
సుశీలమ్మ స్వరంలోని స్పష్టత నాకు చాలా ఇష్టం, స్పష్టత అనేదానికి సంగీతపరంగా మరో టెక్నికల్ పదముందో లేదో నాకు తెలియదు కానీ తను పాడిన చాలా పాతపాటలలో తనగళం సరైన పిచ్ లో చాలా క్లియర్ గా వినిపిస్తుంటుంది. అలాంటి పాటలలో రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఈ “స్వరములు ఏడైనా” పాట నేను తరచుగా వినే సుశీలమ్మ పాటలలో ఒకటి. సినారె గారు సాహిత్యమందించిన ఈ పాటలోని చివరి చరణం నాకు చాలా ఇష్టం. ఈ పాట వీడియో దొరకలేదు చిమట మ్యూజిక్ లో ఇక్కడ వినవచ్చు. అది ఓపెన్ అవలేదంటే ఇక్కడ డౌన్లోడ్...