ముందుగా తన టపా ద్వారా ఈ పాటను పరిచయం చేసిన సిరిసిరిమువ్వ గారికి నెనర్లు. ఆపై ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే నాదవినోదిని గురించి చెప్పి పాలగుమ్మి వారి ఫోన్ నంబరు ఇచ్చిన సి.బి.రావు గారికి నెనర్లు. నేను ఇండియా వెళ్ళినప్పుడు పాలగుమ్మి వారితో మాట్లాడి నాదవినోదిని నాగరాజు గారి నంబరు తీసుకుని, సరిగ్గా వచ్చే ముందు రోజు అప్పటికే 36 గంటలు గా స్వల్ప విరామం తో చేసిన ప్రయాణాన్ని లెక్క చెయ్యకుండా... మరుసటి రోజు అమెరికాకు చేయాల్సిన 20 గంటల ప్రయాణాన్ని కూడా మరచి బాగ్‌లింగంపల్లి లో నాగరాజు గారి ఇల్లు వెతికి పట్టుకుని ఈ కేసేట్ సంపాదించాను.కానీ ఇంతా శ్రమపడి "తాళం వేసితిని కానీ గొళ్ళెం మరిచితిని" అన్న చందాన కేసెట్ సంపాదించాను కానీ నా దగ్గర ప్లేయర్ లేదన్న విషయం విస్మరించాను....