సోమవారం, సెప్టెంబర్ 11, 2017

అయ్యయ్యో చేతిలో డబ్బులు...

కులగోత్రాలు చిత్రంలో జూదం గురించి ఒక సరదా అయిన పాట. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కులగోత్రాలు (1962)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : మాధవపెద్ది, పిఠాపురం, రాఘవులు

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే
ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది
ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది
పెళ్లాం మెళ్లో నగలతో సహా
తిరుక్షవరమై పోయింది
పెళ్లాం మెళ్లో నగలతో సహా
తిరుక్షవరమై పోయింది

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే

ఆ మహా మహా నలమహారాజుకే
తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయీ

మరి నువు చెప్పలేదు భాయీ
అది నా తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగ
చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ
బాబూ నిబ్బరించవోయీ


అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే

నిలువు దోపిడీ దేవుడికిచ్చిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
గోవిందా గోవిందా
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
చక్కెర పొంగలి చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చుపెడితే
ఎం.ఎల్.ఏ దక్కేది
మనకు అంతటి లక్కేదీ

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే

గెలుపూ ఓటమి దైవాధీనం
చెయ్యి తిరగవచ్చు
మళ్ళీ ఆడి గెల్వవచ్చు

ఇంకా పెట్టుబడెవడిచ్చు
ఇల్లు కుదవ పెట్టవచ్చు
ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో
మన కరువు తీరవచ్చు

పోతే అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.