గురువారం, ఆగస్టు 22, 2013

ఏనాడు విడిపోని ముడివేసెనే..

కొన్ని పాటలు చూడడానికన్నా ముందే బాగా వినడానికి అలవాటుపడిపోతాము దాంతో ఆ పాట గురించి మన మనసులో ఒక ఊహా చిత్రం ఏర్పడిపోతుంది. ఈ పాట గురించి కూడా నాకు అలాంటి ఒక అందమైన ఊహా చిత్రమే మనసులో ముద్రించుకుపోయింది. చిన్నపుడు సినిమా మొదటిసారి చూసినపుడు ఈ పాట గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ తరువాత తరువాత ఈపాట వినేకొద్ది చాలా నచ్చేసింది అలాగే తెరమీద అప్పుడేం చూశానో గుర్తులేకుండా నా ఊహలు మాత్రమే మిగిలిపోయాయి.  ఇంత ఉపోధ్ఘాతమెందుకు చెప్పానంటే ఈ పాట...

బుధవారం, ఆగస్టు 21, 2013

వెన్నెలై పాడనా...

వంశీ,ఇళయరాజా ల కాంబినేషన్లో చాలా మంచి పాటలున్నాయన్న విషయం మనకి తెలిసిందే వాటిల్లో ఓ ఆణిముత్యం లాంటి పాట ఇపుడు మీకు పరిచయం చేయబోతున్నాను. “శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్” సినిమా పేరు వింటేనే నేను ఒక చిత్రమైన అనుభూతికి లోనవుతాను. తొంభైల తర్వాత అశ్లీలత పాళ్లు హెచ్చడంతో క్రమంగా కనుమరుగైన ఈ రికార్డింగ్ డాన్సులు ఒక కళారూపం అని కూడా చెప్పుకోవచ్చేమో. యూట్యూబ్ లు టీవీలూ వీడియోలు లేని ఆకాలంలో సినిమా హీరో హీరోయిన్స్ గెటప్పూ, మానరిజమ్స్ తో సహా...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.