అప్పుడు నేను పిడుగురాళ్ళ జడ్పీ హైస్కూల్ లో 7 లేదా 8 వ తరగతి చదువుతున్నాను. నాకు మొదటి నుండి సాధారణమైన పాటలకన్నా ఏదో ఒక ప్రత్యేకత ఉన్న పాటలు ఎక్కువ ఇష్టం. దానికి తోడు మనం చిరంజీవి కి వీరాభిమనులం. నిజం చెప్పొద్దూ, నేనేంటి లెండి మా ఇంట్లో ఇంటిల్లి పాది చిరు అభిమానులమే. మాలాంటి కుటుంబాలు అంధ్రాలో ఎన్నో... అవి చూసుకునె కదా మా బాసు కి రాజకీయాలు అనే ఆలోచన వచ్చింది. సరే ఆ టైము లో ఛాలెంజ్ సినిమా విడుదలైంది అందులోని "ఇందువదన కుందరదన" అనే పాట కొంచెం హడావిడి గా ప్రాసలతో నోరు సరిగా తిరగని వాళ్ళు పాడటం కొంచెం కష్టం గా వుండేది. పాట సాహిత్యం పెద్ద గా లేక పోయినా స్వరం బావుండటం మరియూ పదాల అల్లిక నన్ను చాలా ఆకర్షించేయడం తో ఒక నాలుగైదు సార్లు కష్ట పడి ఈ పాట పాడటం...