కొన్ని పాటలు వింటున్నపుడు ఆ పాటలు మనం మొదటి సారి విన్నప్పటి పరిస్థితులు లేదా ఆ పాటను తరచుగా విన్నప్పటి పరిస్థితులు అలా సినిమా రీళ్ళలా కదులుతూ ఉంటాయి. పాట తో పాటు అప్పటి వాతావరణం, పక్కన ఉన్న వ్యక్తులు, ఙ్ఞాపకాలూ అన్నీ కాన్వాస్ పై అలా కదులుతుంటాయి. నాకైతే ఒకోసారి ఆ సమయం లో పీల్చిన గాలి తో సహా గుర్తొస్తుంటుంది. ఈ పాట అలాటి పాటలలో ఒకటి. ఎనభైలలో విజయవాడ వివిధభారతి కార్యక్రమం లో తరచుగా వినే ఈ పాట ముందు వచ్చే కోయిల కుహు కుహు లూ, అందమైన సంగీతం విన్న మరుక్షణం ఏదో తెలియని మధురమైన అనుభూతికి లోనవుతాను. సాయంత్రం మొక్కలకు నీళ్ళుపోసేప్పుడు అప్పటి వరకూ ఎండకి ఎండిన మట్టి నుండి వచ్చే మధురమైన సువాసన ముక్కుపుటాలకు తాకిన అనుభూతికి గురౌతాను.పాట రాసినది వేటూరి గారే...