దేవర్ మగన్ అనే తమిళ చిత్రానికి అనువాద చిత్రమైన క్షత్రియపుత్రుడు తెలుగులో హిట్ కాలేదు కానీ పూర్తి తమిళ వాతావరణం ఇబ్బంది పెట్టనటువంటి వారికి ఈ సినిమా పర్లేదు ఒకసారి చూడచ్చు అనిపిస్తుంది. నాకు శివాజీ గణేషన్, కమల్, రేవతి, నాజర్, గౌతమిల నటన చూడటానికైనా ఒకసారి చూసి తీరవలసిందే అనిపించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ రెండు పాటలు నాకు చాలా ఇష్టం.
“సన్నజాజి పడక” పాటలో జానకి బాలు ఇద్దరూ కలిసి ఆటలాడుకున్నట్లుగా పాడారు. పాట మొదట్లో జానకి గారు నోటితో వేసే మ్యూజిక్.. ఎందుకే.. అన్న చోట తను రాగంతీసినపద్దతితో ఆకట్టుకుంటే.. బాలుగారు కూడా నేనేం తక్కువతిన్నానా అంటూ అవకాశమొచ్చినపుడల్లా అల్లరి చేసేరు. ఇక “మురిసే పండగపూట” లో మాధవపెద్ది రమేష్ గారి...