రావుగోపాల్రావు గారి గురించి నేను ఇపుడు ప్రత్యేకంగా చెప్పగలిగేది ఏమీ లేదు భీకరమైన రూపం లేకున్నా ఆహర్యం, డైలాగ్ డెలివరీతో ప్రతినాయక పాత్రకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారాయన. ముత్యాలముగ్గు సినిమాలో సెగట్రీ అంటూ పరమ కిరాతకమైన డైలాగ్ సైతం నిమ్మళంగా చెప్పి వెన్నులో వణుకు పుట్టించినా, వేటగాడు లో ప్రాసల పరోఠాలు తినిపించినా ఆయనకే చెల్లింది. ఆ ప్రాసలు ఇదిగో ఇక్కడ చూడండి.ఈ విలనిజం ఒక ఎత్తైతే నాకు ఆయన మంచివాడుగా చేసిన సాధారణమైన, హాస్య పాత్రలు కూడా చాలా నచ్చుతాయి. వాటిలో ఈ మాలీష్ పాత్ర ఒకటి. మల్లెపువ్వు చిత్రం లో గురువా అంటూ శోభన్‍బాబుకు సాయం చేసే ఓ మాలిష్ చేసుకునే మంచివాడి పాత్రలో అలరిస్తారు. ఆ పాత్రలో తన పై చిత్రీకరించిన ఈ పాట నా చిన్నపుడు నాకు నచ్చే హాస్యగీతాలలో...