కొన్ని అనివార్య కారణాల వలన నా ఈ బ్లాగుకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించదలచాను. ఒక ఐదారు నెలల పాటు ఈ బ్లాగులో ఏ విధమైన కొత్త టపాలు ప్రచురించను. బ్లాగ్ ఓపెన్ యాక్సెస్ తోనే ఉంటుంది. ఇదివరకు ప్రచురించిన టపాలు చూడతలచిన వారు వచ్చి చూడవచ్చు. వెళ్ళేముందు సంధర్బశుద్ది లేకపోయినా నాకు టాటా అన్న పదం వినగానే గుర్తొచ్చే ఓ పాట గురించి చెప్తాను.
నాకు పాత సినిమా పాటలు పరిచయమైన కొత్తలో ఘంటసాల మాష్టారి పాటలు అంటే మా ఊరి టెంట్ హాల్ లో వేసే నమో వెంకటేశ, ఏడుకొండలవాడా లాంటి భక్తిపాటలు, పాడుతా తీయగా, కొండగాలి తిరిగిందీ గుండె ఊసులాడింది లాంటి మధురమైన గీతాలు మాత్రమే అని ఓ అభిప్రాయం ఉండేది. మొదటి సారి ఈ పాట విన్నపుడు కెవ్ మని కేకేసాను :-) ఎలాంటి మూడ్ అయినా నేను మెప్పించగలనోయ్...