ఒకప్పుడు శ్రీశ్రీ గారు చాలా డబ్బింగ్ పాటలు రాశారు అని ఆయన శ్రీమతి గారు రాసిన పుస్తకం లో చదివిన గుర్తే కానీ నాకు ఊహ తెలిసినంత వరకూ డబ్బింగ్ పాటల రచయిత అంటే రాజశ్రీ గారే.. రహ్మాన్ సంగీత దర్శకత్వం మొదలు పెట్టిన మొదటి లో స్వర పరచిన ఈ పద్మవ్యూహం సినిమా పాటలు చాలా బాగుంటాయ్. వాటిలో "కన్నులకు చూపందం" "నిన్న ఈ కలవరింత" మరింత ప్రత్యేకం. పాట చూస్తున్నపుడు లిప్ సింక్ లో తేడాలు, డబ్బింగ్ పాటలలో ఉండే చిన్న చిన్న భాషా దోషాలు ఉన్నాకూడా కమ్మనైన సంగీతం వాటిని సులువుగా క్షమించ గలిగే లా చేస్తుంది. కన్నులకు చూపందం పాట సాహిత్యం కూడా చాలా బాగుంటుంది. ఇక రేవతి "ప్రేమ" సినిమా తో పోలిస్తే ఈ సినిమా సమయానికి కాస్త వయసుమీద పడినట్లు అనిపించినా అందంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా...