్చి మా ఫ్రెండ్స్ అందరికి బాగుందని చెప్తే సినిమానేమో ఫ్లాపు, అంతేకాక చాలా మంది ఇతర ఫ్రెండ్స్ కి నచ్చలేదని ఆ తర్వాత మా అభిప్రాయం అడగడమే మానేశారు :-)

రెహమాన్ సంగీతం మాత్రం అప్పట్లో ఉర్రూతలూగించింది, దీనిలో ఈ కొత్తబంగారులోకం పాట కొంచెం ఎక్కువరోజులు వినిపించిన పాట, సాహిత్యం కూడా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు.    



చిత్రం : దొంగ దొంగ
సాహిత్యం : రాజశ్రీ
సంగీతం : ఏ.ఆర్.రహమాన్
గానం : మనో, చిత్ర

కొత్త బంగారు లోకం.. 
మాకు కావాలి సొంతం..
గాలి పాడాలి గీతం.. 
పుడమి కావాలి స్వర్గం..

కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

జంట నెలవంకలుండే నింగి కావాలి మాకు
వెండి వెన్నల్లలోనే వెయ్యికలలు పండాలి మాకూ..
పువ్వులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్చీ
పాటలే పాడుకోవాలి అది చూసి నే పొంగి పోవాలీ..
మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోను ఉండని
మమతనే ప్రతి మనసులొ కొలువుండని
మనుగడే ఒక పండగై కొనసాగని

కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం

కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం

ఓడిపోవాలి స్వార్దం ఇల మరిచిపోవాలి యుద్ధం
మరణమే లేని మానవులె ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసిపోని అమృతం పొంగిపోనీ
శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడని ప్రతినిత్యం
వేదనే ఇక తొలగనీ.. వేడుకే ఇక వెలగనీ..
ఎల్లల పోరాటమే ఇక వీడనీ
ఎల్లరు సుఖశాంతితో ఇక బ్రతకని

కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం

కొత్త బంగారు లోకం, మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం

శుక్రవారం, డిసెంబర్ 06, 2013

మాటకందని పాటగా...

ఈరోజు నుండీ కొంతకాలంపాటు ఈ బ్లాగ్ లో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఒక మంచి పాటతో మిమ్మల్ని పలకరించాలని నిర్ణయించుకున్నాను, అలాగే మీకు నచ్చిన పాటలు వేటికైనా లిరిక్స్ కావలసి ఉంటే కూడా ఈ బ్లాగ్ పోస్టులలో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. తప్పకుండా సాధ్యమైనంత త్వరలో అందించడానికి ప్రయత్నిస్తాను.

ముందుగా మధురమైన పాటలంటే పాతవి మాత్రమే కాదు కొత్తపాటల్లోనూ అందమైన పాటలూ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలూ ఉంటాయనే నమ్మకాన్ని కలిగించిన కొత్త సినిమా “మల్లెలతీరం” నుండి “మాటకందని పాటగా” పాట సాహిత్యం మీకోసం. సినిమా కథా నేపధ్యాన్ని పక్కన పెడితే ఇద్దరు ప్రేమికుల మధ్య పాటగా చూసినపుడు ఈ పాట చాలా చాలా బాగుంటుంది దదాపు ఒక నెలపాటు నేను రోజూ విన్నపాట ఇప్పటికీ తరచుగా వినేపాట. కొత్తపాటలలో ఇలా వినగలిగేవి దీర్ఘకాలం మనగలిగేవీ బహు అరుదు అని చెప్పచ్చేమో. అలాంటి అరుదైన పాట ప్రోమో మీకోసం.


పూర్తిపాట ఆడియో వర్షన్ రాగాలో ఇక్కడ కానీ కింద ఎంబెడ్ చేయబడిన జ్యూక్ బాక్స్ లో ఇక్కడ కానీ వినవచ్చు. డివిడి రిలీజ్ కానందున ఇంకా పూర్తి వీడియో సాంగ్ లభ్యత లేదు.



చిత్రం : మల్లెలతీరం
సాహిత్యం : ఉమామహేశ్వరరావు
సంగీతం : పవన్ కుమార్
గానం : నిత్యసంతోషిణి

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా

తూరుపు వెలుగుల పడమటి జిలుగుల
పగడపు మెరుపులలో మనమే
సాగర తీరపు చల్లని గాలుల గానంలో మనమే
చంద్రుడైనా చిన్నబోయే, ఇంద్రధనుసున ఇద్దరమే
చీకటి నలుపున మనమే
చిగురాకుల ఎరుపున మనమే
అలలకు కదులుతు అలసట ఎరుగని
నడచిన నావలు మనమే
ఆశల ఉషస్సున ఆరని జ్యోతులమిద్దరమే!

ఆఅ... మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా

స్వఛ్చపు తొలకరి వెచ్చని జల్లుల
పచ్చని కాంతులలో మనమే..
గలగల పరుగుల సరిగమ పలుకుల సెలపాటల మనమే
నింగి నేల చిన్నబోయే రంగులన్నీ ఇద్దరమే
ముసిరిన మంచున మనమే
గతియించని అంచున మనమే
ద్వైతము ఎరగని చరితను చెరపని కమ్మని ప్రియకథ మనమే
ఊహల జగాలలో ఊపిరి ఊసులమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా
మల్లెపువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసే సరసులోనా పరాగమే మనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే

మాటకందని పాటగా మనమిద్దరమూ కలిశాముగా

 

మంగళవారం, డిసెంబర్ 03, 2013

సింగారాలా పైరుల్లోనా

మణిరత్నం ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “దళపతి” కి రాజా ఇచ్చిన ఆర్కెస్ట్రేషన్ అమేజింగ్, ఈ సినిమా నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంటుంది ఇక ప్రత్యెకించి ఈ పాటకి ముందు చివరిలోనూ వచ్చే డ్రమ్స్ కానీ పాటంతా ఒక థీమ్ లా బాక్ గ్రౌండ్ లో వచ్చే బీట్స్ కానీ రియల్లీ గ్రేట్. ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో ఏసుదాస్ గారు బాలు గారు కలిసి ఈ పాటకి ప్రాణం పోశారు. 

రాజశ్రీ గారి సాహిత్యంలో చాలా మణిరత్నం పాటల్లోలాగే కాస్త డబ్బింగ్ వాసనలు కనిపించినా కూడా హీరోలిద్దరి మధ్య స్నేహం గురించి రాసిన రెండవ చరణం చాలా బాగుంటుంది. ఇక సినిమాలో కూడా ఈ పాట సింపుల్ చిత్రీకరణతో ఆకట్టుకుంటుంది మధ్యలో నిర్మలమ్మ గారు డాన్స్ చేసి రజనీని పడేయడం నవ్విస్తుంది. ఈ సినిమాతో పెనవేసుకుని ఉన్న ఓ జ్ఞాపకాన్ని నా మెయిన్ బ్లాగ్ లో చెప్పుకుందాం ఇక్కడ పాట విని/చూసి ఆస్వాదించండి... యూ ట్యూబ్ యాక్సెస్ చేయలేని వాళ్ళు ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.




చిత్రం : దళపతి
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, ఏసుదాస్, కోరస్

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్...

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

వద్దంటా నే పాతదనాన్ని ముద్దంటా నే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకో మంటారా... రేయ్..
బతుకే దారి పోతే ఎంటీ బాటేదైనా నీకది ఏంటి..
నారుని వేసే ఆ పై వాడే నీరే పోస్తాడే...హోయ్..
మూల బడి వున్న బుట్టా తట్టా తీసి 
భోగి మంటల్లోన నీవే వెయ్యరా..హోయ్..
తెల్లవారగానే సంకురాత్రి కాదా 
పొంగే పాలు అందరి పాలు హాయిగా...
నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు 
అంతకంటే సందడేది లేదే... హోయ్

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా.. హొయ్...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

బంధాలేంటి భందువులేంటి.. పోతే ఎంటి వస్తే ఏంటీ..
తిండే లేదని దిగులే పడని జన్మే నాదీరా..హ హ
మనసే ఇచ్చి చెయ్యందించి తోడూ నీడై మిత్రుడు కలిసే..
ఆతనికంటే చుట్టాలెవరూ నాకే లేరంటా...
హృదయం మాత్రం నాదే.. ఊపిరి కాదా తనదే..
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే...
నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ..
తన మాటే నాకు వేదం అంటా ఏ వేళా...
శోకం వీడే స్వర్గం చూసే..రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వుల జంటా మేమే...

సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...
ఈనాడు..ఊరంతటా..రాగాల దీపాలట...
మీకొసం వెలిగేనట...ఉల్లాసం మీదేనటా..హొయ్...
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి...
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి...

సోమవారం, సెప్టెంబర్ 23, 2013

రుక్మిణీ కళ్యాణం హరికథ

హరికథా ప్రక్రియపై నాకున్న మక్కువ మీ అందరికీ తెలిసినదేగా ముఖ్యంగా సినిమాల్లో వచ్చే హరికథలంటే నాకు మరీ ఇష్టం. సూత్రధారులు సినిమాలోని ఈ రుక్మిణీ కళ్యాణ హరికథ కూడా బాగుంటుంది. సాథారణంగా కథకులుగా మగవాళ్ళనే చూస్తుంటాం అయితే ఈ సినిమాలో రొటీన్ కి భిన్నంగా కె.విశ్వనాధ్ గారు కె.ఆర్.విజయ గారితో హరికథ చెప్పించారు. ఆవిడ ఆహార్యానికి తగినట్లుగా సుశీల గారు నేపధ్యగానం చేశారు, కనులు మూసుకుని కథ వింటూంటే సన్నివేశాలు (సినిమాలోవి కాదు రుక్మిణీ కళ్యాణంలోని సన్నివేశాలు) కళ్ళముందు సాక్షాత్కరించేస్తాయి. 

ఈ పాటను రాసినది మాడుగుల నాగఫణి శర్మ గారన్న విషయం ఈరోజే దీని గురించి వెతుకుతుంటే తెలిసింది. ఇవికూడా ఏవైనా పద్యాలలోవేమో తెలియదు కానీ ప్రాసతో కూడిన కొన్ని కొన్ని పదప్రయోగాలు చాలా ఆకట్టుకుంటాయి. కె.వి.మహదేవన్ గారి బాణి గురించి నే చెప్పగలిగినదేముంది అద్భుతమనే మాట తప్ప. ఈ హరికథను మీరు ఇక్కడ వినవచ్చు ప్లే లిస్ట్ లో మొదటినుండి ఐదవ పాట “శ్రీరస్తూ శుభమస్తూ” అనే టైటిల్ తో ఉంటుంది.  

చిత్రం : సూత్రధారులు
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : మాడుగుల నాగ ఫణి శర్మ
గానం : సుశీల, ఎస్. పి. పల్లవి

శ్రీమద్ గజాననం నత్వా
స్తుత్వా శ్రీ సత్య సాయినమ్
శ్రీ హరికథా పితామహమహమ్ వందే..
నారాయణ దాస సద్గురుమ్.

శ్రీరస్తూ... శుభమస్తూ...

శ్రీరస్తు శుభమస్తు
సత్కథాలహరికీ.. హరికీ ..
ఆగమలతల కొసల విరిసినా విరికి... హరికీ
కోటి కొంగుల ముడుల పుణ్యంబు సిరికీ... హరికీ
సిరికీ... హరికీ.. శ్రీరస్తు శుభమస్తు

యత్ర శ్రీకృష్ణ సంకీర్తనమ్..
తత్ర శుభమంగళ సంవర్తనమ్... అని ఆర్యోక్తి..
అలాంటి సర్వమంగళ మోహనాకారుడైన శ్రీకృష్ణుడి అనేకానేక లీలా వినోదములలో... రుక్మిణీ కల్యాణ సత్కథా మధురాతి మధురమైనది.. అందలి నాయికామణి...
ఆ రమణీ..
లలిత పల్లవపాణి నీలసుందరవేణి...
అందాల పూబోణి... ఆ రుక్మిణీ...
అందాల పూబోణి... ఆ రుక్మిణీ...

కనులవి తెరచిన చాలు.. యదునందను అందమె గ్రోలూ
కరములు కదలిన చాలు.. కరివరదుని పదముల వ్రాలు
పెదవులు మెదిలిన చాలు.. హరిజపముల తపములదేలు
ఉల్లమంతా నల్లనయ్యే.. వలపు ఓపని వెల్లువయ్యే..

అంతలో..

యదుకేసరితో హరితో గిరితో
మన వియ్యము గియ్యము కూడదని
శిశుపాలుని పాలొనరింతునని
తన సోదరుడాడిన మాటవినీ..
దిగులుగొనీ.. దిక్కెవ్వరనీ.. 

తలపోసి తలపోసి తెలవారగా..
తనువెల్ల తపనలో తడియారగా..
తలపోసి తలపోసి తెలవారగా..
తనువెల్ల తపనలో తడియారగా..
ప్రళయమే రానున్నదని ఎంచెను..
ప్రణయ సందేశమాస్వామీ కంపెనూ..

ఆ లలిత పల్లవపాణి.. నీల సుందర వేణి..
అందాల పూబోణి ఆ రుక్మణీమణికి..
శ్రీరస్తు శుభమస్తు..
శ్రీరస్తు శుభమస్తు.

అగ్రజుడైన రుక్మి తన పంతమే తనదిగా
శిశుపాలునికిచ్చి వివాహము జరిపింప నిశ్చయింపగా
ఆ చిన్నారి రుక్మిణీ.. 

రానన్నాడో... తానై రానున్నాడో...
ప్రభువు ఏమన్నాడో.. ఏమనుకున్నాడో
అని మనసున విలవిలలాడు తరుణంబున

అది గ్రహించని చెలికత్తెలా రుక్మిణీదేవికీ...

తిలకము దిద్దిరదే... కళ్యాణ తిలకము దిద్దిరదే
చేలముగట్టిరదే... బంగారు చేలముగట్టిరదే
బాసికముంచిరదే... నుదుటను బాసికముంచిరదే
పదములనలదిరదే... పారాణి పదములనలదిరదే...
పారాణి పదములనలదిరదే...

ఇవ్విదమ్మున అలంకరింపబడిన రుక్మిణిదేవీ...
శిలపై అశువులుబాయు బలిపశువు చందంబున...
అందంబును ఆనందంబును వీడి...
డెందంబున కుందుచుండగా...

అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
శ్రీరుక్మిణీ హృదయప్రణయాక్షరీ
అదిగో వచ్చెను వాడె...

వచ్చీ వైరుల ద్రుంచి.. వరరత్న మై నిల్చి
వనితా మనోరధము దీర్చీ.. రథము బూన్చి
జయవెట్ట జనకోటి.. వెడలే రుక్మిణి తోటి
అదిగో అదిగో వాడే హరి శ్రీహరి..

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా...
న్యాయేన మార్గేన మహిమ్ మహీశాః...
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమ్
లోకా సమస్తా సుఖినో భవంతు...
 

శుక్రవారం, సెప్టెంబర్ 13, 2013

ఇంతకూ నువ్వెవరూ !!

సినీ ప్రపంచంలో ఒకోసారి కొత్తవాళ్ళు భలే మెరిపిస్తారు, దదాపు అందరూ కొత్తవాళ్ళే పని చేసిన “స్నేహితుడా” సినిమా లోని ఈ పాట అలాంటి వాటిలో ఒకటి. ఈ సినిమా పూర్తిగా చూసే అవకాశం నాకు ఇప్పటివరకూ దొరకలేదు కానీ ఈ పాటమాత్రం కొన్ని వందల సార్లు విన్నాను. సంగీత దర్శకులు, పాటల రచయిత సినిమా దర్శకుడు అంతా కొత్తవాళ్ళే అయినా శ్రేయఘోషల్ ఈ పాటకి ప్రాణం పోసింది. మీరూ ఓ సారి వినండి. ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. వీడియో ఈ క్రింద చూడగలరు.


చిత్రం : స్నేహితుడా
సంగీతం : శివరామ్ శంకర్
సాహిత్యం : భాషాశ్రీ
గానం : శ్రేయా ఘోషల్

Who who who who are you
Who who who who are you

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకూ ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఆఆఆఆఆ.అ.అ.అ.ఆఆఆఆఅ

ఎందుకో ఏమిటో నేను చెప్పలేను గానీ
కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాలా
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే
నీ తీరే ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

సోమవారం, సెప్టెంబర్ 02, 2013

నేనేనా ఆ నేనేనా...

కళ్యాణికోడూరి(కళ్యాణిమాలిక్) కంపొజిషన్ నాకు చాలా నచ్చుతుంది. నా మిత్రులలో కొందరు తనవన్నీ మెలోడీస్ ఆల్మోస్ట్ అన్ని పాటలు ఒకేలాగా ఉంటాయ్ అని కంప్లైంట్ చేసినవాళ్లు కూడా లేకపోలేదు. కానీ నాకు మాత్రం తన పాటలు వేటికవే స్లైట్ వేరియేషన్ తో ఎక్కువకాలం గుర్తుండిపోయేలా ఉంటాయ్ అని అనిపిస్తుంటుంది. "అంతకుముందు ఆ తరువాత" సినిమా కోసం తను కంపోజ్ చేసిన ఈ "నేనేనా ఆ నేనేనా" అనే పాట కూడా అలాగే నాకు చాలా నచ్చేసింది. ఈపాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ బిట్ చాలాబాగుంది. సిరివెన్నెల గారి సింపుల్ సాహిత్యం సినిమాలోని సన్నివేశాన్ని పాత్రల మనోభావాల్ని సున్నితంగా మన కళ్ళముందు పెడుతుంది. ఈమెలోడికి శ్రీకృష్ణ సునీతల స్వరం చక్కగా అమరింది. పూర్తిపాట ఆడియో లింక్ దొరకలేదు మీకెవరికన్నా తెలిస్తే కామెంట్స్ లో ఇవ్వగలరు. యూట్యూబ్ లో పూర్తిపాట ఇక్కడ వినవచ్చు. సిరివెన్నెల గారి చేతిరాతలో ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూస్తూ పాట వినవచ్చు.


 
చిత్రం : అంతకుముందు ఆతరువాత
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : కళ్యాణి కోడూరి(కళ్యాణిమాలిక్)
గానం : శ్రీకృష్ణ, సునీత

నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!
ఉన్నానా నేనున్నానా!
ఉన్నానుగా అంటున్నానా!!
వెళ్ళొస్తానంటూ ఆ నిజం
ఓ జ్ఞాపకంలా మారిపోతున్నా
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం.
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

గాలిలో మేడ గాల్లోనే ఉంటుంది
నేలకేనాడు దిగిరాదనీ.
నీటిలో నీడ నీళ్ళల్లో కరిగింది
చేతికందేది కాదే అనీ
చెప్పాలా ఎవరో కొత్తగా
అది నమ్మలేనీ వింతకాదనీ
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

ఆఅ.ఆఆఆఆఆఆఆఆ...

నన్ను నాలాగ చూపించవే అంటూ
నిలువుటద్దాన్ని నిందించనా
నేను తనలాగ ఏనాడు మారానో
నాకు నేనింక కనిపించనా
అద్దంలో లోపం లేదనీ
నా చూపులోనే శూన్యముందనీ
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.