ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

గాలి వానలో..

స్వయంవరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వయంవరం (1982)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాసరి
గానం : ఏసుదాస్

గాలి వానలో.. వాన నీటిలో..
గాలి వానలో వాన నీటిలో
పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం
తెలియదు పాపం

గాలి వానలో వాన నీటిలో
పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో
ఒఒఒ.... ఒఒఒ

ఇటు హొరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
ఇటు హొరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
హొరు గాలిలో వరద పొంగులో
సాగలేనని తెలుసు

అది జోరు వాన అని తెలుసు
ఇవి నీటి సుడులని తెలుసు
అది జోరు వాన అని తెలుసు
ఇవి నీటి సుడులని తెలుసు
జోరు వానలో నీటి సుడులలో
మునక తప్పదని తెలుసు

అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో

ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలాగటం
ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలాగటం
ఆశ జారినా వెలుగు తొలిగినా
ఆగదు జీవిత పొరాటం

ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై
బ్రతుకుతున్నదొక శవం

అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం
తెలియదు పాపం

గాలి వానలో వాన నీటిలో
పడవ ప్రయణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం
తెలియదు పాపం
ఒహోహో ఒహోహో
ఒహోహో ఒహోహో

 

2 comments:

యేసుదాస్ గారు పాడటం వల్ల అనుకుంటా..ఈ పాట, చుక్కల్లే తోచావే అప్పటిలో అన్ని పాటల పోటీల్లో యెటెంప్ట్ చేసేవారు..

అవునండీ ఏసుదాస్ గారి వల్లే ఈ పాట ఇంతగా పాపులర్ అయింది. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.