
ఈ సినిమా నేను అంతగా ఊహతెలియని వయసులో మొదటి సారి చూశాను అప్పట్లో శీనూ విజ్జీకి కథ చెప్పే సన్నివేశంలో వచ్చే భోజరాజు పాట ఒక్కటే నచ్చేది. కొంతకాలం తర్వాత విన్నపుడు ఈ కథగా కల్పనగా పాట మనసుకు హత్తుకుపోయింది. పాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ బిట్ చాలా బాగుంటుంది. ఇళయరాజా గారి సంగీతం అలా స్మూత్ గా సాగుతూ మనసుకు జోలపాడేస్తుంది. బాలూ మహేంద్ర క్లాసిక్ ఈ సినిమా. ఈ పాట సినిమా థీంని చెప్పేస్తుంది. సినిమా చివర్లో వచ్చే విషాదచరణంలో చెప్పినట్లు కొందరు కొందరి జీవితాల్లోకి...