ఇక రెండవది మెగాస్టార్ మరో ఫ్లాప్ మూవీ "డాడీ.." లోనిది. నటీ నటులు అంతా సీరియస్ గా మాట్లాడుతూనే మనల్ని భలే నవ్వించేస్తారు. మిస్ కమ్యునికేషన్ ఎలాంటి గజిబిజి కి దారి తీస్తుందో ఈ సన్నివేశం ఒక ఉదాహరణ. ఇంచు మించు ఇలాంటిదే మిమిక్రీ కేసట్ లలో ఒక జోక్ వినిపిస్తారు. అది రెండు రేడియో స్టేషన్ లు ఒక రేడియో స్టేషన్ లో వచ్చే పశువుల పెంపకం మరో స్టేషన్ లో వచ్చే సౌందర్య పోషణ రెండు మిక్స్ అయిపోయి పండించే హాస్యం సన్నివేశం. ఇక ఈ సన్నివేశం కాస్త ఇబ్బందికరం గా అనిపించినా మంచి హాస్యాన్ని అందిస్తుంది. సన్నివేశానికి ఉపోద్ఘాతం ఏమిటంటే యంయస్. నారాయణ & కో తీసే మోటార్ బైక్ యాడ్ లో నటించడానికి ఒక హీరో కావాలని అతనిని ఇంటికి రమ్మని చెప్పి అతని కోసం ఎదురు చూస్తుంటారు, అదే సమయం లో చిరు, రాజేంద్ర ప్రసాద్ అద్దె ఇంటికోసం వస్తారు, ఇక మీరే చూసి నవ్వుకోండి.
యూట్యూబ్ వీడియో అందించిన తెలుగుఒన్ మరియూ gani000 లకు ధన్యవాదాలు.
ha ha ha :)
రిప్లయితొలగించండిThank you నేస్తం గారు.
రిప్లయితొలగించండిమొదటిది ఈ మధ్య కూడా 'జెమినీ' లో ఈ సినిమా వచ్చినపుడు చూసాను. రెండొదీ గుర్తే ;)
రిప్లయితొలగించండిఉష గారు నెనర్లు.
రిప్లయితొలగించండి