మంగళవారం, జనవరి 24, 2012

సూరట్టుకు జారతాదీ..

గతేడాది నిర్ధాక్షిణ్యంగా తీసుకువెళ్ళిపోయిన సినీప్రముఖుల్లో ఒకరైన జాలాది గారు సినిమాలకు రాసిన మొదటి పాటగా చెప్పబడే ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. అసలు ఆహ్లాదకరమైన పల్లె వాతావారణంలో ఎపుడు  వర్షాన్ని చూసినా ఈ పాటే గుర్తొస్తుంటుంది. జాలాదిగారు వాడిన చక్కనైన పల్లె పదాలు మహదేవన్ గారి హుషారైన సంగీతంలో, సుశీలమ్మ స్వరంలో వింటూంటే మనపైన మత్తుజల్లినట్లు గమ్మత్తైన అనుభూతికి లోనవుతాం. ఈ సినిమాలో రంగనాథ్ జయసుధ నటించారని విన్నాను కానీ ఈ వీడియో ఎపుడూ చూసే అవకాశం...

మంగళవారం, జనవరి 17, 2012

స్నేహమా.. స్వర విలాసమా..

ఈ పాటలు అన్నిటికీ సాహిత్యం యూనీకోడీకరించి బ్లాగ్ లో పెట్టుకుందామనుకుంటున్న దగ్గరనుండీ నన్ను బాగా భయపెట్టిన పాట ఈ పాట. భయపడినట్లుగానే చరణం ముందు వచ్చే స్వరములు గ్రహించి టైప్ చేయడం ఎంత ప్రయత్నించినా నా వల్లకాలేదు సరిగా రావడంలేదు తప్పులు తడకలు ఎందుకు ఇవ్వడం అని వాటిని వదిలేశాను. అవి పక్కనపెట్టినా చరణం చివరలో గుక్కతిప్పుకోకుండా పాడిన రెండులైన్లే గ్రహించి టైప్ చేయడానికి నాలుగైదు సార్లు వినాల్సి వచ్చింది. ఎక్కడైనా తప్పులు ఉంటే కామెంట్స్ లో తెలియ చేయవలసిందిగా...

సోమవారం, జనవరి 16, 2012

తెలియలేదురా.. తెలియలేదురా..

శ్రీకృష్ణ పాడిన ఈ పాట కూడా బాగుంది, ఇది విషాద గీతం. తరచుగా వినే శ్లోకాల మధ్య అంతయూ నిజమూ అంతమూ నిజమూ, మాయ మాయగా మాయమౌనని వంటి పంక్తులు ఆకట్టుకుంటాయి. ఈ పాటకు రచన మరియూ సంగీతం స్వరవీణాపాణి, ఈ పాట ఇక్కడ వినండి.    చిత్రం: దేవస్థానం సంగీతం : స్వరవీణాపాణి సాహిత్యం : స్వరవీణాపాణి గానం : శ్రీకృష్ణ, కౌడిన్య, సాయివీణ, ప్రణవి, సాయికీర్తన తెలియలేదురా.. తెలియలేదురా.. సర్వమంగళ మాంగళ్యే.. శివే సర్వార్థ సాధికే. శరణ్యే త్ర్యంబకే దేవీ.....

ఆదివారం, జనవరి 15, 2012

గణనాథా సేవించెదమయ్యరో (హరికథ)

దేవస్థానం సినిమాలోని మరో హరికథ ఇది. కథ లోనే చెప్పినట్లు ఇది హరికథ, అంటే కేవలం శ్రీహరిని స్తుతించేది మాత్రమే కాదు మన కష్టాలనూ బాధలనూ హరించే తరుణోపాయం చెప్పే కథా అని మనం అర్ధం చేసుకోవాలి. ప్రస్తుత జనరేషన్ కి చాలా ఆవశ్యకమైన సలహాలను ఇస్తూ మాదకద్రవ్యాలకు అలవాటుకాకుండా ఎలా నిగ్రహించుకోవాలీ పెరుగుతున్న టెక్నాలజీ వెసులుబాట్లను ఎలా సమర్ధవంతంగా ఉపయోగించాలో తెలియజేస్తూ సాగే ఈ కథను స్వరవీణాపాణి రచించి స్వరపరిస్తే బాలుగారు ఆలపించారు. మీరూ ఇక్కడ విని ఆనందించండి. మిత్రులందరికీ...

శనివారం, జనవరి 14, 2012

గుణనుతి చేతును (హరికథ)

ఇది హరికథ కాదు అంటే హరిని గురించిన కథకాదు.. హరికథా ప్రక్రియను ఉపయోగించుకుని సామాజిక చైతన్యాన్ని ఉద్భోదిస్తూ కులమతవర్ణ వివక్షను వీడి వసుధైక కుటుంబంలా కలసి మెలసి జీవించమని చెప్పిన హాయైన కథ. సాథారణంగా ఇలాంటి సాంఘీక కథలు/సందేశాలూ హరికథా ప్రక్రియలో ఇమడ్చడానికి ప్రయత్నించినా అంతగా ఆకట్టుకోలేవు కానీ ఈ కథ మాత్రం ప్రత్యేకం. దండిభట్ల నారాయణమూర్తి గారు చక్కని తేటతెలుగు పదకట్టుతో రాస్తే బాలూ తన స్పష్టమైన ఉచ్చారణతో ఆసాంతం కదలకుండా వినేలా చేస్తాడు. మీరూ ఇక్కడ విని ఆస్వాదించండి.  చిత్రం : దేవస్థానం సాహిత్యం : దండిభట్లనారాయణమూర్తి సంగీతం : స్వరవీణాపాణి గానం : SP బాలు గుణనుతి చేతును గణనాథా.. ప్రణతులు చేకొను ఘనవరదా.. అవరోధ శతమునణచు సదా అరింద్య...

శుక్రవారం, జనవరి 13, 2012

దేవస్థానం.. దేవస్థానం..

ఈ పాటలు నాకు వినేకొద్దీ మరీ మరీ నచ్చుతున్నాయ్.. అసలు నేను వింటున్నది కొత్త సినిమా పాటలేనా అనిపిస్తుంది.  ఏడాదికో ఆల్బం ఇలాంటిది వచ్చినా మనసుకు హాయిగా అనిపిస్తుందేమో. ఈ రోజు పరిచయం చేయనున్నపాట బాలు పాడిన దేవస్థానం అన్న టైటిల్ సాంగ్. బాలుగారికి ఇలాంటి పాట ఇస్తే ఎంత బాగా పాడేస్తారో తెలిసిందే కదా పైస్థాయిలో చాలా చక్కగా పాడారు దేవస్థానం అన్న ఒక్కమాటని ఆయన ఒకోసారి ఒకోవిధంగా పలకడం చాలాబాగుంటుంది. దేవస్థానం గొప్పతనాన్ని వివరిస్తూ స్వరవీణాపాణి గారు రాసిన సాహిత్యం కూడా చాలా బాగుంది. పల్లవి మూడుసార్లు రిపీట్ అయినపుడు దేవస్థానంతో ప్రాస కుదిరేలా భక్తిస్థానం.. శక్తిస్థానం.. లాంటి పదాలు వాడి రాసిన మూడులైన్లు కూడా చాలానచ్చాయి. చరణాలు కూడా చాలా...

గురువారం, జనవరి 12, 2012

సాంబయ్యా సోమయ్యా లింగయ్యా మహాశివా..

ఈ వయసులో విశ్వనాథ్ గారిని బాలూనీ ఇంతగా కష్టపెట్టడం భావ్యమా అని ఒక నిముషం అనిపిస్తుంది కానీ పాట చిత్రీకరణ చూస్తుంటే అవసరమేలే అనిపిస్తుంది. ఆ పరమశివుణ్ణీ అంతటి సమానమైన తన పెద్దదిక్కునీ ఇద్దరినీ గురించి ఒకేసారి చెప్తూ పాడిన ఈ పాట ఒక రెండు సార్లు విన్నాక పల్లవిలోని మొదటి లైన్ హమ్ చేయకుండా ఉండటం దదాపు అసాధ్యం. అంతబాగుంటుంది ఈ పాట. ఆడియో ఇక్కడ వినవచ్చు. చిత్రం : దేవస్థానంసాహిత్యం : స్వరవీణాపాణిసంగీతం : స్వరవీణాపాణిగానం : చిత్ర, బాలుఅన్యధా శరణం నాస్తి.. త్వమేవ శరణం మమతస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో మహేశ్వరా.. సాంబయ్యా సోమయ్యా లింగయ్యా మహాశివా.. సాంబయ్యా సోమయ్యా లింగయ్యా మహాశివా.. నువ్వెక్కడుంటే నేనక్కడుంట నా వంక చూస్తావా..నువ్వెక్కబోతే నే...

బుధవారం, జనవరి 11, 2012

పలుకు తెలుపు తల్లివే..

జనార్ధన మహర్షి దర్శకత్వంలో బాలు, విశ్వనాథ్, ఆమని కలిసి నటించిన నూతన చిత్రం దేవస్థానం. పలు కమర్షియల్ సినిమాల నడుమ మొన్న డిశంబర్ పదహారున ఈ సినిమా పాటలు విడుదలైనా నా దృష్టికి కాస్త ఆలశ్యంగా వచ్చాయనే చెప్పాలి. కానీ విన్న వెంటనే దదాపు అన్ని పాటలు అమితంగా నచ్చేశాయి. సంక్రాంతి సంధర్భంగా ఈరోజునుండి ఓ వారంపాటు సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేస్తూ స్వరవీణాపాణి రచించి స్వరపరిచిన ఈ సినిమా పాటల సాహిత్యాన్ని రోజుకొకటి చొప్పున ఈ బ్లాగులో అందిస్తాను. ఈ ఆల్బంలో మొదటి పాట చిత్రగారు పాడిన “పలుకు తెలుపు తల్లివే” అన్నపాట. సరస్వతీ దేవి ప్రార్ధనలా అనిపించే ఈ గీతాన్ని స్వరవీణాపాణి స్వయంగా రాసి స్వరపరిచారు. వినగానే ఆకట్టుకునే పాట చిత్ర గారి స్వరంలో మరింత నచ్చేస్తుంది...

మంగళవారం, జనవరి 10, 2012

హరివరాసనం విశ్వమోహనం

తన గళంలోని అమృతాన్ని మన గుండెలోకి నేరుగా ఒలికించే మధుర గాయకుడు శ్రీ కె.జె.ఏసుదాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. నాకెంతో ఇష్టమైన వారి పాట మీ అందరికోసం. వీడియో క్వాలిటీకి మన్నించండి ఒరిజినల్ వర్షన్ అందించాలని ఇది ఇస్తున్నాను. ఆడియో ఇక్కడ వినండి. చిత్రం : స్వామి అయ్యప్పన్(1975)  సంగీతం : జి.దేవరాజన్ గానం : ఏసుదాస్ హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకంఅరివిమర్ధనం నిత్య నర్తనంహరిహరాత్మజం దేవమాశ్రయేశరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్పశరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్పశరణ కీర్తనం భక్తమానసంభరణ లోలుపం నర్తనాలసంఅరుణభాసురం భూతనాయకంహరిహరాత్మజం దేవమాశ్రయేశరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప  కళమృదుస్మితం...

శుక్రవారం, జనవరి 06, 2012

తెల్లారింది లెగండో..

సిరివెన్నెల గారు పాడిన అతి కొన్ని పాటలలో ఇది ఒకటి నాకు చాలా ఇష్టమైన పాట. కళ్ళు అనే సినిమాలోనిది, నలుగురు గుడ్డివాళ్ల గురించి సినిమా అని తప్ప ఈ సినిమా గురించి నాకు ఇంకే వివరాలు గుర్తులేవు. పాట మాత్రం చాలా బాగుంటుంది రచయితే పాడటం వలననేమో కొన్ని పదాల పలుకు విరుపు యాస అంతా చక్కగా స్పష్టంగా ఉండి ఆకట్టుకుంటుంది. చమటబొట్టు చమురుతో సూరీణ్ణి వెలిగిద్దాం.. వేకువ శక్తుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు చేసి లాంటి లైన్స్ చాలా బాగుంటాయి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు. వీడియో దొరకలేదు కేవలం ఆడియో మాత్రం ఉన్న వీడియో లింక్ ఇక్కడ.  చిత్రం : కళ్ళు (1988)సంగీతం : SPBసాహిత్యం : సిరివెన్నెలగానం : సిరివెన్నెలతెల్లారింది లెగండో... కొక్కొరోక్కో...తెల్లారింది...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.