
ఈ రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్న మహాలక్ష్ములకు, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలందిస్తున్న పురుష పుంగవులకూ ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ సంధర్బంగా అయ్యవారి ఎక్కువేవిటో వారికన్నా తానెందులో తక్కువో తేల్చి చెప్పమని అమ్మవారు అడిగే ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆలోచన బాపూరమణలలో ఎవరిదో కానీ ఆరుద్ర గారి సాహిత్యం మాత్రం వహ్వా అనిపించక మానదు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
...