సోమవారం, డిసెంబర్ 22, 2008

బృందావని - తిల్లాన - బాలమురళీకృష్ణ

రుద్రవీణ సినిమా లో ప్రఖ్యాత సంగీత కళాకారుని కొడుకైన కధానాయకుడు కట్టెలు కొట్టుకునే వాళ్ళ దగ్గరకు వెళ్ళినపుడు వాళ్ళు "మీ నాన్నగారి పాట యినే అదృష్టం మాకెలాగూ లేదు మీరైనా మాకోసం ఏదైనా ఓ పాట పాడండయ్యా.." అని మన కధానాయకుడిని అడుగుతారు దానికతను ఓ మంచి ఆలాపన తో మొదలు పెట్టగానే కొందరు నోళ్ళు తెరుచుకుని అర్ధం కాని మొహంతో చూస్తుంటే, మరికొందరు బుర్ర గోక్కుంటూ ఉంటే, మరికొందరు దిక్కులు చూస్తూ ఉంటారు, తను కొంచెం విరామం ఇవ్వగానే అందరూ కలిసి "కాస్త మంచి పాట పాడండయ్యా..."...

ఆదివారం, నవంబర్ 16, 2008

ఓ క్లాసు... ఓ మాసు... :-)

గత వారం రోజులు గా ఎందుకో ఈ రెండు పాటలూ పదే పదే గుర్తొస్తున్నాయి సో టపాయించేస్తే ఓ పనైపోతుంది అని మొదలెట్టాను. అసలు ఈ టపా కి సరైన శీర్షిక ఓ క్లాసిక్... ఓ జానపదం అయి ఉండేదేమో. ముందు క్లాసిక్ గురించి... జంధ్యాల గారి ముద్దమందారం సినిమాలో వేటూరి గారు రాసిన ఈ పాట చాలా బాగుంటుంది. సాహిత్యం గొప్ప గా లేకపోయినా చిన్న చిన్న పదాలలో మంచి భావాలని పలికించారు వేటూరి గారు... రమేష్‌నాయుడు గారి సంగీతం ఆహ్లాదం గా ఉంటే... ఇక బాలు గాత్రం అద్భుతమైన వన్నె తెస్తుంది మనసుకు హాయినిస్తుంది. ఒక సారి విని చూడండి.... 05.Neelalu Kareena...చిత్రం : ముద్దమందారంసాహిత్యం : వేటూరిసంగీతం : రమేష్ నాయుడుగానం : బాలునీలాలు కారేనా కాలాలు మారేనానీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనాజాజి...

మంగళవారం, అక్టోబర్ 07, 2008

మా ఊరు ఒక్క సారి (పంట చేల)--పాలగుమ్మి

ముందుగా తన టపా ద్వారా ఈ పాటను పరిచయం చేసిన సిరిసిరిమువ్వ గారికి నెనర్లు. ఆపై ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే నాదవినోదిని గురించి చెప్పి పాలగుమ్మి వారి ఫోన్ నంబరు ఇచ్చిన సి.బి.రావు గారికి నెనర్లు. నేను ఇండియా వెళ్ళినప్పుడు పాలగుమ్మి వారితో మాట్లాడి నాదవినోదిని నాగరాజు గారి నంబరు తీసుకుని, సరిగ్గా వచ్చే ముందు రోజు అప్పటికే 36 గంటలు గా స్వల్ప విరామం తో చేసిన ప్రయాణాన్ని లెక్క చెయ్యకుండా... మరుసటి రోజు అమెరికాకు చేయాల్సిన 20 గంటల ప్రయాణాన్ని కూడా మరచి బాగ్‌లింగంపల్లి లో నాగరాజు గారి ఇల్లు వెతికి పట్టుకుని ఈ కేసేట్ సంపాదించాను.కానీ ఇంతా శ్రమపడి "తాళం వేసితిని కానీ గొళ్ళెం మరిచితిని" అన్న చందాన కేసెట్ సంపాదించాను కానీ నా దగ్గర ప్లేయర్ లేదన్న విషయం విస్మరించాను....

శనివారం, ఆగస్టు 02, 2008

పూవులేవి తేవే చెలీ

అదే సమయం లో వచ్చిన మరో అందమైన లలిత గీతం.. సురస.నెట్ నుండి మనందరికోసం. Poovulevi Teve Che...పూవులేవి తేవే చెలీ పోవలే కోవెలకూ ||3||తుమ్మెద కాలూననివీ, దుమ్ము ధూళి అంటనివి ||2||కమ్మగ వలచేవి, రకరకమ్ముల వన్నెలవీ ||2|||| పూవులేవి ||ఆలసించెనా, పూజా వేళ మించిపోయెనా ||2||ఆలయమ్ము మూసి పిలుపాలింపడు నా విభుడూ ||2|| || పూవులేవి ||మాలలల్లుటెపుడే? నవమంజరులల్లేదెపుడే ||2||ఇక పూలే పోయాలి తలబ్రాలల్లే స్వామి పైన ||2|||| పూవులేవి...

గురువారం, జులై 31, 2008

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే !!

ఓ నాల్రోజులు గా ఎందుకో ఈ పాట పదే పదే గుర్తొస్తుంది. ఈ పాట సాహిత్యమో లేదా mp3 నో దొరుకుతుందేమో అని వెతుకుతుంటే ఓ నెల క్రితం సుజాత(గడ్డిపూలు) గారు కూడా ఈ పాట గుర్తు చేసుకోడం చూసాను. మొత్తం మీద నా కలక్షన్ నుండి తవ్వి తీసి సాహిత్యం తో పాటు వినడానికి లింక్ కూడా ఇస్తే అందరూ మరో సారి ఈ మధురమైన పాట ని ఆస్వాదిస్తారు, తెలియని వాళ్ళకి పరిచయం చేసినట్లూ ఉంటుంది అని ఈ రోజు ఈ పాట ఇక్కడ మన అందరి కోసం. పాలగుమ్మి గారి సాహిత్యం వేదవతీ ప్రభాకర్ గారి గానం తో ఈ పాట చాలా హాయైన అనుభూతినిస్తుంది.Amma Donga Ninnu C...సాహిత్యం: పాలగుమ్మి విశ్వనాథ్సంగీతం : పాలగుమ్మి విశ్వనాథ్గానం : వేదవతీ ప్రభాకర్అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా.. ||2||కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ...

గురువారం, జులై 24, 2008

అలలు కలలు ఎగసి ఎగసి...

ఈ రోజు ఉదయం ఆరు దాటి ఒక పది నిముషాలు అయి ఉంటుందేమో నేను ఆఫీసుకు బయల్దేరి బస్ కోసం నడుస్తూ నా IPOD లో యాదృచ్చిక పాటలు (Shuffle songs కి ఇంతకన్నా మంచి పదం దొరకలేదు నా మట్టిబుర్రకి) మీట నొక్కగానే మొదట గా ఈ పాట పలకరించింది. సూర్యోదయమై ఓ అరగంట గడిచినా, ఇంకా సూర్యుడు మబ్బుల చాటు నే ఉండటం తో ఎండ లేకుండ మంచి వెలుతురు. అటు చిర్రెత్తించే వేడి ఇటు వణికించే చలీ కాని ఉదయపు ఆహ్లాదకరమైన వాతావరణం లో ఈ పాట వింటూ అలా నడుస్తుంటే. ఆహా ఎంత బావుందో మాటల లో చెప్ప లేను. ఈ పాట కి సంభందించిన ప్రతి ఒక్కరినీ పేరు పేరు నా పొగడకుండా ఉండ లేకపోయాను. మీకు తెలుసా ఈ పాట ఇళయరాజా గారు పాడారు. ఈ పాట లో స్వరాలు వచ్చేప్పుడు నాకే తెలీకుండా నా వేళ్ళు నాట్యం చేస్తాయి ఇక తకతుం..తకతుం......

ఆదివారం, జులై 13, 2008

పరువమా..చిలిపి పరుగు తీయకూ..

ఒకో రోజు ఉదయం నిద్ర లేచింది మొదలు రోజంతా ఒకే పాట పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. Haunting or something అంటారే అలా అనమాట. మీకూ అలా ఎప్పుడైనా అనిపించిందా....మీరు గమనించి ఉండరేమో కాని ఖచ్చితం గా మీరూ ఫేస్ చేసి ఉంటారు. ఏదో ఒక పాట ఉదయాన్నే రేడియో లో విన్నదో ఎవరన్నా ఇంట్లో వాళ్ళు హమ్ చేసిందో అలా సడన్ గా మనల్ని అంటుకుని రోజంతా అదే పాట గుర్తొస్తుంటుంది. నాకు ఈ రోజు నిద్ర లేవగానే ఎందుకో ఈ పాట గుర్తొచ్చింది రోజు మొత్తం మీద ఒక 10-15 సార్లు హమ్ చేసి ఉంటాను ఇక లాభం లేదు అని బ్లాగ్ లో పెట్టేస్తున్నా. చిన్నపుడు అప్పుడప్పుడూ ఉదయం పూట రేడియో లో విజయవాడ కేంద్రం వివిధ భారతి కార్యక్రమం లో వేసే వాడీ పాట. చాలా సార్లు విన్నట్లు గుర్తు. మొదటి సారి ఈ పాట విన్నపుడు ప్రారంభం...

సోమవారం, జులై 07, 2008

సొగసు చూడ తరమా !..

ఇది గుణశేఖర్ రెండవ సినిమా అనుకుంటా, తన మొదటి సినిమా లాఠీ లో వయొలెన్స్ ఎక్కువ ఉంటుంది అది హిట్ కాకపోయినా కొన్ని సీన్స్ చాలా బావుంటాయ్. ఇతను రెండో సినిమా పూర్తి వ్యతిరేకం గా చాలా సాఫ్ట్ సబ్జెక్ట్ తీసుకుని భార్యా భర్తల మధ్య రిలేషన్ ని చక్కగా చూపిస్తాడు. ఇందులో ఆర్ట్ వర్క్ వైవిధ్యం గా బావుంటుంది, ఈ సినిమా లోని ప్రింటెడ్ చీరలు సొగసు చూడ తరమా చీరలు గా కొంత కాలం బాగానే హవా కొనసాగించాయనుకుంటా... ఇంద్రజ characterization and presentation సినిమా కే హైలెట్.నేను ఇంజనీరింగ్ చదివే రోజులలో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్స్ పరం గా హిట్ అవునో కాదో గుర్తు లేదు కాని అప్పటి యువత హృదయాలలో మాత్రం బాగానే చోటు సంపాదించుకుంది. ఈ సినిమా లో కొన్ని పాటలు ప్రత్యేకించి...

గురువారం, జూన్ 26, 2008

అయ్యోలూ..హమ్మోలు..ఇంతేనా!!

మనకున్న సీరియలోఫోబియా !! (అలా హశ్చర్యపడిపోయేస్తే కష్టం, మాయాబజార్ లో్ "ఎవరూ పుట్టించక పోతే మాటలెలా పుడతాయ్" అన్న ఘటోత్కచుడ్ని ఆదర్శం గా తీసుకుని నేనే కనిపెట్టా ఈ పదం). సరే ఏదో ఒకటి ఏడూ... అని అనేసారని నాకు వినపడిందిలే. సో మనకున్న సీరియలోఫోబియా తో మొదట్లో ఈ అమృతం సీరియల్ జోలికి వెళ్ళే వాడ్ని కాదు. కానీ కొంచెం పాపులర్ అయిన తర్వాత ఇంట్లో బలవంతం గా కూర్చో పెట్టేసి చూయించారు.మొదట్లో నేను చూసిన ఎపిసోడ్స్ లో కామెడీ కధ కన్నా పాటలకి పేరడీ లు కట్టి వెటకారం చేయడం ఎక్కువ ఉండేది కొన్ని ఎంత బాగా నచ్చేవో కొన్ని అంత చిరాకూ తెప్పించేవి. తర్వాత కొన్ని రోజులకి అన్నీ నచ్చడం మొదలు పెట్టాయి మెల్లగా నేను కూడా Addict అయిపోయాను. మరీ పనులు మానుకుని కాక పోయినా ఆదివారం...

సోమవారం, జూన్ 23, 2008

వాసంత సమీరం లా

ఏవో కొన్ని ప్రోగ్రాం లు, పండగల కి ప్రత్యేకించి తీసిన టెలీఫిల్మ్ లు తప్ప అంత గా ఆకట్టుకోని కార్యక్రమాల మధ్య బాగా ప్రాచుర్యాన్ని పొందిన మొదటి తెలుగు ధారా వాహిక ఋతురాగాలేనేమో. అప్పట్లో నాకు తెలిసి ఆదివారం ఉదయం వచ్చే రామాయణం తర్వాత మా ఊరిలో దాదాపు ప్రతి ఇంట్లోను ఒకే సమయం లో high volume లో పెట్టుకుని చూసే ప్రోగ్రాం లో ఇది ఒకటి. ఋతురాగాలు దూర దర్శన్ లో సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేది అనుకుంటాను, స్కూల్ / కాలేజి నుండి ఇంటికి వచ్చే టైము. నాకు ఇంకా బాగా గుర్తు, ఇంటికి వస్తుంటే దారి పొడవునా ప్రతి ఇంట్లోనూ ఈ పాట మార్మోగిపొతుంటుంది. నేను ఈ సీరియల్ ఎప్పుడూ చూడక పోయినా ఈ పాట మాత్రం చెవులు రిక్కించి వినే వాడ్ని. ప్రారంభం లో వచ్చే ఝుం తన నం తననం... వినగానే చాలా...

గురువారం, జూన్ 19, 2008

బండి కాదు మొండి ఇదీ

"అప్పట్లో" అని అంటూ ఈ రోజు పోస్ట్ మొదలు పెడుతుంటే, హఠాత్తుగా "అహ నా పెళ్ళంట" సినిమా లో "మా తాతలు ముగ్గురు..." అని అంటూ ఆటో బయోగ్రఫీ చెప్పే నూతన్ ప్రసాద్ గారు గుర్తొచ్చి నాకే నవ్వు వచ్చింది, నేను కూడా అలా తయారవుతున్నానా అని. అయినా స్వగతం అంటూ బ్లాగడం మొదలు పెట్టాక తప్పదు కదా. అయినా ఇంచు మించు అదే రేంజ్ లో సుత్తి కొట్టినా కనీసం అందులో నూతన్ ప్రసాద్ గారి లా కట్టేసి కూర్చో పెట్టి వినింపించడం లేదు కదా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను :-)సరే ఇక విషయానికి వస్తే మొన్న ఒక రోజు ఆన్‌లైన్ లో ఏదో న్యూస్ క్లిప్పింగ్ విడియో చూస్తుంటే, దానిలో పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి చెప్తూ "బండి కాదు మొండి ఇది" పాట ని నేపధ్యం లో వినిపిస్తున్నారు అది వినగానే ఔరా అనిపించింది....

సోమవారం, జూన్ 16, 2008

తాళి కట్టు శుభవేళ

నిన్నటి జూనియర్ పాట తర్వాత ఈ పాట కూడా బాగా గుర్తొచ్చింది సరే అని పోస్ట్ చేస్తున్నాను. ఈ పాట ప్రభావమో లేకా మిమిక్రీ కి మామూలు గానే అంత క్రేజ్ వుందో తెలీదు కాని, అప్పట్లో మా ఇంట్లో చిన్న టేప్ రికార్డర్ వుండేది దాని లో రక రకాల శబ్దాలు మిమిక్రీ చేయడానికి ప్రయత్నించి రీకార్డ్ చేసే వాడ్ని. చేతి బొటన వేలు, చూపుడు వేలు కి మధ్య వుండే గాడి ని నోటికి perpendicular గా పెట్టుకుని "కూ...చుక్ చుకు" అంటూ వేసే ట్రైన్ కూత, ఇంకా ట్రైన్ రన్నింగ్ సౌండ్ ఒకటి చాలా బాగా వచ్చేది అప్పట్లో. మా చిన్న మామయ్య గారు "నాయనా శుయోధనా" అంటూ శకుని డైలాగులు , ఇంకా వేటగాడు లో రావు గోపాల రావు గారి "గాజు గది గాజు గది అని నువ్వట్టా మోజు పడి..." అనే డైలాగులు భలే చెప్పేవారు.మా నాన్న గారు...

ఆదివారం, జూన్ 15, 2008

జూనియర్.. జూనియర్

ఈ పాట ఇంకా అంతులేని కధ లో మిమిక్రీ పాట నచ్చని చిన్న పిల్లాడు వుండడేమో... ఈ పాట నాకు చాలా ఇష్టం చిన్నపుడు ఈ పాట పదే పదే వినే వాడ్ని కాని తీరా సినిమాకు తీసుకు వెళ్ళినప్పుడు మాత్రం ఈ పాట వచ్చే సరికి నేను నిద్ర పోయానుట. నిద్ర లేపితే కూడ సరిగా చూడ లేదు అని చెప్పేది అమ్మ. అసలు మనం చిన్నప్పుడు కొంచెం వెరైటీ లెండి. మా ఇంట్లో సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళం. ఒక సారి నేను నిద్ర పోయాక అలానే నన్ను ఎత్తుకుని సెకండ్ షో కి ఏదో రాజుల సినిమా కి తీసుకు వెళ్ళారుట (అక్బర్ సలీం అనార్కలి అనుకుంటా). మనకి సినిమా మధ్యలో మెలకువ వచ్చి కొంచెం సేపు సినిమా చూసి, నాకు నచ్చ లేదు, అసలు నన్ను అడగకుండా ఇలాంటి చెత్త సినిమాకి ఎవరు తెమ్మన్నారు పదండి వెళ్ళిపోదాం అని గొడవ చేస్తే. పాపం...

బుధవారం, జూన్ 04, 2008

కలిసి వుంటే కలదు సుఖము

నేను చిన్నపుడు నరసరావుపేట్ లో ఉండే వాళ్ళం అని చెప్పాను కదా. అమ్మ ట్రైన్ లొ వర్క్ కోసం గుంటూరు వెళ్ళి వచ్చేది, రోజూ రెండు గంటల పైనే జర్నీ పాపం వెళ్ళి రావడానికి. సో లంచ్ కి బాక్స్ తీసుకు వెళ్ళి వచ్చేప్పుడు స్టేషన్ లో నాకు మెలొడీ ఇంకా రక రకాల చాక్లేట్లు తెచ్చేది. అవి ఎంజాయ్ చేసి ఊరికే ఉండకుండా సాయంత్రం అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాక్స్ తీసుకుని కమల్‌హాసన్ లాగా స్టైల్ కొడుతూ "కలిసి వుంటే కలదు సుఖము" అని మరోచరిత్ర సినిమా లో పాట పాడుతూ బాక్సు మీద దరువు వేస్తూ డాన్సు వెస్తుంటె అమ్మా నాన్న అందరూ చూసి తెగ నవ్వుకునే వాళ్ళు (ఈ పాటలో కమల్ కూడా అలానే సరిత లంచ్ బాక్సు మీద దరువు వేస్తూ పాడాతాడు లెండి). మనకి చిన్నప్పుడు ఇలాంటి కోతి వేషాలు కూడ అలవాటనమాట యంటీఆర్...

శనివారం, మే 31, 2008

ఇందువదన కుందరదన - ఛాలెంజ్

అప్పుడు నేను పిడుగురాళ్ళ జడ్పీ హైస్కూల్ లో 7 లేదా 8 వ తరగతి చదువుతున్నాను. నాకు మొదటి నుండి సాధారణమైన పాటలకన్నా ఏదో ఒక ప్రత్యేకత ఉన్న పాటలు ఎక్కువ ఇష్టం. దానికి తోడు మనం చిరంజీవి కి వీరాభిమనులం. నిజం చెప్పొద్దూ, నేనేంటి లెండి మా ఇంట్లో ఇంటిల్లి పాది చిరు అభిమానులమే. మాలాంటి కుటుంబాలు అంధ్రాలో ఎన్నో... అవి చూసుకునె కదా మా బాసు కి రాజకీయాలు అనే ఆలోచన వచ్చింది. సరే ఆ టైము లో ఛాలెంజ్ సినిమా విడుదలైంది అందులోని "ఇందువదన కుందరదన" అనే పాట కొంచెం హడావిడి గా ప్రాసలతో నోరు సరిగా తిరగని వాళ్ళు పాడటం కొంచెం కష్టం గా వుండేది. పాట సాహిత్యం పెద్ద గా లేక పోయినా స్వరం బావుండటం మరియూ పదాల అల్లిక నన్ను చాలా ఆకర్షించేయడం తో ఒక నాలుగైదు సార్లు కష్ట పడి ఈ పాట పాడటం...

శనివారం, మే 24, 2008

విధాత తలపున

అప్పుడు నేను 9 వ తరగతి చదువుతున్నా అనుకుంటా. నాకో నేస్తం వుండే వారు చిత్తరంజన్ అనీ ఇప్పుడు ఎక్కడ వున్నారో తెలీదు. అప్పట్లో మా ఇంటికి దగ్గరలో ఒక రికార్డింగ్ షాపు పెట్టారు. నాకు పేరు పెట్టి పిలిచే చనువు వున్నా నాకంటే కొంచెం పెద్ద లెండి. తన గురించి తన కుటుంబం తో నా అనుబంధం గురించి తర్వాత వ్రాస్తాను. నాకు తీరిక దొరికినప్పుడల్లా నేను ఎక్కువ సమయం ఆ షాపు లోనే పాటలు వింటూ గడిపే వాడ్ని. తను రికార్డింగ్ తో పాటు చిన్న చిన్న రిపేర్లు కూడా చేస్తుండే వాడు. నేను చాలా ఆసక్తి గా గమనించే వాడ్ని. పాడైపోయిన టేప్ రికార్డరు మోటారు తో ఒక చిన్న ఫేన్ తయారు చేసారు తను అప్పట్లో అది నాకు ఓ అద్భుతం చాలా సరదాగా అనిపించేది.నేను ఏదో ఒక మాస్ సినిమా పాటలు రికార్డ్ చేయించుకోడానికి...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.