సగటు వీరాభిమానిగా మా బాలసుబ్రహ్మణ్యం ముసలివాడైనా ఆయన గొంతు మారలేదు అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది లాంటి కబుర్లు నేను చెప్పను. వయసుతో పాటు ఆయన గొంతు కూడా మారింది కొన్నిపాటలు లేత గొంతుతో ఒకింత మిమిక్రీని మేళవించి పాడటం బాగుంటే మరికొన్ని పాటలకు ఇప్పుడు ఆయనపాడుతున్న గొంతు అయితేనే బాగా సూటవుతుంది. ఏదైనాకానీ ఎనభైలలో.. బాలు కెరీర్ కొత్తలో తను పాడినపాటలలో తన గొంతు లేతగా చాలా గమ్మత్తుగా ఉంటుంది. సత్యం, రమేష్ నాయుడు గారు వంటి అనాటి సంగీత దర్శకుల వలనకూడా అయి ఉండచ్చు నాకు ఆగొంతు ప్లస్ అప్పట్లో పాడిన పాటలు చాలా ఇష్టం.
వాటిలో ఒకటి ఈ ఇదే నామొదటి ప్రేమలేఖ పాట.. అప్పట్లో ఈ పాట రేడియోలో వస్తుంటే స్టేషన్ మార్చే ప్రసక్తేలేదు. ఈ పాటలో సంగీత సాహిత్యాలను పట్టించుకోకుండా...