
ఈ రోజుల్లో తొమ్మిదిన్నర నిముషాల పాట ఎవరు చూస్తారంటూ అందరూ డిస్కరేజ్ చేయడంతో తాను ఈ పాటని పూర్తిగా ఒకే చోట ఉపయోగించలేకపోయానని క్రిష్ బాధపడినా కూడా గతేడాది జరిగిన కొన్ని అద్భుతాలలో ఒకటైన ఈపాటని సినిమాలో సరిగా చిత్రీకరించనందుకు తనని నేను ఎప్పటికీ క్షమించలేను. సిరివెన్నెల గారు దశావతారాల గురించి రాసిన ఈ పాట బాల సుబ్రహ్మణ్యం గారు పాడటంతో ఖచ్చితంగా మరింత ఆకట్టుకుందనడంలో ఏ సందేహం లేదు. మణిశర్మ ప్రేరణ పొందిన సంగీతం ఉపయోగించినా అది పాటకు బహుచక్కగా అమరింది....