గత వారం రోజులు గా ఎందుకో ఈ రెండు పాటలూ పదే పదే గుర్తొస్తున్నాయి సో టపాయించేస్తే ఓ పనైపోతుంది అని మొదలెట్టాను. అసలు ఈ టపా కి సరైన శీర్షిక ఓ క్లాసిక్... ఓ జానపదం అయి ఉండేదేమో. ముందు క్లాసిక్ గురించి... జంధ్యాల గారి ముద్దమందారం సినిమాలో వేటూరి గారు రాసిన ఈ పాట చాలా బాగుంటుంది. సాహిత్యం గొప్ప గా లేకపోయినా చిన్న చిన్న పదాలలో మంచి భావాలని పలికించారు వేటూరి గారు... రమేష్‌నాయుడు గారి సంగీతం ఆహ్లాదం గా ఉంటే... ఇక బాలు గాత్రం అద్భుతమైన వన్నె తెస్తుంది మనసుకు హాయినిస్తుంది. ఒక సారి విని చూడండి.... 05.Neelalu Kareena...చిత్రం : ముద్దమందారంసాహిత్యం : వేటూరిసంగీతం : రమేష్ నాయుడుగానం : బాలునీలాలు కారేనా కాలాలు మారేనానీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనాజాజి...