శుక్రవారం, ఏప్రిల్ 18, 2014

క్షణం క్షణం నా మౌనం...

హిందీలో సూపర్ హిట్ అయిన "కహానీ" చిత్రానికి తెలుగు సేత "అనామిక" శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తయారవుతున్నదని అందరికి తెలిసిన విషయమే. ఆ చిత్రం కోసం సిరివెన్నెల గారు రాయగా కీరవాణి గారు స్వరపరచిన ఈ పాట నాకు నచ్చింది. సినిమాలోని పాటనే యథాతథంగా ఉపయోగిస్తూ గాయని సునీతతో సినిమాలోని సీన్స్ మిక్స్ చేసి చేసిన ప్రమోషనల్ మ్యూజిక్ వీడియో ఇది, మీరూ ఆస్వాదించండి.  



చిత్రం : అనామిక (2014)
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : కీరవాణి
గానం : సునీత

ఎవ్వరితో చెప్పనూ.. ఎక్కడనీ వెతకనూ..
మనసు ఏదనీ... నిను చేరె ఆశతో..
ఎదురీదే శ్వాసతో.. గాలిలో తిరుగుతూ..
ఉండనీ.... ఎవరితో.. చెప్పనూ..

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
 
క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

నిను మరువదే తలపు
వెను దిరగదే చూపు
కనపడనిదే రేపు
నమ్మడమెలా.. నువ్వు కలవేననీ
కంటపడవా.. ఉన్నాననీ..

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

నను తరుముతూ సమయం
నిను తడుముతూ హృదయం
ఎటు నడపనూ పయనం
ఎంతవరకూ.. ఇలా కొనసాగనూ..
ఏ మలుపులో.. నిను చూడనూ..

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది

క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది 
 

2 comments:

సునీత విజువల్ గా చాలా అందంగా వున్నారీ పాటలో..ఆల్ ద బెస్ట్ ఫర్ హెర్ ఫ్యూచర్ విజువల్ సాంగ్స్.

కరెక్ట్ శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.