
తను నవ్వుతో చంపేస్తుంది/చంపేస్తాడు అని మీరు చాలా సార్లు వినే ఉంటారు కదా, ఎక్కడో తారసపడిన నవ్వును చూసి కూడా అనుకుని ఉండచ్చు "హబ్బా కిల్లింగ్ స్మైల్ రా బాబు" అని. అలాంటి నవ్వు వినాలనుకుంటున్నారా ఐతే బాలు తన కెరీర్ కొత్తలో (1977) పాడిన ఈ పాట వినండి. తన స్వరం ఎంత లేతగా స్వచ్చంగా హాయిగా ఉంటుందో పాటలో అక్కడక్కడ వచ్చే నవ్వు అంతే బాగుంటుంది. "చిలకమ్మ చెప్పింది" సినిమాలోని ఈ పాటలో అంత చక్కని బాలు స్వరానికి తగినట్లుగా నటించినది రజనీకాంత్, ఇక పాట చూసిన...