బుధవారం, ఆగస్టు 07, 2019

శ్రీదేవిని.. నీదు దేవేరిని...

శ్రీ వేంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : ఆరుద్ర 
గానం : ఎస్.వరలక్ష్మి

శ్రీదేవిని.. నీదు దేవేరిని
సరిసాటిలేని సౌభాగ్యవతిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని


అనుపమ కౌస్తుభ మణియందు నెలకొని
అనుపమ కౌస్తుభ మణియందు నెలకొని
నీ హృదయ పీఠాన నివసించుదాన
శ్రీదేవిని నీదు దేవేరిని
సరిసాటిలేని సౌభాగ్యవతిని


పాలకడలిలో ప్రభవించి.. మురిపాల కడలిలో తేలితిని
పాలకడలిలో ప్రభవించి.. మురిపాల కడలిలో తేలితిని
పదునాల్గు భువనాలు పరిపాలించు
నీ మది నేలి లాలించు భాగ్యము నాదే

శ్రీదేవిని.. నీదు దేవేరిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని


కలిమికి నేనే దేవతనైన.. నీ చెలిమియె నా కలిమి కదా
కలిమికి నేనే దేవతనైన.. నీ చెలిమియె నా కలిమి కదా
ఎనలేని అనురాగ సంతోషములతో.. ఆ.. ఆ
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఎనలేని అనురాగ సంతోషములతో
యేనాటికీ మనకు ఎడబాటులేదు
యేనాటికీ మనకు ఎడబాటులేదు

శ్రీదేవిని.. నీదు దేవేరిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని
సరిసాటిలేని సౌభాగ్యవతిని
శ్రీదేవిని.. నీదు దేవేరిని


 

4 comments:

S వరలక్ష్మి గారు అద్భుతమైన గాయని.

థాంక్స్ ఫర్ ద కామెంట్ బుచికి గారు..

యెన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.