శుక్రవారం, మార్చి 23, 2018

నెమలి కన్నుల కలయా...

కీరవాణి గారు స్వరపరచిన దేవరాగం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవరాగం (1996)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఎం.ఎం.శ్రీలేఖ

యా యా యా యా
నెమలి కన్నుల కలయా
యా యా యా యా
మురళిమోహన కళయా
చిలిపిగా ఓలమ్మో ఏదో తాళం
కడవలో పాలన్నీ తోడే రాగం
తన్నా... తన్నా...
జతై కలిసిన లయా కౌగిళ్ల నిలయా
కవ్వించుకోవయ్యా

యా యా యా యా
నెమలి కన్నుల కలయా
యా యా యా యా
మురళిమోహన కళయా

నీ లీలలే నా డోలలై
వేడి ఈల వేసే వేణుగానమల్లే
వాలు సందెవేళ చందనాలు చల్లే
మోమాటమే పెపైదవిలో
తేనెటీగలొచ్చి కుట్టినట్టు గిల్లే
లేత చెక్కిలింక ఎర్రముగ్గు చల్లే
గోపిక మనువాడే గోవుల కన్నుల్లో
వెన్నెల తెరవేసే పొన్నల నీడల్లో
విరిసిన పూలే జల్లి దీవుల్లోన
తడిపొడి తానాలాడించే
ప్రియా చిలికిన దయా
చిలిపి హృదయా కౌగిళ్ల నిలయా

యా యా యా యా
నెమలి కన్నుల కలయా
యా యా యా యా
మురళిమోహన కళయా

ఈనాటిదా ఈ సంగమం
చూసీ చూడలేని
చూపులమ్మ చుంబనం
కంటిరెప్ప చాటు రేతిరమ్మ శోభనం
నీ మాటలే సయ్యాటలై
కొల్లగొట్టనేల కోకమాటు వగలే
కన్నుకొట్టనేల కాముడల్లే పగలే ఆ..
యదుకుల గోపెమ్మ ఆ..
ముసిముసి మురిపాలు ఆ..
యమునల వరదమ్మా ఆ..
అడిగెను రాధమ్మ ఆ..
అతి సుఖ రాగాలెన్నో ఆలపించే
సాయంత్రాల నీడల్లో జతై
కలిసిన లయా కౌగిళ్ల నిలయా
కవ్వించుకోవయ్యా

యా యా యా యా
నెమలి కన్నుల కలయా
యా యా యా యా
మురళిమోహన కళయా

 

2 comments:

చిన్నప్పుడు పురి విప్పి ఆడేది ఆడ నెమలి అనుకునే దాన్ని చాలా కాలం..అందమైన కలలానే వచ్చి వెళ్ళిపోయింది కదండీ..

అవును శాంతి గారు అందమైన కాలలానే వచ్చి వెళ్ళిపోయింది తను.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.