శనివారం, జనవరి 18, 2020

సిత్తరాల సిరపడు...

అల వైకుంఠపురములో చిత్రంలోని ఒక చక్కని శ్రీకాకుళం జానపదాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాటను ఫైట్ కోసం వాడిన తీరు దీనికి యాక్షన్ కొరియోగ్రఫీ చాలా చక్కగా కుదిరియి. పాటను ఆడియోలో రిలీజ్ చేయకుండా సర్ ప్రైజ్ గా ఉంచడంతో మరింత ఆకట్టుకుంటుంది. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అల వైకుంఠపురములో (2020)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : విజయ్ కుమార్ బల్ల
గానం : సూరన్న, సాకేత్ కొమండూరి

సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
పట్టుబట్టినాడ ఒగ్గనే ఒగ్గడు
పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు
(మంతనాలు చేసినాడు చిత్తరాల సిరపడు)
ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు
(ఊరూరు ఒగ్గేసినా ఉద్దండుడు ఒగ్గడు)

ఆఆఆఆ... ఆఆఆఆ...

బుగతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతె
బుగతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతె
కొమ్ములూడదీసి మరీ పీపలూదినాడురో

జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే
జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే
దెయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు

ఆఆఆఆ... ఆఆఆఆ...

అమ్మోరి జాతరలో ఒంటితల రావణుడు
అమ్మోరి జాతరలో ఒంటితల రావణుడు
గుంటలెంట పడితేను గుద్ది గుండ సేసినాడు
గుంటలెంట పడితేను గుద్ది గుండ సేసినాడు

(వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటె
వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటె
ఈడీదుకుంటు పోయి ఈడ్చుకొచ్చినాడురో
ఈడీదుకుంటు పోయి ఈడ్చుకొచ్చినాడురో)

పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే
రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మికుమ్మి పోయాడు
రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మికుమ్మి పోయాడు

ఆఆఆఆ... ఆఆఆఆ...

పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప
పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప
ఒడుపుగా ఒంటిసేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు
ఒడుపుగా ఒంటిసేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు

సాముసెసే కండతోటి దేనికైనా గట్టిపోటీ
సాముసెసే కండతోటి దేనికైనా గట్టిపోటీ
అడుగడుగు యేసినాడా అదిరేను అవతలోడు

సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
ఉత్తరాన ఊరిసివర సిత్తరాల సిరపడు
గండుపిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు

సక్కనమ్మ ఎనకబడ్డ పోకిరోళ్ళ ఇరగదంతె
సక్కనమ్మ ఎనకబడ్డ పోకిరోళ్ళ ఇరగదంతె
సక్కనమ్మ కళ్ళల్లో యేలయేల సుక్కలొచ్చె
సక్కనమ్మ కళ్ళల్లో యేలయేల సుక్కలొచ్చె

()లో ఉన్న లైన్స్ సినిమాలోనివి ఈ ఆడియో లో లేవు. ఈ శ్రీకాకుళం జానపదంలో నాకు తెలిసిన కొన్ని అర్ధాలు ::

ఒగ్గడు = వదలడు, మంతనాలు = చర్చలు, ఉద్దండుడు = గొప్పవాడు/ఘటికుడు, బుగత = భూస్వామి/రైతు, ఆంబోతు = ఎద్దు, పీప = కొమ్ముబూర / సన్నాయి, గుంటలెంట = అమ్మాయిలవెంట, గుండ = పొడి, గుంటగాళ్ళు = పిల్లలు, నాగలేని = లాగలేని

సిరపడు అనే పదాన్ని శ్రీకాకుళం ప్రాంతంలో పెంకితనం, అల్లరి పిల్లలను ఉద్దేశించి ఎక్కువగా వాడుతుంటారు. సిరపడు అంటే.. ‘పెద్దగా బలం లేదు.. అయినా చురుకైన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. మంతనాలు, పెత్తనాలు చేస్తుంటాడు..’ అని అర్థం.

పాట నేపథ్యం గురించి రచయిత మాటల్లో ఇక్కడ చదవండి.

ఇంకేవైనా పదాలకు అర్థం కావాలంటే అడగండి.


4 comments:

It's a fine song. Great lyrics music styling and above all ethnic vocals.

థాంక్స్ అజ్ఞాత గారు.. హండ్రడ్ పర్సెంట్ అగ్రీ విత్ యూ...

ఈ మూవీలో అన్ని పాటలూ అద్భుతహ..

నిజమేనండీ.. ఈ మధ్యకాలంలో ఇలా ఆల్బమ్ లో అన్ని పాటలు బావున్న సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.