సాహిత్యానికి సంగీతమో సంగీతానికి సాహిత్యమో తెలియదు కానీ ఈ పాటలో రెండూ ఒకదానికి ఒకటి అన్నట్లు ఒదిగి పోతాయి. పల్లవిలో ఉన్న ఫోర్స్ చరణాలలో కొంచెం తగ్గినట్లు కనిపిస్తుంది కానీ మొత్తం పాట విన్నపుడు ఒకే రకమైన ఉత్తేజాన్ని ఇస్తుంది. పల్లవి ఎత్తుగడ మాత్రం అద్భుతం సాహిత్యం పరంగా కానీ సంగీత పరంగా కానీ. నేను వాకింగ్ చేసేప్పుడు వినే ప్లేలిస్ట్ లో ఈ పాట మొదట ఉండేది (అంటే వాకింగ్ చేసింది కొద్దిరోజులైనా ఇలాటి అర్భాటలకు తక్కువ చేసే వాడ్ని కాదులెండి:-) నిజం చెప్పద్దూ, ఇదీ, ముత్తులో ఒకడే ఒక్కడు మొనగాడు, తమ్ముడు లో look at my face లాంటి పాటలు వింటూ జిమ్ కెళ్తే వచ్చే ఆ ఉత్సాహం ఆనందం మాటల్లో చెప్పలేం అంటే నమ్మండి. సరే మరి మీరు విని ఉండక పోతే ఒకసారి వినేయండి.
చిత్రం : భద్రాచలం
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : శంకర్ మహదేవన్, చిత్ర
ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు..
బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు..
కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ
ఏమైన గానీ ఎదురేది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు
నిద్ర నీకొద్దు నీకేది హద్దు
||ఒకటే||
రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ తప్పట్లే గుండెలలో మోగాలీ
నీ నుదిటీ రేఖలపై సంతకమే చేస్తున్నా
ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం
నీలికళ్ళలో మెరుపూ మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయాల్లో గేయం ఊదాలి
||ఒకటే||
నిదరోకా నిలుచుంటా.. వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా.. కన్నీటీ బొట్టువలె
అడుగడుగు నీ గుండె ..గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో.. ఎదురొచ్చి శుభమవుతా
రాసిగ పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా
చేతులు చాచిన స్నేహంలా ...
ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లుఔతుంది...
||ఒకటే||
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : శంకర్ మహదేవన్, చిత్ర
ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు..
బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు..
కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ
ఏమైన గానీ ఎదురేది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు
నిద్ర నీకొద్దు నీకేది హద్దు
||ఒకటే||
రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ తప్పట్లే గుండెలలో మోగాలీ
నీ నుదిటీ రేఖలపై సంతకమే చేస్తున్నా
ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం
నీలికళ్ళలో మెరుపూ మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయాల్లో గేయం ఊదాలి
||ఒకటే||
నిదరోకా నిలుచుంటా.. వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా.. కన్నీటీ బొట్టువలె
అడుగడుగు నీ గుండె ..గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో.. ఎదురొచ్చి శుభమవుతా
రాసిగ పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా
చేతులు చాచిన స్నేహంలా ...
ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లుఔతుంది...
||ఒకటే||
ఈ నూతన సంవత్సరం ఈ పాటలా మీలో ఉత్తేజాన్ని నమ్మకాన్ని నింపి మీకందరికీ అన్ని శుభాలను చేకూర్చాలని, మీరు కోరుకున్న రీతిలో జీవిస్తూ సుఖసంతోషాలను మీ సొంతం చేసుకోవాలని ఆశిస్తూ... అందరికీ 2010 నూతనసంవత్సర శుభాకాంక్షలు, కాస్త ముందుగా :-)
good post and wish you the same..
రిప్లయితొలగించండితృష్ణ గారు నెనర్లు.
రిప్లయితొలగించండిపాట వినడానికే కాదండీ, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది.. సినిమా చూసే ధైర్యం చేయలేదు కానీ టీవీలో ఈ పాట చాలా సార్లు చూశాను.. నిజంగానే సింధు మీనన్ చాలా బాగుంది.. 'చందమామ' లో చేసింది ఈ అమ్మాయే అంటే మొదట నమ్మ బుద్ధి కాలేదు నాకు!! ఇప్పుడు గుర్తు రావడం లేదు కానీ 'పల్లెటూరు' అంటూ మరో పాట ఉంటుంది ఈ సినిమాలో.. అది కూడా చాలా బాగుంటుంది.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..
రిప్లయితొలగించండిమురళి గారు నెనర్లు. నిజమే వీడియో కూడా బాగానే ఉంటుంది ఇందాక హడావిడిగా దొరికిన వీడియో పెట్టేశాను ఇపుడు టపా అసలైన వీడియోతో సరిచేశాను. రిలేటెడ్ వీడియోస్ లో మీరు చెప్పిన ఇదే సినిమాలోని ’ఇదే నా పల్లెటూరు’ వీడియో కూడా ఉంది చూడండి.
రిప్లయితొలగించండిబాగుంది :)
రిప్లయితొలగించండినూతన సంవత్సర శుభాకంక్షలు..
"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html
పాట స్క్రిప్టు కి ధన్యవాదములు.
రిప్లయితొలగించండినూతన సంవత్సర శుభాకంక్షలు..
Monkey2man గారు నెనర్లు.
రిప్లయితొలగించండిశ్రీనిక గారు నెనర్లు..
వేణు,నాకు ఈ పాట ఒక్కాదానికీ ఆ సినిమా చూసిన సమయానికి విలువ దొరికింది అనుకున్నాను. పాట, చిత్రీకరణ అంతా బాగా ఉత్తేజాన్ని ఇస్తాయి కదా? పాడినతీరు కూడా ఇమిడిపోయినట్లుగా..
రిప్లయితొలగించండిఉష గారు నెనర్లు. మీరు చెప్పింది అక్షర సత్యం.
రిప్లయితొలగించండి