బుధవారం, ఏప్రిల్ 30, 2014

కన్నె కొమ్మన తుమ్మెద...

ఇళయరాజా గారి సంగీత సారధ్యంలో వచ్చిన కాలాపాని సినిమాలో దదాపు అన్నిపాటలు బాగున్నా కూడా ఈ పాట నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ప్రత్యేకంగా చిత్రీకరణ పరంగా కూడా ఈ పాట ఆసక్తికరంగా చిత్రీకరించారు ప్రియదర్శన్. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.  చిత్రం : కాలా పాని (1996) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : నారాయణ వర్మగానం : బాలు, చిత్ర కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా.. సయ్యాటల ..ఉయ్యాలల.. ఆనవాలా... విందీయగ.. పూదేనియ.....

మంగళవారం, ఏప్రిల్ 29, 2014

నాగమల్లివో తీగ మల్లివో...

రాజన్ నాగేంద్ర గారి సంగీతంలో ఒక మధురమైన పాట. చిన్నపుడు రేడియోలో చాలా ఎక్కువగా విన్నపాట... అలా గుర్తుండిపోయింది. ఈ పాటలో నాగమల్లివో.. తీగమల్లివో.. అని ఒక్కో పదానికి బ్రేక్ వచ్చినపుడు వచ్చే ఒక చిన్న మ్యూజిక్ బిట్ తో సహా పాడేసుకునే వాణ్ణి చిన్నప్పుడు. సున్నితంగా అలా సాగిపోయే ఈ పాట నాకు చాలా ఇష్టం మీరూ విని ఆస్వాదించండి. వీడియో లింక్ దొరకలేదు మీకు తెలిస్తే కామెంట్స్ లో పంచుకోండి.    చిత్రం : నాగమల్లి (1980) సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం...

సోమవారం, ఏప్రిల్ 28, 2014

ఈ చైత్ర వీణా...

వంశీ ఇళయరాజా వేటూరి ఈ ముగ్గురు కలిస్తే ఇక మనకు మాటలకు అవకాశమెక్కడ ఉంటుంది చెప్పండి తనివితీరా కమ్మని పాటను ఆస్వాదించడమే తప్పించి. ప్రేమించు పెళ్ళాడు సినిమాకోసం ఈ ముగ్గురు సిద్దం చేసిన ఈ అద్భుతమైన పాటను మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని రొదగా ..నా ఎదలో.....

ఆదివారం, ఏప్రిల్ 27, 2014

జూలై మాసం వస్తే...

పద్మవ్యూహం  సినిమాలో చలాకీ అయిన ఒకపాట ఇది.. సరదాగా ఉంటుంది.. మీరూ చూసీ విని ఎలా ఉందో చెప్పండి. ఎంబెడ్ చేసిన వీడియో తమిళ్ పాటది. తెలుగు ఆడియో ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు లేదా ఇక్కడ విని డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పద్మవ్యూహం (1993) సంగీతం : ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం : రాజశ్రీ గానం : మనో, అనుపమ జూలై మాసం వస్తే తోడు చేరు వయసు సందెవేళ వస్తే పాట పాడు మనసు సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట జూలై మాసం...

శనివారం, ఏప్రిల్ 26, 2014

ఓ నేనే ఓ నువ్వని...

కలవరమాయే మదిలో సినిమాలో నాకు నచ్చిన ఒక మాంచి రొమాంటిక్ మెలొడీ... మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : కలవరమాయే మదిలో (2009)సంగీతం : శరత్ వసుదేవన్సాహిత్యం : వనమాలిగానం : హరిహరన్, కల్పనఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీనేనంటూ ఇక లేనని.. నీ వెంటే వున్నానని.. చాటనీచేశానే నీ స్నేహాన్ని.. పోల్చానే నా లోకాన్ని.. నీ వాణ్ణి ..ఓ నేనే ఓ నువ్వని.. ఒక తీరే మన ప్రేమని.. నీ గూటికే.. రానీమారాము చేసే మా రాణి...

శుక్రవారం, ఏప్రిల్ 25, 2014

జాబిలమ్మ నీకు అంత కోపమా

ఒకప్పుడు మంచి మెలోడీలు అందించిన ఎస్.ఎ.రాజ్కుమార్ గారి సంగీత సారధ్యంలో సిరివెన్నెల గారు రాసిన ఈ పాట చాలారోజుల పాటు ప్రేమికులకు ప్రేయసి అలక తీర్చడానికి ఉపయోగపడి ఉంటుందేమో ఆరోజుల్లో... మీరూ చూసీ వినీ ఎలా ఉందో చెప్పండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పెళ్ళి (1997) సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం : సిరివెన్నెల  గానం : బాలు   జాబిలమ్మ నీకు అంత కోపమా  జాజిపూల మీద...

గురువారం, ఏప్రిల్ 24, 2014

పాప ఈడు గోల..

చైతన్య సినిమాలోనిదే మరో మధురమైన పాట నాకు చాలా ఇష్టమైనది, ఇళయరాజా సంగీతం ఓలలాడిస్తే వేటూరి వారి సాహిత్యం అందమైన ప్రాసలతో చిత్రంగా మనసుకు హత్తుకుపోతుంది. నాగార్జునా గౌతమిల గురించి చెప్పేదేముంది. ఈ చక్కని పాటను మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : చైతన్య (1991)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరిగానం : బాలు, కోరస్ పాప ఈడు గోలా.. పాట పేరు జోలా..ఊగుతోంది బాల... యవ్వనాల డోలా...నీవు...

బుధవారం, ఏప్రిల్ 23, 2014

చక్కిలిగింతల రాగం...

ఈ సినిమా విడుదలైన రోజుల్లో ఈ పాటమొదట్లో వచ్చే ఈల తెగ ప్రాక్టీస్ చేసేసి నేర్చేసుకున్న జ్ఞాపకం నేటికీ ఓ అపురూపం. పాటంతా సింపుల్ గా చాలా చలాకీగా అదే సమయంలో మెలోడీ ఎక్కడా మిస్ అవకుండా అలవోకగా స్టైల్ గా సాగిపోతుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. బాలు చిత్ర గార్లు ఇద్దరూ చాలా బాగా పాడారు. ఈ పాట వీడియో చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఈ క్రింది ఎంబెడెడ్ వీడియోలో (మూడవ పాట) కానీ లేదా ఇక్కడ కానీ వినవచ్చు. చిత్రం : కొదమ సింహం (1990)సంగీతం...

మంగళవారం, ఏప్రిల్ 22, 2014

ఎంతో రసికుడు దేవుడు...

బాలు గారి ప్రైమ్ టైమ్ లో పాడిన సింపుల్ అండ్ స్వీట్ సాంగ్.. నాకు చాలా ఇష్టమైన పాట మీరూ విని ఆస్వాదించండి. ఎంబెడ్ చేసినది ఫోటోలతో చేసిన ప్రజంటేషన్.. ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : రాజా రమేష్ (1977) సంగీతం : కె.వి. మహదేవన్ సాహిత్యం : ఆత్రేయ  గానం : బాలు ఎంతో రసికుడు దేవుడు ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు అన్నిటిలో నిన్నే చూడమన్నాడు ఎంతో..ఓ.. రసికుడు దేవుడు ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు అన్నిటిలో...

సోమవారం, ఏప్రిల్ 21, 2014

ఒకే ఒక మాట...

ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే... ఈ పాటకి సంబంధించి ఒక్కటే లోటేమిటంటే ఇది చక్రి పాడటం.. మరెవరైనా గాయకుడు పాడుంటే ఈ పాట మరింత బాగుండేదేమో అనిపిస్తుంటుంది అపుడపుడు. మీరూ ఆస్వాదించండి ఈ సిరివెన్నెల ప్రేమ గీతాన్ని. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.  చిత్రం : చక్రం (2005)సంగీతం : చక్రిసాహిత్యం : సిరివెన్నెలగానం : చక్రిఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగాఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగానా పేరు నీ ప్రేమనీనా దారి నీ వలపనీనా చూపు నీ నవ్వనీనా...

ఆదివారం, ఏప్రిల్ 20, 2014

ఈనాడే ఏదో అయ్యిందీ...

ఇళయరాజా గారి మీద అభిమానం పదింతలు పెరగడానికి దోహదం చేసిన పాటలలో ఇదీ ఒకటి...రెండవ చరణానికి ముందు వచ్చే మ్యూజిక్ బిట్ ఎన్ని లక్షల సార్లు విన్నా బోరు కొట్టకపోగా అదే పులకింత కలుగుతుంది. ఈ సినిమాలో రేవతి కూడా చాలా బాగుంటుంది. మీరూ ఈ పాట విని చూసీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.  చిత్రం : ప్రేమ (1989)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరిగానం : బాలు, చిత్రఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓఈనాడే ఏదో అయ్యిందీ...ఏనాడూ...

శనివారం, ఏప్రిల్ 19, 2014

ఆకాశ గంగా...

వాన సినిమా కోసం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి. ఈ పాటలు విడుదలైన కొత్తలో ఈ పాట ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు. కార్తీక్ చాలా బాగా పాడాడు. ఈ అందమైన పాట మీరూ విని ఆస్వాదించండి. ఎంబెడ్ చేసిన వీడియో వాటర్ ఫాల్స్ తో చేసిన అద్భుతమైన ప్రజంటేషన్. ఈ పాట సినిమాలోని వీడియో చూడాలంటే ఇక్కడ చూడండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : వాన (2007) సంగీతం : కమలాకర్ సాహిత్యం : సిరివెన్నెల గానం...

శుక్రవారం, ఏప్రిల్ 18, 2014

క్షణం క్షణం నా మౌనం...

హిందీలో సూపర్ హిట్ అయిన "కహానీ" చిత్రానికి తెలుగు సేత "అనామిక" శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తయారవుతున్నదని అందరికి తెలిసిన విషయమే. ఆ చిత్రం కోసం సిరివెన్నెల గారు రాయగా కీరవాణి గారు స్వరపరచిన ఈ పాట నాకు నచ్చింది. సినిమాలోని పాటనే యథాతథంగా ఉపయోగిస్తూ గాయని సునీతతో సినిమాలోని సీన్స్ మిక్స్ చేసి చేసిన ప్రమోషనల్ మ్యూజిక్ వీడియో ఇది, మీరూ ఆస్వాదించండి.   చిత్రం : అనామిక (2014)సాహిత్యం : సిరివెన్నెలసంగీతం : కీరవాణిగానం : సునీత ఎవ్వరితో చెప్పనూ.....

గురువారం, ఏప్రిల్ 17, 2014

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే...

సిరివెన్నెల గారు రాసిన పాట గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి. ఈ చక్కని పాటను మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట కాస్త బెటర్ క్వాలిటీ ఇక్కడ చూడవచ్చు ఐతే ఇది కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే ప్లే అవుతుంది ఇతరులు కింది ఎంబెడ్ వీడియో చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : నువ్వేకావాలి(2000) సంగీతం : కోటి సాహిత్యం : సిరివెన్నెల గానం : శ్రీరామ్, గోపికా పూర్ణిమ ఎక్కడ ఉన్నా పక్కన...

బుధవారం, ఏప్రిల్ 16, 2014

భద్రుని చరితము...

హరికథా ప్రక్రియపై నాకున్న ప్రత్యేకాసక్తి మీకు తెలిసినదే కదా రామకథలతో వచ్చిన రెండు ముఖ్య హరికథలు (స్వాతిముత్యం, వాగ్దానం నుండి) ఇదివరకే ఈ బ్లాగ్ లో ప్రచురించడం జరిగింది. అందుకే ఈ ఏడాది అందాల రాముడు సినిమాకోసం అక్కినేని గారు కథకునిగా నటించిన ఈ భద్రుని చరితము హరికథని మీకోసమ్ అందిస్తున్నాను. ఈ హరికథ వినడంకన్నా వీడియో చూడడం నాకు ఎక్కువ ఇష్టం ఎందుకంటే చక్కగా బాపు గారి బొమ్మలతో భద్రుని కథని మనం చూడవచ్చు. నాగేశ్వరరావు గారు కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.