సోమవారం, జనవరి 24, 2011

విరామం

నా బ్లాగులకు కొంతకాలం విరామం ప్రకటిస్తున్నాను. నా ఙ్ఞాపకాలు, అనుభూతులు, అనుభవాలు, ఆలోచనలు మళ్ళీ మీ అందరితో పంచుకోవాలని అనిపించినపుడు మళ్ళీ వస్తాను. అంతవరకూ శల...

సోమవారం, జనవరి 17, 2011

నా నెచ్చెలీ.. నా నెచ్చెలీ - డ్యుయెట్

డ్యుయెట్ రహ్మాన్ పాటలలో గుర్తుంచుకోదగిన ఆల్బం. సినిమా ఫ్లాప్ అవడం వలన అంజలీ అంజలీ పాట తప్ప మిగిలిన పాటలు అంత ప్రాచుర్యాన్ని పొందలేదు కానీ ఇంకా రెండు మూడు పాటలు బాగుంటాయ్. వాటిలో నాకు బాగా నచ్చిన పాట ఈ "నా నెచ్చెలీ.." పాట. Sax ని ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుని రహ్మాన్ పాటకు మంచి ఫీల్ తెచ్చాడు. సినిమా చూశాక కొన్నాళ్ళు ఎలాగైనా Sax నేర్చుకోవాలని కలలు కన్నాను :-) ఇక పాటలో బాలు గారి స్వరవిన్యాసం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వెన్నెలకంటి గారి సాహిత్యంకూడా బాగుంటుంది. ఈ పాట మ్యూజిక్ మజా ప్లగిన్ లో వినవచ్చు.     <p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Duet.html?e">Listen...

శనివారం, జనవరి 15, 2011

Elvis - You were always on my mind

ఈపాట ఇదివరకు మీరు వినే ఉంటారు .. సాధారణంగా ప్రేమికుడు భర్తయ్యాక భాగస్వామి వద్ద తన ప్రేమను చూపించడంలో ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూనే నేనేం చేస్తున్నా నీ గురించే ఆలోచిస్తున్నాను కానీ ఆ విషయం నీకు చెప్పలేకపోయాను నాకు మరో ఛన్స్ ఇవ్వమంటూ అడిగే అందమైన ఈ పాటతో ఈ సిరీస్ ప్రస్తుతానికి ముగిస్తున్నాను. పాట సాహిత్యాన్ని చదువుతూ వినండి.  Maybe I didn't love you quite as good as I should have, Maybe I didn't hold you quite as often as I could have, Little things I should have said and done, I just never took the time.You were always on my mind, You were always on my mind.Maybe I didn't hold you all those lonely, lonely times, And I guess...

శుక్రవారం, జనవరి 14, 2011

Elvis - Let me be Your teddy bear

ఈ పాటలో గిటార్ మీద డ్రమ్స్ లా దరువేస్తూ కులుకుతూ ఇచ్చే చిన్ని చిన్న డాన్స్ మూవ్మెంట్స్ చాలా సరదాగా ఉంటాయి. ఈ పాట పాడే విధానం కూడా అల్లరిగా సరదాగా ఉంటుంది. Baby let me be, Your lovin' Teddy Bear Put a chain around my neck, And lead me anywhere Oh let me be Your teddy bear. I don't wanna be a tiger Cause tigers play too rough I don't wanna be a lion 'Cause lions ain't the kind You love enough. Just wanna be, your Teddy Bear Put a chain around my neck And lead me anywhere Oh let me be Your teddy be...

గురువారం, జనవరి 13, 2011

Elvis - Devil in Disguise

ప్రేయసిని నువ్వు దేవతలా కనిపిస్తున్నావంటూ పొగుడుతూ మొదలయ్యే ఈ పాట అంతలోనే తెలివితెచ్చుకుని తన నిజస్వరూపాన్ని గ్రహించానంటూ తన ప్రియురాలు నిజ స్వరూపాన్ని కనపడనివ్వకుండా దాచి అందమైన ముసుగు వేసుకుని మోసం చేసిందంటూ సాగే ఈ పాట నాకు నచ్చిన మరో పాట.. ఎల్విస్ పాడిన విధానం నాకు బాగా నచ్చుతుంది ఈ పాటలో.   You look like an angel Walk like an angel Talk like an angel But I got wise You're the devil in disguise Oh yes you are The devil in disguise You fooled me with your kisses You cheated and you schemed Heaven knows how you lied to me You're not the way you seemed You look like an angel Walk like an angel Talk like an angel But I got wise You're...

బుధవారం, జనవరి 12, 2011

Elvis - In the Ghetto

యువతీయువకుల మధ్య పుట్టే ప్రేమ మీద ఎక్కువ పాటలు పాడిన ఎల్విస్ లోని అసలైన ప్రేమని చూపెడుతుంది ఈ “In the Ghetto” పాట. "The Vicious Circle" అనే పేరుతో Mac Davis రాసిన ఈ పాట లోని సాహిత్యం నన్ను కట్టిపడేస్తుంది. చికాగోలోని Ghetto అంటే స్లం లో ఒక చిన్నారి పుట్టుకతో మొదలైన పాట అతనికి సహాయం చేసే చేయి లేకపోవడం వలన ఆకలికి తాళలేక అతను దొంగతనాలు హత్యలు లాంటి నేరాలవైపు ఆకర్షితుడై చివరికి అందులోనే చనిపోయాడనీ.. అదే సమయానికి ఆ Ghetto లో మరో చిన్నారి పుట్టాడనీ.. అతని జీవితం కూడా ఇంతే ఉండబోతుందని సూచిస్తూ ముగుస్తుంది. హృదయాలను కదిలించే పాట... ఎల్విస్ గొంతులో ప్రాణం పోసుకున్నపాట.. విన్నవెంటనే అలాంటి నిస్సహాయులకు సాయం చేయాలనిపించే పాట... మీరూ వినండి. As the...

మంగళవారం, జనవరి 11, 2011

Elvis - I am in Love

నేను మొదట విన్న ఈ పైవీడీయో లోని పాట “I am in love.. I’m all shook up” విన్నాక మనం కూడా ఆ పాటను ఉద్దేశించి ఇంకా ఎల్విస్ ను ఉద్దేశించీ “I am in love.. I’m all shook up” అని పాడుకుంటాం అనడంలో ఏ సందేహమూ లేదు. పల్లవి చివర్లో వచ్చే హమ్మింగ్ నాకు చాలా ఇష్టం పాట విన్నవెంటనే నా హాట్ ఫేవరెట్ అవడానికి అదే ముఖ్య కారణం. ఇక వీడియో లో కూర్చిన ఎల్విస్ చిత్రాలు అధ్బుతంగా ఉండి “he is something” అనిపిస్తాయి అందుకు కూడా ఈ వీడియో అంటే నాకు చాలా ఇష్టం. A well I bless my soul What's wrong with me? I'm itching like a man on a fuzzy tree My friends say I'm actin' queer as a bug I'm in love I'm all shook up Mm mm oh, oh, yeah, yeah! My hands are shaky...

సోమవారం, జనవరి 10, 2011

Elvis - Jail House Rock

ఎలాంటి మూడ్ లో ఉన్నా నిముషం లొ సెట్ చేసే ఈ జైల్ హౌస్ రాక్ సాంగ్ నాకు బాగా నచ్చిన ఎల్విస్ పాటలలో మరొకటి. మన షమ్మీకపూర్ స్టెప్స్ అన్నీ ఇందులో చూడవచ్చు... ఈ పాటలో ఎల్విస్ ఎనర్జీ ఇంకా కదలికలు ఇప్పుడు కూడా వావ్ అనిపిస్తాయ్ అప్పట్లో ఇక ప్రజలు వెర్రెత్తి పోయి ఫాన్స్ అవడంలో పెద్దగా ఆశ్చర్యమేం లేదు :-) Normal 0 false false false EN-IN X-NONE KN MicrosoftInternetExplorer4 ...

ఆదివారం, జనవరి 09, 2011

ఏల్విస్ - Fools Rush in.

ఈపాట కూడా మొదటి సారి నేను ఒక సినిమాలోనే విన్నాను.. ఆ సినిమా పేరు కూడా ఫూల్స్ రష్ ఇన్.. Salma Hayek కనిపించేసరికి టివి ఛానల్ మార్చాలనిపించక సినిమా మొత్తం చూసేశాను :-) డీసెంట్ లవ్ స్టోరీ దాని ట్యాగ్ లైన్ “What if finding the love of your life meant changing the life that you loved?” ఇంకా మోస్ట్ ఫేమస్ సీన్ ఒకేసారి రెండు చోట్ల ఉండాలని ఉందన్న ప్రేయసిని హూవర్ డ్యామ్ పైకి తీసుకువెళ్ళి అరిజోనా, నెవడా రెండు రాష్ట్రాలలోనూ ఒకేసారి ఉన్నావని చూపించే ప్రేమికుని సీన్ కూడా ఈ సినిమాలోనిదే. ఈ పాటలోని అందమైన లిరిక్స్ కి ఎల్విస్ స్వర మాయాజాలం తోడై పాట అలా మన మనసులో నిలిచిపోతుంది.        Wise Men sayonly fools rush inbut I...

సోమవారం, జనవరి 03, 2011

పూచే పూలలోనా - గీత (1973)

ఎవడండీ వీడు కొత్త సంవత్సరం మొదలే ఇంత విషాద గీతాన్ని పరిచయం చేస్తున్నాడు అని కోప్పడకండి. విధికి పాతా కొత్తా పండగా పబ్బమా ఏమీ తెలియదు నిశ్శబ్దంగా కదిలే కాలంతోపాటు సాగుతూ అదను చూసి గాయం చేసి ముందుకు వెళ్ళిపోతుంది. ఆ గాయానికి ఇలాంటి మధుర గేయాల లేపనంపూస్తూ మంచి రోజులకోసం ఎదురుచూడటం తప్ప ఒకోసారి ఏమీ చేయలేము. మనసు విషాదంగా ఉన్నపుడు హుషారునిచ్చే పాటలు పాడుకోవాలి గానీ ఇంకా విషాదాన్ని పెంచేపాటలు ఎందుకు బాబు అనేవారూలేకపోలేదు. కానీ ఒకోసారి “బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్” అన్న దేవదాసు మాటలు గుర్తుచేసుకోక తప్పదు. ఎలాంటి భావాన్నైనా తన స్వరంలో అద్భుతంగా పలికించి శ్రోతలను తన్మయత్వంలో ముంచేసే బాలుగారు ఇలాంటి పాటలు పాడే అవకాశం వచ్చినపుడు తన స్వరంతో ఆపాటలో మరిన్ని...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.