రమేష్ నాయుడి గారి కమ్మనైన సంగీతంలో హాయైన ఈ పాట ఒకసారి విన్నవారు ఎవరైనా మర్చిపోగలరా ? మీరూ మీడియం వాల్యూంలో పెట్టుకుని ఒకసారి వినండి. ప్రారంభంలోనే మురళీ నాదంతో పాటు వచ్చే ఆలాపన వింటూంటే అలా సాయం సంజెలో మెల్లగావీచే చల్లని గాలి శరీరాన్నీ మనసునీ తేలిక పరుస్తుంటే మెల్లగా కళ్ళుమూసుకుని ఊయలపై కూర్చున్న అనుభూతినిస్తే "సువ్వీకస్తూరి రంగా" అంటూ జానకమ్మ గారు పాట అందుకోగానే నేపథ్యంలో క్రమం తప్పకుండా ఒకే రిథమ్ లొ సాగే సంగీతం మెల్లగా మనని ఊయలలూపుతుంటే మనసు అలా అలా గాలిలో తేలిపోతుందంటే అతిశయోక్తికాదేమో. రమేష్ నాయుడి గారి సంగీతానికి నేను దాసోహమనడానికి ఈ సింపుల్ ఆర్కెస్ట్రేషన్ ఒక కారణమేమో అనిపిస్తుంటుంది. ఇక మధ్యలో పడవ నడిపే వాళ్ళ పదాలతో ’హైలెస్సా హయ్య’ అంటూ వచ్చే కోరస్ పాటకు మరింత అందాన్నిస్తుంది. ఈ సినిమా నేను చూడలేదు ఈ పాట నేపధ్యం గురించి అస్సలు తెలీదు కానీ వినడం మాత్రం చాలా ఇష్టం. మీరూ ఇక్కడ విని ఆనందించండి.
చిత్రం : చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : దాసం గోపాలకృష్ణ
గానం : జానకి, బాలు.
సువ్వి ఆహు.. సువ్వి ఆహు.. సువ్వి.. సువ్వి..
ఆ..ఆ...ఆఅ....హోయ్..
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..
హైలేసా హయ్యా.. హైలేసా హయ్యా..
హైలేసా హయ్యా.. హైలేసా హయ్యా..
అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు.. ఓ చెలియా.. ||2||
నా వద్దకు వచ్చెను ఓ సఖియా..

ఊఉహు హయ్యా.. ఊఉహు హయ్యా..
ఊఉహు హయ్యా.. ఊఉహు హయ్యా..
వంగి వంగి నను తొంగి చూచెను కొంగుపట్టుకుని లాగెనుగా.. ||2||
భల్ ఛెంగున యమునకు సాగెనుగా..

అల్లావనమున కొల్లలుగా వున్న గొల్లభామలను కూడితినీ..
నే గొల్లా భామనై ఆడితిని.. నే గొల్లా భామనై ఆడితిని..
సువ్వీ కస్తూరి రంగా.. సువ్వీ కావేటి రంగా
సువ్వీ రామాభిరామా.. సువ్వీలాలీ..
సువ్వి.. ఆహూం.. సువ్వి.. ఆహుం..
నిద్దురలేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా..ఆఅ....
నిద్దురలేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా..
హబ్బ.. అద్దినట్టుందె ఓ సఖియా...