
ఘంటసాల మాష్టారి గాత్ర మాధుర్యమో, శ్రీ రామ కథ లోని మహత్తో, పెండ్యాల వారి సంగీత మహిమో లేదా అసలు హరికధా ప్రక్రియ గొప్పతనమే అంతో నాకు సరిగా తెలియదు కానీ, ఈపాట ఎన్ని సార్లు విన్నా ఒళ్ళు పులకరిస్తూనే ఉంటుంది. రేలంగి, నాగేశ్వరరావు, కృష్ణకుమారి లపై చిత్రీకరించిన ఈ పాట లో విశేషమేమిటంటే.. చిత్రీకరణ లో ఎక్కడా శ్రీరామ కళ్యాణాన్ని చూపించరు కానీ కనులు మూసుకుని పాట వింటుంటే మాత్రం కళ్యాణ ఘట్టం అంతా కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇది రాసినది శ్రీశ్రీ గారు అని మొదటి...