Pages

శుక్రవారం, అక్టోబర్ 16, 2009

నీవుంటే -- స్నేహం (1977) by Bapu

ఈ సినిమా ను దానిలోని పాటలను తన వ్యాఖ్యల ద్వారా నాకు పరిచయం చేసిన కృష్ణగీతం బ్లాగర్ భావన గారికి, పాటలను అందించిన స్వరాభిషేకం బ్లాగర్ రమేష్ గారికి, తృష్ణవెంట బ్లాగర్ తృష్ణ గారికి, దీప్తిధార బ్లాగర్ సిబిరావు గారికి ధన్య వాదాలు తెలుపుకుంటూ, ఇంత మంచి పాటలను నా బ్లాగ్ లో పెట్టకుండా ఉండలేక ఈ పాటల సాహిత్యాన్నీ, వినడానికి వీలుగా వీడియో మరియూ ఆడియో లింకు లను ఇక్కడ పొందుపరుస్తున్నాను. అందరికి మరో మారు ధన్యవాదాలు. నీవుంటే వేరే కనులెందుకూ అంటూ సాగే పాట పల్లవి ఎంత మధురంగా ఉందో.. సినారే గారికి నిజంగా హ్యాట్సాఫ్. ఆహ్లాదకరమైన సంగీతాన్నందించిన కె.వి.మహదేవన్ గారికి డబల్ హ్యాట్సాఫ్...



చిత్రం : స్నేహం.
సంగీతం : కె.వి.మహదేవన్.
సాహిత్యం : సి.నారాయణరెడ్డి.
గానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం

నీవుంటే వేరే కనులెందుకూ
నీ కంటె వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోని.. అడుగులు నావె
నా పాటలోనీ.. మాటలు నీవె

||నీవుంటె వేరే కనులెందుకూ
నీ కంటె వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోని.. అడుగులు నావె
నా పాటలోనీ.. మాటలు నీవె
నీవుంటే వేరే కనులెందుకూ||

నా ముందుగ నువ్వుంటే తొలిపొద్దు
నువ్వు చెంతగ లేకుంటే చీకటీ
నా ముందుగ నువ్వుంటే తొలిపొద్దు
నువ్వు చెంతగ లేకుంటే చీకటీ
నీ చేయి తాకితే..తీయని వెన్నెల
చేయి తాకితే.. తీయని వెన్నెల
అలికిడి వింటేనే తొలకరి ఝల్లు

||నీవుంటే వేరే..||

నిన్న రాతిరి ఓ.. కలవచ్చిందీ
ఆ కలలో ఒక దేవత దిగివచ్చిందీ
నిన్న రాతిరి ఓ..కలవచ్చిందీ
ఆ కలలో ఒక దేవత దిగివచ్చిందీ
చందమామ కావాలా.. ఇంద్రధనవు కావాలా
అమ్మ నవ్వు చూడాలా.. అక్క ఎదురు రావాలా
చందమామ కావాలా.. ఇంద్రధనువు కావాలా
అమ్మ నవ్వు చూడాలా.. అక్క ఎదురు రావాలా
అంటు అడిగిందీ దేవత అడిగిందీ
అప్పుడు నేనేమన్నానో తెలుసా

వేరే కనులెందుకనీ నీకంటే..వేరే బ్రతుకెందుకనీ
లాలాల లాల లలలలలాల...
లాలాల లాల లలలలలాల.

*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
ఇదే చిత్రం లోని మరో అందమైన పాట


చిత్రం: స్నేహం
సంగీతం : కెవి మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలసుబ్రహ్మణ్యం

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల ||నవ్వు||
గొదారి పాడింది గల గలా.. ||2||
దానిమీద నీరెండ మిల మిల

||నవ్వు వచ్చిందంటే||

నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా(2)
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే(2)
ఎవరెంత చేసుకుంటే...
ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల..

ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా ఆ అ ఆఆఅ
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా
కొత్త మతం పుచ్చుకుంటె గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువా

నవ్వువచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల..

తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే
పరులకింత పెట్టినదే పరలోకం పెట్టుబడి
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
గోదారి పాడింది గల గల
కధలెన్నొ చెప్పింది ఇలా ఇలా...

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వలా


యూట్యూబ్ వీడియో అందచేసిన hyderabadee గారికి ధన్యవాదాలు.

13 కామెంట్‌లు:

  1. నిజంగానే ఇవి ఎప్పటికైనా ఆనందాన్ని కలిగించే పాటలే. చాలా కాలం తరువాత మళ్ళీ విన్నాను. థాంక్స్. మీకు దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. జయ గారు నెనర్లు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. venu gaaru, now you have to see this link also...hope you will like this song too..(from "sneham")

    http://trishnaventa.blogspot.com/2009/07/blog-post_22.html

    రిప్లయితొలగించండి
  4. తృష్ణ గారు నెనర్లు. చూశాను, సాహిత్యం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. వేణు గారు క్షమించాలి వేరే బ్లాగ్ లో చెయ్యాల్సిన కామెంట్ పొరబాటున దీనిలో చేసేసాను దయచేసి పై కామెంట్ తొలగించండి
    క్షనిస్తారు కదూ .....
    వేణు గారు మంచి పాటలను అందిస్తున్నారు
    మిమ్మల్ని ఆర్కుట్ తెలుగు సాంగ్ లిరిక్స్ లో కూడా చూసాను

    keep going like this.

    రిప్లయితొలగించండి
  6. నేస్తం గారు నెనర్లు.

    కార్తీక్ గారు నెనర్లు. మీ కామెంట్ డిలీట్ చేశాను. మీరు వ్రాసిన కామెంట్ మీరు కూడా డిలీట్ చేయగలరు, ఈ సారి అవసరమైనపుడు ప్రయత్నించి చూడండి. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. ఈ పాటని కనీసం కొన్ని వందల సార్లు అక్కడక్కడా వ్యాఖ్యగానో, సంభాషణల్లోనో వాడివుంటాను. నాకు ఇందులో హలం పాత్ర చాలా ఇష్టం. మొత్తం సాహిత్యం ఇన్నాళ్ళకి ఇచ్చినందుకు థాంక్స్!

    రిప్లయితొలగించండి
  8. ఆ పైన వ్యాఖ్య "నవ్వు వచ్చిందటే..." పాటకి.


    ఇక ఆ స్నేహం పైన వ్రాసిన

    నిన్న రాతిరి ఓ..కలవచ్చిందీ
    ఆ కలలో ఒక దేవత దిగివచ్చిందీ
    చందమామ కావాలా.. ఇంద్రధనవు కావాలా
    అమ్మ నవ్వు చూడాలా.. అక్క ఎదురు రావాలా
    చందమామ కావాలా.. ఇంద్రధనువు కావాలా
    అమ్మ నవ్వు చూడాలా.. అక్క ఎదురు రావాలా
    అంటు అడిగిందీ దేవత అడిగిందీ
    అప్పుడు నేనేమన్నానో తెలుసా

    -- అసలు నా స్నేహితులెవరికీ నేనీ పాటలో జీవించకపోవటం తెలియదు. అంతగా ఆ పాటలోని మాటలు నాకు వేదాల్లా అధ్యయనమైపోయాయి. భలే గాఢానుభూతిని ఇస్తాయి.

    రిప్లయితొలగించండి
  9. ఉషగారు నెనర్లు. మీ స్నేహితులు నిజంగా అదృష్టవంతులు :-)

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.