
తెలుగులో బాగా ప్రాచుర్యాన్ని పొందిన పాటలు చాలా ఉన్నా నాకు ఎందుకో ఈ "నిండు చందమామ.." పాట చాలా ఇష్టం. సహజంగా జాబిలి అంటే ఉన్న ఇష్టం వల్లనో తెలియదు. తనగొంతులోని మాధుర్యమో తెలియదు. సాహిత్యం లోని అందమో తెలియదు కారణమేదైనా నాకు చాలా నచ్చిన పాట ఇది. మొదటి సారి అలవోకగా విన్నపుడు పాత పాట కనుక పి.బి. శ్రీనివాస్ గారు పాడారేమో అనుకున్నాను కానీ గొంతు ఏసుదాస్ గారిదిలా ఉందే అని తర్వాత క్యాసెట్ పై చూసి అచ్చెరువొందాను. ఈన అప్పుడే ’63 లోనే తెలుగు సినిమాకు పాడారా అని. ఆరుద్ర గారి సాహిత్యం మదిలో గిలిగింతలు పెడితే, కోదండపాణి గారి సంగీతం హాయిగా సాగిపోతుంది. ఇక ఏసుదాస్ గారి గాత్రం గురించి చెప్పనే అక్కరలేదు. ప్రత్యేకించి "నిండు చందమామ" కు ముందు "ఓ ఓ ఓ ఒ ఒ ఒ ఓ.." అని పలికినపుడు ఆహా అనిపించక మానదు. మీరు కూడా విని ఆనందించండి.
ఈ పాట వినాలంటే చిమట మ్యూజిక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చిత్రం : బంగారు తిమ్మరాజు (1963)
సంగీతం : యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం : కె.జె.ఏసుదాస్
ఓ నిండు చందమామ నిగ నిగలా భామ
ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా..
ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ...
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే..
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే..
మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ..
మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ..
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా..
ఓ ఓ ఓ నిండు
దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే..
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే..
దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే..
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే..
నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే..
నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే..
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే..
ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ....
సంగీతం : యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం : కె.జె.ఏసుదాస్
ఓ నిండు చందమామ నిగ నిగలా భామ
ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా..
ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ...
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే..
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే..
మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ..
మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ..
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా..
ఓ ఓ ఓ నిండు
దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే..
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే..
దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే..
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే..
నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే..
నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే..
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే..
ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ....
ఏసుదాస్ గారి గురించి చెప్పి ’గొరితెర గావ్ బడా ప్యారా’ వీడియో ఇవ్వకుండా ముగించాలని అనిపించడం లేదు అందుకనే ఈ పాటకు తగ్గ విజువల్స్ తో కూర్చిన ఈ అందమైన వీడియో మీకోసం.
ఈ పాట మొదటి రోజుల్లో పాడటం వల్ల అనుకుంటాను,జేసుదాస్ గొంతులో గంభీరత్వం కంటే ఫ్రెష్ నెస్ ఎక్కువగా కనపడుతుంది కదూ వేణూ! అందుకే ఆ పాట ఆయన మిగతా పాటలకంటే భిన్నంగా, ప్రత్యేక మైన ఫ్లేవర్ తో ఉంటుంది.
రిప్లయితొలగించండిఈ బ్లాగు ఇన్నాళ్ళూ చూడటానికి ఏదో ఒక కారణం చేత కుదరలేదు. అభినందనలు. ఇలాంటి బ్లాగొకటి నేనే మొదలు పెడదామనుకుంటూనే ఆలస్యం చేసేశాను. చాలా బావుంది.
నిజమే సుజాత గారు మీరు చెప్పిన కారణమే అయి ఉంటుంది. 70 లలోని పాటలు చాలావరకు ఇలానే ఉంటాయి. వ్యాఖ్యకు నెనర్లు.
రిప్లయితొలగించండిఈ బ్లాగ్ మొదలుపెడదాము అనుకున్న చాలా రోజులకు కుదిరిందండీ.. టపాలు కూడా తరచుగా ప్రచురించడంలేదు కనుక మీ కంటపడి ఉండదు.
మంచి పాట వినిపించినందుకు ధన్యవాదాలు. నేను కూడా ఇది PBS పాడేరని అనుకున్నాను మొదట. ఈ సినిమా '64 లో విడుదలైందనుకుటాను (??). జేసుదాస్ మంచి కుటుంబం (1965) లో కూడ ఒక పాట పాడినట్లు గుర్తు (ప్రేమించుట పిల్లల వంతు).
రిప్లయితొలగించండిkk గారు నెనర్లు. ఓ అవునా మంచి కుటుంబం గురించి నాకు తెలియదండి.
రిప్లయితొలగించండిచాలా రోజులకి ఈ పాట గుర్తు చేసారండి. చాలా బాగుంటుంది. ఈ రోజు వింటూఉంటే ఇంకా ఫ్రెష్ గా ఉంది. ఆ గొంతులో తీయదనం మరచిపోలేము. థాంక్యూ.
రిప్లయితొలగించండిజయ గారు నెనర్లు.
రిప్లయితొలగించండి